Amit Shah AP Tour: ఆంధ్రప్రదేశ్‌లో కేంద్రమంత్రులు, బీజేపీ అగ్రనేతల పర్యటనలు కొనసాగుతూనే ఉన్నాయి.. ఈ మధ్య ప్రధాని నరేంద్ర మోడీ విశాఖపట్నంలో పర్యటించి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసిన విషయం విదితమే కాగా.. ఈ నెల 18వ తేదీన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా.. ఏపీకి రాబోతున్నారు.. ఆదివారం రోజు ఆంధ్రప్రదేశ్ పర్యటనకు అమిత్‌షా రానున్నారు రాష్ట్ర బీజేపీ ప్రకటించింది.. ఈ పర్యటనలో భాగంగా 19వ తేదీన కృష్ణా జిల్లా, గన్నవరం సమీపంలో నిర్మించిన ఎన్డీఆర్ఎఫ్ (NDRF), ఎన్ఐడీఎం (NIDM) ప్రాంగణాలను కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రారంభించనున్నారని తెలిపారు.. ఈ పర్యటన కోసం శనివారం రాత్రి ఢిల్లీ నుంచి గన్నవరం విమానాశ్రయానికి చేరుకోన్న అమిత్‌షా.. ఆ రోజు రాత్రి ఉండవల్లిలోని సీఎం చంద్రబాబు నివాసంలో భేటీ అవుతారని.. అనంతరం విజయవాడలోని హోటల్లో బస చేస్తారని పేర్కొన్నారు..
Read Also: Manchu Family : నేను గొడవలు చేయడానికి రాలేదు : మంచు మనోజ్
ఇక, 19వ తేదీన గన్నవరం సమీపంలో నిర్మించిన ఎన్డీఆర్ఎఫ్, ఎన్ఐడీఎం ప్రాంగణాలను ప్రారంభించనున్న కేంద్ర హోంమంత్రి అమిషా.. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభను ఉద్దేశించి ప్రసంగించనున్నారు.. కాగా, ఎల్లుండి గుంటూరు, కడప జిల్లాలో పర్యటించనున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. అదే రోజు సాయంత్రం ఉండవల్లిలోని తన నివాసంలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు మర్యాదపూర్వకంగా డిన్నర్ ఇవ్వబోతున్నారు.. ఆ తర్వాత రోజు.. అంటే ఈ నెల 19వ తేదీన దావోస్ పర్యటనకు బయల్దేరి వెళ్లనున్నారు సీఎం చంద్రబాబు. మొత్తంగా ఈ నెల 18వ తేదీన ఏపీకి చేరుకోనున్న ఆయన.. 19వ తేదీన ఇక్కడ కార్యక్రమాల్లో పాల్గొననుండడంతో.. రాష్ట్రంలో రెండు రోజుల పాటు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా పర్యటన కొనసాగనుంది.