418 Trailer: నేను కచ్చితంగా తల్లినై తీరాలి.. బయపెట్టేస్తున్న ‘418’ ట్రైలర్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
418 Movie Trailer Thrills: టాలీవుడ్ ప్రేక్షకులకు సరికొత్త భయానక అనుభూతిని కలిగించేందుకు మరో సినిమా సిద్దమైంది. స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ సమర్పణలో హారర్ థ్రిల్లర్ మూవీ ‘418-ది నైట్మేర్ బిగిన్స్’ వస్తోంది. కీర్తన్ నడగౌడ దర్శకత్వం వహించిన ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, వై.రవిశంకర్ నిర్మించారు. అక్టోబరు 23న 418 ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా ట్రైలర్‌ను చిత్ర బృందం తాజాగా విడుదల చేసింది.
ఒక నిమిషం 54 సెకండ్ల నిడివిగల ట్రైలర్.. ‘నేను తల్లినై తీరాలి.. కచ్చితంగా తల్లినై తీరాలంతే’ అనే డైలాగ్‌తో ఆరంభం అయింది. ప్రతి సీన్ భయపెట్టేలా ఉంది. ట్రైలర్‌ను అత్యంత ఉత్కంఠభరితంగా రూపొందించారు. నటి చైత్ర ఆచార్ నటన, ఆమె పలికించిన భయానక హావభావాలు ట్రైలర్లో ప్రత్యేకంగా నిలిచాయి. విభిన్నమైన సీరియస్ ఇంటెన్స్ హారర్ థ్రిల్లర్‌గా తీర్చిదిద్దినట్లు ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. ట్రైలర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటూ సినిమాపై భారీ అంచనాలను పెంచేస్తోంది.
Also Read
- Mamitha Baiju: నేను హీరోయిన్.. ఇప్పటికీ అర్థం కావడం లేదు.. మమితా బైజు ఆసక్తికర వ్యాఖ్యలు!
- Sai Pallavi: సీత పాత్రతో చాలా నేర్చుకున్నా.. సాయి పల్లవి ఆసక్తికర వ్యాఖ్యలు.!
- Yash: రావణుడిగా ఎవరైనా చేస్తారు.. రాముడి పాత్ర అంత ఈజీ కాదు: యశ్
- Nitesh Tiwari: ఆర్జీవీ 'శివ'తో మొదలైంది నా తెలుగు సినిమా పిచ్చి.. రామాయణ డైరెక్టర్!
సుమారు 15 ఏళ్లుగా ఎవరికీ ప్రవేశం లేకుండా మూసి ఉన్న ఒక భవనంలోని ‘418’ నంబర్ గది చుట్టూ తిరిగే భయానక రహస్యాల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. ఆ రూమ్ వెనుక ఉన్న మిస్టరీని చేధించడానికి ప్రయత్నించే విద్యార్థులకు ఎదురయ్యే భయానక అనుభవాలే ఈ చిత్ర కథ. వెంకీ జీజీ అందించిన బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్, దినేష్ దివాకరన్ సినిమాటోగ్రఫీ అదనపు బలంగా నిలిచాయి. ఇందులో చైత్ర ఆచార్, సూర్య రాజ్ వీరభతిని, చరణ్ లక్కరాజు, ప్రీతి పగడాల, శశాంక్ పాటిల్, రమేష్ ఇందిర తదితరులు కీలక పాత్రలు చేశారు. 418 మూవీ తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో విడుదల కానుంది.
తాజావార్తలు
-
418 Trailer: నేను కచ్చితంగా తల్లినై తీరాలి.. బయపెట్టేస్తున్న ‘418’ ట్రైలర్!
-
Mohan Bhagwat: ఆర్ఎస్ఎస్ శతాబ్ది ఉత్సవాల్లో మోహన్ భగవత్ కీలక వ్యాఖ్యలు.. “ప్రభుత్వాలు మారినంత మాత్రాన పరిస్థితులు మారవు”
-
Mamitha Baiju: నేను హీరోయిన్.. ఇప్పటికీ అర్థం కావడం లేదు.. మమితా బైజు ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Tiger Shroff Firing Case: టైగర్ ష్రాఫ్ కేసులో కొత్త కోణం.. రూ.2 లక్షల ఆశ చూపి నా కొడుకును లాగారు..!
-
AB Venkateswara Rao: వంగవీటి రాధాపై ఏబీ వెంకటేశ్వరరావు ఆసక్తికర వ్యాఖ్యలు.. ఇది రాజకీయ పోరాటమే!
ట్రెండింగ్
-
29kmpl మైలేజ్, 160PS పవర్, పనోరమిక్ సన్‌రూఫ్ తో Renault Duster Hybrid E-Tech లాంచ్..
-
Asian Para Games: తొలిరోజే 11 పతకాలు..! ఆసియా పారా గేమ్స్‌లో భారత్‌కు అదిరిపోయే ఆరంభం..
-
India Playing XI: రోహిత్-గిల్ ఓపెనర్స్.. కోహ్లీ మూడో స్థానంలో.! 2027 ప్రపంచ కప్ జట్టును ఎంపిక చేసిన టీమిండియా మాజీ ప్లేయర్.!
-
New Recharge Plans: డేటా అవసరం లేదా? కొత్త రీఛార్జ్ ప్లాన్స్ వచ్చేశాయ్.. రూ.185 నుంచి మొదలు.!
-
WPL 2027 Auction: 27 స్థానాల కోసం 146 మంది ప్లేయర్లు.. WPL వేలం తేదీ, వేదిక ఖరారు..!