కర్నూలు జిల్లా కల్లూరు మండలం చిన్నటేకూరులో ఏటీఎం మిషన్‌ను ఎత్తుకెళ్లేందుకు దొంగలు విఫలయత్నం చేశారు. బ్యాంక్ ఆఫ్ బరోడా కు చెందిన ఏటీఎంను పెకిలించిన దుండగులు.. టోయింగ్ వాహనంలో తరలిస్తుండగా.. స్థానిక యువకులు గమనించి అడ్డుకున్నారు. కర్నూలులో సినిమా చూసి చిన్నటేకూరుకు వెళ్లగా ఐచర్ వాహనంలో ఏటీఎం తరలిస్తున్న దృశ్యాలు కనిపించాయి.