Akkineni Nagarjuna: తెలంగాణ మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపై నటుడు అక్కినేని నాగార్జున కోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. నాగార్జున నాంపల్లి మనోరంజన్ కోర్టులో పరువు నష్టం దావా వేశారు.
'గుజరాతీలు దుండగులు' అంటూ బీహార్ ఉప ముఖ్యమంత్రి, ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ చేసిన వ్యాఖ్యలపై క్రిమినల్ పరువు నష్టం కేసుకు సంబంధించి అహ్మదాబాద్‌లోని మెట్రోపాలిటన్ కోర్టు సోమవారం సమన్లు జారీ చేసింది.
నర్హత వేటుకు గురైన కారణంగా కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఢిల్లీలోని ప్రభుత్వ బంగ్లాను శుక్రవారం ఖాళీ చేశారు. లోక్‌సభ హౌజింగ్ కమిటీ ఇచ్చిన నోటీసు కారణంగా ఆయన నేడు బంగ్లాను ఖాళీ చేశారు. తన సామాన్లను ట్రక్కులో తరలించారు.
రాహుల్ గాంధీ వ్యవహారం జాతీయంగానే కాకుండా అంతర్జాతీయంగానూ చర్చనీయాంశమైంది. రాహుల్ గాంధీ అనర్హత విషయంలో పరిణామాలను గమనిస్తున్నామని అమెరికా ప్రకటించగా.. తాజాగా జర్మనీ స్పందించింది.
పార్లమెంటు సభ్యునిగా అనర్హత వేటు పడిన తర్వాత కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ స్పందించారు. తాను భారత్ స్వరం కోసం పోరాడుతున్నానని.. ఎంతవరకైనా వెళ్లడానికి సిద్ధంగా ఉన్నానని పేర్కొన్నారు. ప్రధాని నరేంద్ర మోదీని అవమానించేలా చేసిన వ్యాఖ్యకు పరువునష్టం కేసులో దోషిగా తేలిన ఒక రోజు రాహుల్‌పై అనర్హత వేటు పడడం గమనార్హం.
ఎంపీగా అనర్హత వేటు పడిన నేపథ్యంలో, క్రిమినల్ పరువునష్టం కేసులో హైకోర్టు నుంచి ఉపశమనం పొందకుంటే రాహుల్ గాంధీ ఢిల్లీలోని లుటియన్స్‌లోని తన అధికారిక బంగ్లాను ఒక నెలలోపు ఖాళీ చేయాల్సి ఉంటుందని ఒక అధికారి శుక్రవారం తెలిపారు. 2004లో లోక్‌సభ ఎంపీగా ఎన్నికైన తర్వాత రాహుల్‌గాంధీకి తుగ్లక్ లేన్ బంగ్లాను కేటాయించారు.
కాంగ్రెస్ పార్టీకి భారీ ఎదురుదెబ్బ తగిలింది. కాంగ్రెస్ ఎంపీ రాహుల్‌గాంధీపై అనర్హత వేటుపడింది. 2019 క్రిమినల్ పరువు నష్టం కేసులో దోషిగా తేలినందున లోక్ సభకు అనర్హుడయ్యాడు.