Nagarjuna: ఈ పాత్ర ఎలా ఒప్పుకున్నావ్ నాగ్?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ధనుష్ హీరోగా నటించిన కుబేర ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. ఈ సినిమాలో నాగార్జున పాత్ర గురించి ప్రత్యేకంగా చర్చ జరుగుతోంది. ఇందులో ఆయన దీపక్ అనే ఒక సీబీఐ ఆఫీసర్ పాత్రలో నటించాడు. కుబేరలో నాగార్జున పాత్ర ప్రస్తుతం టాక్ ఆఫ్ ది టాలీవుడ్ అయిపోయింది. నిజానికి నాగార్జున టాలీవుడ్‌లో టాప్ లీగ్ హీరోలలో ఒకరు. అలాంటిది ఆయన ధనుష్ అనే హీరో పక్కన క్యారెక్టర్ చేయడానికి ఒప్పుకోవడమే ఈ సినిమాకి మొదటి ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు. ఇలా టాప్ లీగ్‌లో సినిమాలు చేసే నాగార్జున ఇలాంటి సినిమాలో ఒక పాత్ర చేయడానికి ఒప్పుకోవాలంటే చాలా గట్స్ ఉండాలి.
Also Read:Kubera : కుడి ఎడమైందే..!
Also Read
- Sundeep Kishan: ‘సిగ్మా’పై కుట్రల వెనకుండి నడిపిస్తున్నది ఎవరో తెలుసు.. దొరికిపోతే మీకే ఎక్కువ నష్టం
- Mohan Babu: ఆ కష్టాలు నువ్వు పడలేవు నాని.. ఇండస్ట్రీ స్ట్రగుల్‌పై మోహన్ బాబు షాకింగ్ కామెంట్స్!
- Sumalatha: ఫిల్మ్ ఛాంబర్ మీట్.. జానీమాస్టర్ భార్య సుమలత హల్చల్.. వైరల్ అవుతున్న వీడియో!
- Sumalatha: జానీ మాస్టర్ అంటే ఎందుకు అంత భయం? వల్లభనేని అనిల్‌పై సుమలత ఫైర్!
ఆది కూడా నాగ్ కి ఉన్న రొమాంటిక్ ఇమేజ్ నుంచి బయటకు వచ్చి డీ గ్లామ్ రోల్ చేయడం అభినందనీయం. ఈ సినిమాలో నాగార్జున పర్ఫామెన్స్ గురించి ప్రేక్షకులు ప్రత్యేకంగా మాట్లాడుతున్నారు. కేవలం ప్రేక్షకులు మాత్రమే కాదు, విమర్శకుల నుంచి కూడా నాగార్జున మీద ప్రశంసలు వర్షం కురుస్తోంది. నిజానికి నాగార్జునకు ముందు నుంచి కొత్త దర్శకులను, ఇతర టెక్నీషియన్లను తెలుగు సినీ పరిశ్రమకు పరిచయం చేస్తాడనే పేరు ఉంది. ఇప్పుడు శేఖర్ కమ్ముల లాంటి సెన్సిబుల్ డైరెక్టర్ ఒక క్రైమ్ డ్రామా చేస్తానని ముందుకు వస్తే, ఆయన్ని ఎంకరేజ్ చేస్తూ పాత్ర ఒప్పుకోవడమే కాదు.
Also Read:Shekar Kammula : భారీ బడ్జెట్ కాదు.. ప్రేక్షకులు మెచ్చినవే పాన్ ఇండియా మూవీలు..
తెలుగు ప్రమోషన్స్ బాధ్యతలు కూడా తన భుజాల మీదే వేసుకున్నాడు. ఒక రాకంగా ఆయన మళ్లీ ఫుల్ ఫామ్‌లోకి వచ్చేసాడు. దీంతో కేవలం ప్రేక్షకులు, విమర్శకుల నుంచే కాదు, ఆయన అభిమానుల నుంచి కూడా ఈ పాత్రకు ఎనలేని రెస్పాన్స్ వస్తోంది. నటుడు అంటే సినిమాలో ఎలాంటి పాత్ర అయినా చేయాలి అనిపించేలా ఈ సినిమాలోని పాత్రలో ఒదిగిపోయాడు నాగార్జున. ముందు పాజిటివ్, తర్వాత నెగిటివ్, తర్వాత మళ్లీ పాజిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటించడం కత్తి మీద సాము లాంటి విషయం. అలాంటి పాత్రలో కూడా ఆయన నటించి, కొన్ని సన్నివేశాలలో కళ్లతోనే భావాలు పలికించిన తీరు అత్యద్భుతం అనే ప్రశంసలు కురుస్తున్నాయి.
తాజావార్తలు
-
Story Board : ఏఐతో జరుగుతున్న నష్టాలేంటి..? ట్రంప్ ప్రకటన దేనికి సంకేతం..?
-
Hyderabad City : హైదరాబాద్ పోలీస్ శాఖలో బిగ్ ఛేంజ్.. 76 ప్రాంతాల పరిధులు మార్పు
-
Mamata Banerjee: 2029 ప్రధాని అభ్యర్థిగా రాహుల్ గాంధీ ఓకేనా? మమతా బెనర్జీ ఏం చెప్పారంటే..
-
ODI World Cup 2027 Schedule: వన్డే వరల్డ్‌కప్ షెడ్యూల్ వచ్చేసింది.. భారత్ x పాకిస్థాన్ సమరం ఎప్పుడంటే!
-
Off The Record : బీఆర్ఎస్లో ఎమ్మెల్సీ టికెట్ల గందరగోళం! ఒక సీటు బీసీకేనా? అసలు లెక్కేంటి?
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?