YSRCP : స్థానిక సంస్థల ఎన్నికలపై సుప్రీంకోర్టును ఆశ్రయించిన వైసీపీ..
- స్థానిక ఎన్నికలపై సుప్రీంకోర్టులో వైసీపీ పిటిషన్
- దాడులు, బెదిరింపులతో నామినేషన్లకు ఆటంకాలంటూ ఆరోపణ
- అభ్యర్థులకు పోలీసు భద్రత కల్పించాలని విజ్ఞప్తి
- నామినేషన్ల గడువు పెంచాలని కోరిన వైసీపీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆంధ్రప్రదేశ్‌లో మున్సిపల్ తదితర స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ తీవ్ర ఉద్రిక్తతల మధ్య సాగుతున్న వేళ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YSRCP) సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. రాష్ట్రంలో జరుగుతున్న భారీ హింస, దాడుల కారణంగా తమ పార్టీ అభ్యర్థులు నామినేషన్లు వేయలేకపోతున్నారని పేర్కొంటూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఎన్నికల సమయంలో అధికార పార్టీ ఒత్తిళ్లు, పోలీసుల అడ్డుగింపుల వల్ల పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల్లో తమ అభ్యర్థులకు నామినేషన్లు దాఖలు చేయడంలో తీవ్రమైన ఆటంకాలు ఎదురవుతున్నాయని అందులో వెల్లడించింది.
భద్రత కల్పించాలి.. నామినేషన్ల గడువు పెంచాలి
ఎన్నికల నామినేషన్ల ప్రక్రియలో అభ్యర్థులు ఎదుర్కొంటున్న ఇబ్బందికర పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని అత్యవసరంగా విచారించాలని వైసీపీ కోరింది. నామినేషన్లు వేయడానికి వెళ్లే తమ పార్టీ అభ్యర్థులు, నాయకులకు ఎటువంటి భయభ్రాంతులు లేకుండా తగిన పోలీసు రక్షణ కల్పించాలని విజ్ఞప్తి చేసింది. నామినేషన్ల దాఖలుకు ఇప్పటికే గడువు ముగుస్తున్నందున, అభ్యర్థుల సౌలభ్యం కోసం గడువును వెంటనే పొడిగించడంతో పాటు ఎంపిక చేసిన ప్రాంతాల్లో అదనపు నామినేషన్ కేంద్రాలను ఏర్పాటు చేయాలని కోరింది. నామినేషన్ల ప్రక్రియ ఎటువంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా, ప్రశాంతంగా , పారదర్శకంగా జరిగేలా తగిన చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టును అభ్యర్థించింది. రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు సర్వోన్నత న్యాయస్థానం స్పందించి తగిన ఆదేశాలు జారీ చేస్తుందని ఆ పార్టీ వర్గాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి.
Also Read
- YSRCP : వైసీపీకి ఏపీ హైకోర్టులో ఎదురుదెబ్బ.. పారామిలిటరీ బలగాల పిటిషన్ కొట్టివేత
- CM Chandrababu: ఏపీ అభివృద్ధే లక్ష్యం.. అమరావతి నుంచి రాయలసీమ వరకు అభివృద్ధి..
- CM Chandrababu: ఓటు ఒక ఆయుధం.. ప్రజాస్వామ్యంలో స్థానిక సంస్థల ఎన్నికలు కీలకం
- Deputy CM Pawan Kalyan: రోడ్డు ధ్వంసం చేసిన వారిపై నాన్ బెయిలబుల్ కేసులు.. పవన్ కల్యాణ్ ఆదేశాలు
తాజావార్తలు
-
YSRCP : స్థానిక సంస్థల ఎన్నికలపై సుప్రీంకోర్టును ఆశ్రయించిన వైసీపీ..
-
WPL 2027 Auction: 27 స్థానాల కోసం 146 మంది ప్లేయర్లు.. WPL వేలం తేదీ, వేదిక ఖరారు..!
-
Manvanth Kumar: సంచలనం.. తొమ్మిదో స్థానంలో బ్యాటింగ్ వచ్చి సెంచరీ కొట్టిన కర్ణాటక ఆల్‌రౌండర్..!
-
Honey Trap: హైదరాబాద్‌లో హనీ ట్రాప్ కలకలం.. నకిలీ ఖాతాలతో వేల మందికి టోకరా
-
Italy Protests: ఇటలీలో జెన్-ఆల్ఫా విధ్వంసం.. రూ. 4,400 కోట్లు బూడిద!
ట్రెండింగ్
-
BCCI Chief Selector: టీమిండియా చీఫ్ సెలెక్టర్‌గా ప్రజ్ఞాన్ ఓజా.. సెలక్షన్ కమిటీలోకి రమేష్ పవార్.!
-
WhatsApp: ప్రైవసీ నుంచి మెసేజ్ మేనేజ్మెంట్ వరకు.. వాట్సాప్‌లో ఎప్పుడయినా ఈ ఫీచర్స్‌ను ఉపయోగించారా.?
-
Vaibhav Sooryavanshi: ఆ ముగ్గురిలో ఒకరు తప్పుకుంటూనే వైభవ్ సూర్యవంశీకి ఛాన్స్.. మాజీ క్రికెటర్ సంచలన వ్యాఖ్యలు.!
-
108MP+50MP సెల్ఫీ కెమెరా, 6000mAh బ్యాటరీతో రాబోతున్న HMD Vibe 2 Max..!
-
Niki Prasad History: ఔరా నిఖీ ప్రసాద్.. తొలి భారత క్రికెటర్‌గా అరుదైన రికార్డు.. ఇప్పటివరకు ఎవరి వల్ల కాలేదు!