ఉమ్మడి కర్నూలు జిల్లా పాలిటిక్స్ ఇప్పుడు బైరెడ్డి వర్సెస్ బైరెడ్డిగా మారుతున్నాయా అంటే.. అవును అనే విధంగానే ఆరోపణలు, విమర్శలు.. కౌంటర్లు, కౌంటర్ ఎటాక్‌లు నడుస్తున్నాయి.. కూటమి ప్రభుత్వంపై వైసీపీ నేత బైరెడ్డి సిధార్థ రెడ్డి విరుచుకుపడ్డారు. ఆడదాం ఆంధ్ర పై విచారణకు అదేశించడంపై వ్యంగాస్త్రాలు సంధించారు. అయితే, బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి కూటమి ప్రభుత్వంపై చేసిన విమర్శలకు ఘాటుగా స్పందించారు నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి.
ఏపీలో టికెట్ రేట్ ల పెంపు కోసం పుష్పా టీం మల్ల గుల్లాలు పడుతున్న నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ ఎంపీ చేసిన ఒక ట్వీట్ కలకలం రేపుతోంది. అయితే ట్వీట్ చేసిన కాసేపటికే దాన్ని డిలీట్ చేశారు. అయినా సరే అప్పటికే స్క్రీన్ షాట్లు అందుబాటులోకి వచ్చేయడంతో ఆ స్క్రీన్ షాట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అల్లు అర్జున్ గురించి ఆ ట్వీట్ చేసింది మరెవరో కాదు నంద్యాల తెలుగుదేశం పార్టీ ఎంపీ డాక్టర్…
ప్రస్తుతం లోక్‌సభ ఎన్నికల ఫలితాలపై చర్చ జరుగుతోంది. ముఖ్యంగా దేశంలో మహిళా ఎంపీల తగ్గుదల అంశం చర్చనీయాంశంగా మారింది. ఈ ఎన్నికల్లో మహిళల ఓటింగ్ శాతం పెరిగినా, మహిళా ఎంపీలుగా ఎన్నికైనవారి సంఖ్య తగ్గడం గమనార్హం. ఈ లోక్‌సభ ఎన్నికల్లో మొత్తం 73 మంది మహిళా అభ్యర్థులు ఎన్నిక కాగా, 2019 సార్వత్రిక ఎన్నికల్లో ఈ సంఖ్య 78గా ఉంది.