విజయనగరం జిల్లాలో కేంద్ర మంత్రి డా మన్ సుఖ్ మాండవీయ పర్యటించారు. రూరల్ మండలం గుంకలాం లో జగనన్న హౌసింగ్ కాలనీ లే అవుట్ ను సందర్శించి లబ్ధిదారులతో మాట్లాడారు కేంద్ర మంత్రి. గృహ నిర్మాణ లే అవుట్ విశేషాలను కేంద్ర మంత్రికి వివరించారు జిల్లా కలెక్టర్ సూర్యకుమారి, జాయింట్ కలెక్టర్ మయూర్ అశోక్.
రాష్ట్రంలో అతి పెద్ద లే అవుట్లలో ఇది ఒకటని కేంద్రమంత్రికి వివరించారు జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు. గృహ నిర్మాణ కాలనీల్లో ఇళ్ల నిర్మాణం కోసం అవసరమైన నీరు, విద్యుత్, రోడ్లు తదితర వసతులు రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తున్నట్లు తెలిపారు జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు. జిల్లాలో 82 వేల మంది లబ్ధిదారులకు ఇళ్లు మంజూరు చేశామని కేంద్ర మంత్రికి తెలిపారు జాయింట్ కలెక్టర్.
కేంద్రం ప్రవేశ పెట్టిన గృహ నిర్మాణ కార్యక్రమం ద్వారా అత్యధికంగా లబ్ధి పొందుతున్న రాష్ట్రం ఈ రాష్ట్రమేనని పేర్కొన్నారు కేంద్ర మంత్రి డా మన్ సుఖ్ మాండవీయ. లబ్దిదారులు ఈ పథకం ద్వారా ఎలా ఇళ్లు నిర్మించుకుంటున్నదీ తెలుసుకున్నారు కేంద్ర మంత్రి. బొండపల్లి మండలం గొట్లాంలో నాడు – నేడు కింద ఆధునీకరించిన జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను సందర్శించారు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి డా. మన్ శుఖ్ మాండవీయ.
అనంతరం విద్యార్థులతో మాట్లాడారు కేంద్ర మంత్రి. రాష్ట్రంలో విద్యాభివృద్ధికి ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలను కేంద్ర మంత్రికి వివరించారు విద్యార్థులు. ఆనంతరం ప్రసిద్ధ పుణ్యక్షేత్రం రామతీర్థంలో శ్రీ సీతారామ స్వామి వారి ఆలయాన్ని దర్శించుకున్నారు కేంద్ర మంత్రి. ఆయనకు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు అర్చకులు. మంత్రి వెంట పర్యటనలో పాల్గొన్నారు జిల్లా కలెక్టర్ సూర్యకుమారి, జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు, ఎమ్మెల్సీ పీవీఎన్. మాధవ్, శాసన సభ్యులు బడుకొండ అప్పల నాయుడు, బీజేపీ నాయకులు.
Read Also: కేడర్‌కు సమాధానం చెప్పలేక హైదరాబాద్‌కు బాలినేని