MLA Bala Nagi Reddy: వాలంటీర్ వ్యవస్థపై ఎమ్మెల్యే బాల నాగిరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు.. మేం మోసపోయాం..!
- వాలంటీర్ వ్యవస్థపై ఎమ్మెల్యే బాల నాగిరెడ్డి సంచలన వ్యాఖ్యలు..
- ‘మేం మోసపోయాం.. మా కొంప ముంచింది వాలంటీర్ వ్యవస్థే’..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
MLA Bala Nagi Reddy: మంత్రాలయం ఎమ్మెల్యే బాల నాగిరెడ్డి వాలంటీర్ వ్యవస్థపై చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి. వాలంటీర్ వ్యవస్థ కారణంగా తాము ప్రజలకు దూరమయ్యామని, ఈ వ్యవస్థను నమ్ముకొని తాము మోసపోయామని ఆయన బహిరంగంగా వ్యాఖ్యానించారు. వాలంటీర్ వ్యవస్థ తమ రాజకీయ భవిష్యత్తును దెబ్బతీసిందని, “వాలంటీర్ వ్యవస్థ మా కొంప ముంచింది” అంటూ తీవ్ర స్థాయిలో అసంతృప్తి వ్యక్తం చేశారు. వాలంటీర్లపై ఆధారపడటంతో ప్రజలకు న్యాయం చేయలేకపోయామని కూడా ఆయన అంగీకరించారు.
Read Also: Bheems Ceciroleo: సౌండ్ ఆఫ్ ఫెస్టివల్.. సంక్రాంతి సినిమాలకు ప్రాణం పోస్తున్న భీమ్స్ సిసిరోలియో!
Also Read
- Minister TG Bharath: కర్నూలులో జాబ్ మేళా ప్రారంభం.. యువతకు ఉద్యోగాలు.. కర్నూలుకు భారీ పెట్టుబడులు..!
- Pothireddypadu : పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ వద్ద భారీ ప్రమాదం.. తెగిపడిన 9వ గేటు
- Kurnool Ganesh Immersion: వినాయక నిమజ్జనంపై మంత్రి టీజీ భరత్ కీలక ప్రకటన.. కర్నూలులో ఎక్కడంటే?
- AP School Education Department: మెగా DSC-2025 నియామకంపై కీలక ప్రకటన.. విచారణకు ఆదేశించిన విద్యాశాఖ
“వాలంటీర్ వ్యవస్థను నమ్ముకొని మేము ప్రజలకు న్యాయం చేయలేకపోయాం. ప్రజలు–నాయకుల మధ్య దూరం పెరిగింది” అని బాల నాగిరెడ్డి వ్యాఖ్యానించారు. భవిష్యత్తులో తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే వాలంటీర్ వ్యవస్థను మళ్లీ తీసుకొచ్చే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ఇక పార్టీ అధినేత వైఎస్ జగన్‌పై కూడా ఎమ్మెల్యే పరోక్ష వ్యాఖ్యలు చేశారు. “ఇప్పుడు కూడా జగన్‌కు కార్యకర్తల దగ్గర ఫోటోలు దిగేందుకు సమయం దొరకడం లేదు” అని అన్నారు. ఈసారి అయినా కార్యకర్తలను నిరాశపరచకుండా సమయం కేటాయించి ఫోటోలు దిగాలని కోరారు. అలాగే, రానున్న ఎన్నికల్లో జగన్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే రాష్ట్రంలో ‘2.0 వ్యవస్థ’ను అమలు చేసి, తమను ఇబ్బందులు పెట్టిన అధికారులపై చర్యలు తీసుకుంటామని బాల నాగిరెడ్డి హెచ్చరించారు. జగన్ ఆ వ్యవస్థను అమలు చేయకపోతే, తన నియోజకవర్గంలో తానే 2.0 వ్యవస్థను అమలు చేస్తానని సంచలన ప్రకటన చేశారు. ఈ వ్యాఖ్యలు వైసీపీ అంతర్గత రాజకీయాల్లో కలకలం రేపుతున్నాయి. ముఖ్యంగా వాలంటీర్ వ్యవస్థపై అధికార పార్టీ ఎమ్మెల్యేనే ఈ స్థాయిలో విమర్శించడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది.
తాజావార్తలు
-
Asian Games 2026లో భారత్ షెడ్యూల్ ఇదే.. పాకిస్థాన్‌తో మ్యాచ్ ఎప్పుడంటే?
-
Turkey Earthquake: టర్కీలో భారీ భూకంపం.. 5.8 తీవ్రతతో కంపించిన భూమి
-
DoT SIM Card Warning: మీ పేరు మీద సిమ్‌ను వేరొకరు వాడుతున్నారా? మీకు రూ.50 లక్షల వరకు జరిమానా!, పైగా శిక్ష..
-
Faria: నేనింకా ఇల్లు కొనలేదు.. సందీప్ కిషన్ చెప్పాక కొనాలనుకున్నా.!
-
Danam Nagender: సుప్రీం తీర్పును స్వాగతిస్తున్నా.. ఎన్నికలు ఎప్పుడొచ్చినా రెడీ..!
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 11,000mAh బ్యాటరీతో కొత్త ట్యాబ్లెట్లు Xiaomi Pad 9, Pad 9 Pro లాంచ్..!
-
Mushroom Pulao: నాన్‌వెజ్‌ను తలపించే రుచితో హెల్తీ & టేస్టీ రెస్టారెంట్ స్టైల్ ‘మష్రూమ్ పులావ్’.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా.!
-
150+ స్పోర్ట్స్ మోడ్లు, 21 రోజుల బ్యాటరీతో Xiaomi Watch S5, Smart Band 11 లాంచ్.. ధర, ఫీచర్స్ ఇవే.!
-
100W ఫాస్ట్ ఛార్జింగ్, 200MP కెమెరా, 120Hz LTPO డిస్ప్లేతో Xiaomi 18 Pro లాంచ్.!
-
8500mAh బ్యాటరీ, ట్రిపుల్ స్టీరియో స్పీకర్లు, లైకా 200MP ట్రిపుల్ కెమెరాలతో కొత్త ఫ్లాగ్షిప్ Xiaomi 18 Pro Max వచ్చేసిందోచ్..!