ఈ మధ్యకాలంలో వందల కోట్ల బడ్జెట్‌తో రూపొందుతున్న సినిమాలు కూడా గ్రాఫిక్స్ విషయంలో నెటిజన్లను మెప్పించలేక ట్రోలింగ్ బారిన పడుతున్నాయి. కానీ యంగ్ హీరో తేజ సజ్జ పరిమిత బడ్జెట్‌లోనూ వావ్ ఫ్యాక్టర్ ఉన్న విజువల్ సినిమాలతో సూపర్ హీరోగా ఎదుగుతున్నాడు. ‘హనుమాన్’ తర్వాత ఆయన జాగ్రత్తగా సినిమాలు ఎంచుకుని, పాన్ ఇండియా ప్రేక్షకులకు యూనివర్సల్ కంటెంట్ అందిస్తున్నాడు. తాజాగా, కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో తెరకెక్కిన ‘మిరాయ్’ ట్రైలర్ రిలీజ్ అయింది. ఈ ట్రైలర్ మైండ్ బ్లోయింగ్‌గా ఉంది. కేవలం మూడు నిమిషాల ట్రైలర్ మాత్రమే అయినా, సినిమాపై అంచనాలను విపరీతంగా పెంచింది.
Also Read : OG : పవన్ కళ్యాణ్ ‘OG’లో మరో హాట్ బ్యూటీ కన్ఫర్మా..!
ప్రారంభం నుండి ముగింపు వరకు ప్రతి ఫ్రేమ్ గూస్‌బంప్స్ ఇచ్చేలా ఉంది. ఈ మధ్యకాలంలో ఇంత యునానిమస్ పాజిటివ్ రెస్పాన్స్ పొందిన ట్రైలర్ మరొకటి రాలేదని చెప్పాలి. ట్రైలర్‌లో హీరో తేజ సజ్జ, విలన్ కోసం వెతికే తొమ్మిది శక్తివంతమైన గ్రంథాలు, వాటిని అడ్డుకునే యోధుడి పోరాటం, ఎనర్జిటిక్ యాక్షన్ స్టంట్స్, అడ్వెంచర్ ఎలిమెంట్స్ అందించిన విధంగా సన్నివేశాలు ఉన్నాయి.యోధుడిగా కనిపించబోతున్న తేజ.. మరోసారి సూపర్ హీరోగా ట్రైలర్‌తో సక్సెస్ అయ్యాడు. ట్రైలర్ చివర్లో శ్రీరాముడు షాట్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ విజువల్ ఎఫెక్ట్స్ విషయంలో సోషల్ మీడియాలో ప్రశంసలు పొందుతోంది. ఈ సినిమాలో డైనమిక్ హీరో మంచు మనోజ్, సీనియర్ హీరోయిన్ శ్రియ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. మొత్తంగా, ఈ ఫాంటసీ యాక్షన్-అడ్వెంచర్ సినిమా పాన్ ఇండియా ప్రేక్షకులకు అంచనాలను పెంచుతూ, సెప్టెంబర్ 12న బాక్సాఫీస్ దగ్గర సెన్సేషన్ క్రియేట్ చేయడానికి సిద్ధంగా ఉంది.