CM Chandrababu: సూపర్ జీఎస్టీ – సూపర్ సేవింగ్స్ ఇది ప్రారంభం మాత్రమే.. ప్రతి కుటుంబానికి రూ.10 వేలు ఆదా..
- సూపర్ జీఎస్టీ - సూపర్ సేవింగ్స్ ఇది ప్రారంభం మాత్రమే ..
- రాబోయే రోజుల్లో మరిన్ని అవకాశాలు ఉంటాయి..
- కర్నూలులో ‘సూపర్ జీఎస్టీ-సూపర్ సేవింగ్స్’ సభలో చంద్రబాబు..
- 21వ శతాబ్దం మోడీదే అవుతుందనడంలో సందేహం లేదు..
- సరైన సమయంలో మోడీ.. దేశానికి సరైన నాయకుడిగా ఉన్నారు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Chandranaidu: సూపర్ జీఎస్టీ – సూపర్ సేవింగ్స్ ఇది ప్రారంభం మాత్రమే అన్నారు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు.. కర్నూలులో ‘సూపర్ జీఎస్టీ-సూపర్ సేవింగ్స్’ పేరుతో నిర్వహించిన భారీ బహిరంగ సభలో ప్రధాని నరేంద్ర మోడీ, గవర్నర్ అబ్దుల్ నజీర్, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, నారా లోకేష్ సహా పలువురు కేంద్ర, రాష్ట్ర మంత్రులు, ఇతర నేతలతో కలిసి పాల్గొన్న ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. జీఎస్టీ సంస్కరణల వల్ల ప్రజలందరూ ప్రయోజనం పొందుతున్నారని తెలిపారు.. మీరు జీఎస్టీ 2.0తో లబ్ధి పొందుతున్నారా? లేదా? చెప్పాలంటూ సభకు హాజరైన ప్రజలను ప్రశ్నించి.. లబ్ధిపొందినవారు చప్పట్లు కొట్టాలంటూ వారిలో ఉత్సాహాన్ని నింపారు చంద్రబాబు..
Read Also: JFK Assassination Documents: ట్రంప్ రాజకీయ వ్యూహానికి పుతిన్ ఫైల్ బాంబు దెబ్బ..
Also Read
- MA Ghaffoor’s Son Kiran Dies in US: అమెరికాలో తెలుగు సైంటిస్ట్ కన్నుమూత.. సీపీఎం మాజీ ఎమ్మెల్యే గఫూర్ ఇంట తీవ్ర విషాదం..
- Silver Jubilee Fraternity Meet: కర్నూలు సిల్వర్ జూబ్లీ కాలేజీ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం.. ముఖ్య అతిథిగా వెంకయ్య
- Minister TG Bharath: కర్నూలులో జాబ్ మేళా ప్రారంభం.. యువతకు ఉద్యోగాలు.. కర్నూలుకు భారీ పెట్టుబడులు..!
- Pothireddypadu : పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ వద్ద భారీ ప్రమాదం.. తెగిపడిన 9వ గేటు
అయితే, సూపర్ సేవింగ్స్ అనేది ప్రారంభం మాత్రమే.. రాబోయే రోజుల్లో మరిన్ని అవకాశాలు ఉంటాయని వెల్లడించారు సీఎం చంద్రబాబు.. 25 సంవత్సరాలుగా నరేంద్ర మోడీ.. సీఎంగా, పీఎంగా ప్రజా సేవలో ఉన్నారు. 21వ శతాబ్దం మోడీదే అవుతుందనడంలో సందేహం లేదని స్పష్టం చేశారు.. ఇక, సరైన సమయంలో ప్రధాని మోడీ.. దేశానికి సరైన నాయకుడిగా ఉన్నారని ప్రశంసలు కురిపించిన ఆయన.. ఇలాంటి నాయకుడు ఉండటం దేశం అదృష్టంగా అభివర్ణించారు.. చాలా మంది ప్రధానమంత్రులతో కలిసి పనిచేశారు.. కానీ, నరేంద్ర మోడీ లాంటి నాయకుడిని నేను చూడలేదని.. ఆయన విశ్రాంతి లేకుండా నిరంతరం పనిచేస్తూనే ఉన్నారని పేర్కొన్నారు చంద్రబాబు..
ఇక, 2047 నాటికి భారతదేశం ప్రపంచంలో అగ్రస్థానంలో ఉంటుందని తెలిపారు ఏపీ సీఎం చంద్రబాబు.. నరేంద్ర మోడీ దృఢ సంకల్పంతో మనం 11వ స్థానం నుండి నాల్గో స్థానానికి ఎదిగామన్నారు.. మరోవైపు.. ఆపరేషన్ సిందూర్ మన సైనిక బలాన్ని నిరూపించింది.. మాటలతో కాదు.. చేతలతో చూపించే వ్యక్తి ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు.. జీఎస్టీ తగ్గింపుతో ప్రతి కుటుంబానికి ఏడాదికి రూ.10 వేలు ఆదా అవుతుందని వెల్లడించారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. సూపర్ జీఎస్టీ – సూపర్ సేవింగ్స్ సభా వేదికగా చంద్రబాబు ఇంకా ఏం మాట్లాడారో తెలుసుకోవడానికి కింది వీడియో లింక్ను క్లిక్ చేయండి..
తాజావార్తలు
-
ACB Raids : రూ.20 లక్షల లంచం.. ఏసీబీకి చిక్కిన తహసీల్దార్, సర్వేయర్.!
-
Chairman’s Desk: ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం ఎందుకు కీలకం..? అసలు యువత ఏం ఆశిస్తోంది..?
-
Off The Record: పోగొట్టుకున్న చోటే వెతుకులాట.. సింగరేణిపై గులాబీ గురి
-
Off The Record: గవర్నర్ కోటా MLCలపై కాంగ్రెస్ కసరత్తు… ఆ సీట్లు దక్కేదెవరికి..?
-
Off The Record: నమ్మినవాళ్లే జనసేనను ముంచుతున్నారా… ఈ సారి గ్లాస్ ప్లాన్ ఏంటి…?
ట్రెండింగ్
-
Pressure Cooker Safety: ప్రెషర్ కుక్కర్లో ఈ సమస్య ఉందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.!
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?