క్రికెట్ ఆడుతుండగా పిడుగు పాటుతో ఓ యువకుడు కన్నుమూశాడు.. మరో ఎనిమిది మంది యువకులు గాయాలపాలయ్యారు.. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్‌లో జరిగింది.. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. చిత్తూరు జిల్లా మదనపల్లె శివారులోని ఈశ్వరమ్మ కాలనీలో శుక్రవారం సాయంత్రం క్రికెట్ ఆటకు ప్రారంభించారు స్థానిక యువకులు.. రెండు జట్లుగా విడిపోయి మ్యాచ్ ఆడుతున్నారు.. అయితే, అదే సమయంలో.. భారీ ఉరుములు, మెరుపులతో వర్షం కురవడం ప్రారంభమైంది.. క్రికెట్ ఆడుతూ.. ఎంజాయ్ చేస్తున్న ఆ యువకులు ఊహించని ఘటన జరిగింది.. పిడుగుపాటుతో రోషన్ అనే యువకుడు అక్కడిక్కడే ప్రాణాలు వదిలాడు.. మరో ఎనిమిది మంది యువకులు గాయాలపాలయ్యరు.. అయితే, క్రికెట్ ఆడుతుండగా.. వర్షం రావడంతో.. యువకులంతా ఒకే చోటుకు చేరడం.. అదే సమయంలో పిడుగు పడడంతో.. ఈ ఘటన జరిగినట్టు తెలుస్తోంది.