TG Bharath vs Byreddy Siddharth Reddy: బైరెడ్డి సిద్ధార్థ రెడ్డిపై మంత్రి టీజీ భరత్ క్రిమినల్ పరువునష్టం దావా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
TG Bharath vs Byreddy Siddharth Reddy: కర్నూలులో రాజకీయంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మంత్రి టీజీ భరత్ తనపై అసత్య ఆరోపణలు చేశారంటూ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డిపై క్రిమినల్ పరువునష్టం దావా కేసు వేశారు. ఈ విషయాన్ని మంత్రి టీజీ భరత్ స్వయంగా వెల్లడించారు. తనపై మాత్రమే కాకుండా తన కుటుంబ సభ్యులపై కూడా అవమానకరమైన, రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారని మంత్రి ఆరోపించారు. బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి చేసిన వ్యాఖ్యలు పూర్తిగా అసత్యం, నిరాధారమైనవని ఆయన పేర్కొన్నారు. ప్రజల్లో తన ప్రతిష్టను దెబ్బతీయడం, తనపై ద్వేషభావం కలిగించడం లక్ష్యంగా ఉద్దేశపూర్వకంగా ఈ వ్యాఖ్యలు చేశారని ఫిర్యాదులో వివరించినట్లు సమాచారం.
ఇప్పటికే క్రిమినల్ పరువునష్టం దావా నమోదు చేసిన మంత్రి టీజీ భరత్, త్వరలోనే సివిల్ పరువునష్టం దావా కూడా వేస్తానని తెలిపారు. చట్టపరంగా పూర్తి స్థాయిలో పోరాడతానని ఆయన స్పష్టం చేశారు. ఈ పరిణామం కర్నూలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఇద్దరు నేతల మధ్య మాటల యుద్ధం మరింత ముదిరే అవకాశాలు కనిపిస్తున్నాయి.
Also Read
- CM Chandrababu Warning: పవన్ కల్యాణ్‌పై నోరు పారేసుకుంటే ఖబర్దార్.. చంద్రబాబు సీరియస్ వార్నింగ్
- CM Chandrababu: జొన్నగిరి ఇక ‘స్వర్ణగిరి’.. స్వర్ణాంధ్రకు నాంది పలికిన గోల్డ్ ప్రాజెక్ట్
- US Plane Crash: అమెరికా విమాన ప్రమాదం.. తెలుగు యువకుడు మృతి
- Byreddy Siddharth Reddy: “నన్ను తిట్టేవారికి బహుమతులు ఇస్తున్నారు”.. మంత్రి టీజీ భరత్‌పై బైరెడ్డి విమర్శలు..
కాగా, కర్నూలులో వైసీపీ నేత బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం విదితమే.. తనపై విమర్శలు చేసే వారికి మంత్రి టీజీ భరత్ బహుమతులు ఇస్తున్నారని ఆరోపించారు. రాజకీయ విమర్శలతో పాటు పలు అంశాలపై ఆయన తీవ్ర స్థాయిలో స్పందించారు. మంత్రి టీజీ భరత్ తనకు టికెట్ రాలేదని వ్యాఖ్యానిస్తున్నారని, “ఎమ్మెల్యే కావాలనే ఆశ నాకంటే మీకే ఎక్కువగా ఉన్నట్టుంది” అంటూ కౌంటర్ ఇచ్చారు. ఆత్మహత్య చేసుకున్న సతీష్ కుటుంబానికి ఏ ఫార్మా కంపెనీ నుంచి డబ్బులు వచ్చాయో చెప్పడానికి సిద్ధంగా ఉన్నానని తెలిపారు. అయితే తాను చెప్పిన వెంటనే ఆ కంపెనీ నుంచి డబ్బులు ఇవ్వలేదని చెప్పిస్తారని ఆరోపించారు. టీజీ వెంకటేష్ గౌరవం కోల్పోయారని, అహంకారంతో మాట్లాడుతున్నారని విమర్శించారు బైరెడ్డి.. మీసాలు తిప్పుకుని తిరిగేవాళ్లు మీసాలు దించుకుని మీ దగ్గరకు ఎవరు వచ్చారో చెప్పాలి అంటూ పరోక్ష వ్యాఖ్యలు చేశారు. ప్రశ్నించిన వారిపై కేసులు నమోదు చేస్తున్నారని ఆరోపించిన విషయం విదితమే..
తాజావార్తలు
-
Oppo New Mobile: 10,000mAh బ్యాటరీ, 50MP సెల్ఫీ కెమెరా.. లాంచ్‌కు ముందే లీకైన ఒప్పో A7 ప్రో మాక్స్ ఫీచర్స్ ఇవే..
-
Hamas: హమాస్‌కు కొత్త బాస్.. ఖలీల్ అల్-హయ్యా చేతుల్లోకి పగ్గాలు!
-
Ruturaj Gaikwad: ఎట్టకేలకు బంపర్ ఆఫర్ కొట్టేసిన రుతురాజ్ గైక్వాడ్.. కెప్టెన్‌గా నియామకం..
-
Telangana Health: జాతీయ స్థాయిలో మెరిసిన తెలంగాణ.. రూ.200 కోట్లు అదనపు నిధులు ప్రకటన..
-
FILM FOCUS : బాలీవుడ్ కు మంచి రోజులొచ్చాయా ?
ట్రెండింగ్
-
SAIL Recruitment: పరీక్ష లేకుండానే 1,110 అప్రెంటిస్ పోస్టులు.. దరఖాస్తు ఎక్కడ చేసుకోవాలంటే.?
-
Ferrari Amalfi Spider: ఫెరారీ కొత్త కన్వర్టిబుల్ సూపర్‌కార్ లాంచ్.. ధర ఎంతంటే?
-
Rohit Sharma: మజా ఉండదు కదా.. రిటైర్మెంట్ వార్తలపై తొలిసారి స్పందించిన రోహిత్ శర్మ!
-
Mahindra New SUV: ఆగస్టు 15న మహీంద్రా నుంచి కొత్త SUV.. స్కార్పియో N ఫేస్‌లిఫ్ట్ ఎంట్రీ ఖాయమేనా?
-
Paneer Tikka Recipe: ప్రోటీన్ రిచ్ ఫుడ్.. టేస్టీ “పన్నీర్ టిక్కా”ను ఇంట్లో సులువుగా చేసేయండి ఇలా.!