Travel Bus: ప్రయాణికులతో నిండిన ట్రావెల్స్ బస్సులో ప్రేమికుల వ్యవహారం వివాదానికి దారి తీసిన ఘటన ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. హైదరాబాదులో నివసిస్తున్న ఇద్దరు ప్రేమికులు మచిలీపట్టణం వెళ్లేందుకు ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో స్లీపర్ సీట్లు బుక్ చేసుకున్నారు. అయితే సీట్లు ఇద్దరు మహిళల పేర్లతో బుక్ అయ్యాయి. అయితే బస్సు ఎక్కేందుకు ఒక యువతి, ఒక యువకుడు రావడం డ్రైవర్‌కు అనుమానం కలిగించింది.
Student M*urder: గదిలో యువతి మృతదేహం కలకలం.. దర్యాప్తులో సంచలన విషయాలు!
ఈ విషయంపై డ్రైవర్ వారిని ప్రశ్నించడంతో అసలు సమస్య మొదలైంది. ఆ ప్రేమికులను పక్కపక్కనే స్లీపర్ బెర్త్ లలో ప్రయాణించేందుకు డ్రైవర్ అభ్యంతరం వ్యక్తం చేశాడు. టికెట్ బుక్ చేసిన వ్యక్తి “టికెట్ తీసుకున్నాం, ఎవరితో ప్రయాణించాలో మా ఇష్టం” అని వాదించాడు. దానికి బస్సులో కొన్ని నియమాలు ఉంటాయని డ్రైవర్ సమాధానం ఇచ్చాడు. దీంతో ఇద్దరి మధ్య మాటా మాటా పెరిగింది. అయితే ఇక్కడ ఇతర ప్రయాణికులు జోక్యం చేసుకోవడంతో పరిస్థితి కాస్త సద్దుమణిగి బస్సు ప్రయాణం పూర్తయ్యింది.
Star Actress : రూ. 500 నుండి రూ. 4 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకునే రేంజ్ కు స్టార్ హీరోయిన్
అయితే మచిలీపట్నం చేరుకునే సమయానికి మరోసారి వివాదం చెలరేగింది. మచిలీపట్నం రాబోతుందని అనేలోగా మళ్ళీ రచ్చ మొదలైంది. ప్లాన్ అంతా అప్సెట్ అయినందుకో ఏమో.. ఆ ప్రియురాలు ఆవేశంతో ఊగిపోయింది. మజిలీపట్నం సెంటర్ లో దిగి దిగగానే ప్రియుడిని రెచ్చగొట్టింది. దీనితో ఈ ఇష్యూని ఇంతటితో వదిలి పెట్టొద్దంటూ గట్టిగట్టిగా కేకలేసింది. దీంతో ఆ యువకుడు రెచ్చిపోయి డ్రైవర్ మీద అటాక్ చేశాడు. అంతే డ్రైవర్ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వాళ్ళు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటన స్థానికంగా హాట్ టాపిక్ అయింది.
ట్రావెల్స్ బస్సులో ప్రేమ జంట అరాచకం..#Hyderabad #Machilipatnam #PrivateTravelsBus #ValentinesDay2026 #ValentinesDay #Telangana #AndhraPradesh #NTVTelugu pic.twitter.com/v1tzFcBP3O
— NTV Telugu (@NtvTeluguLive) February 17, 2026
