Machilipatnam: కామర్స్ లెక్చరర్ ‘కామ లీలలు’.. ఉద్యోగం ఇప్పిస్తానని ఆశ చూపిన వైనం.. సడెన్‌గా భార్య ఎంట్రీ..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Machilipatnam: కృష్ణా జిల్లా మచిలీపట్నంలో ఓ కామర్స్ లెక్చరర్ ” కామలీలల” వహారం కలకలం రేపుతోంది. ఉద్యోగం ఇప్పిస్తానని ఆశ చూపి ఓ నిరుద్యోగ యువతిని లోబరుచుకునేందుకు ప్రయత్నించిన ఘటన ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. అవనిగడ్డ ప్రభుత్వ కళాశాలలో ప్రస్తుతం లెక్చరర్‌గా పనిచేస్తున్న జాషువా.. గతంలో మచిలీపట్నంలోని ఓ మహిళా కాలేజీలో పనిచేసినట్లు సమాచారం. ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న ఓ యువతి పరిస్థితిని అదునుగా చేసుకుని, ఆమెకు ఉద్యోగం ఇప్పిస్తానంటూ మాయమాటలు చెప్పి తన కోరిక తీర్చాలని ఒత్తిడి చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి.
మచిలీపట్నం గొడుగు పేట ప్రాంతంలోని ఓ దేవాలయం సమీపంలో అద్దె ఇంటిని తీసుకుని అక్కడికి యువతిని రావాలని పిలిచాడు. అయితే ఈ విషయం తెలుసుకున్న జాషువా భార్య అక్కడికి చేరుకుని భర్త దురాగతాన్ని అడ్డుకుంది. హ్యూమన్ రైట్స్ సంస్థ సభ్యుల సహకారంతో బాధిత యువతికి అండగా నిలిచి, ఈ వ్యవహారాన్ని బయటపెట్టారు. కొద్దికాలంగా భార్యాభర్తల మధ్య విభేదాలు కొనసాగుతున్నాయని, అదే కారణంగా జాషువా మచిలీపట్నంలో వేరుగా అద్దె ఇంట్లో ఉంటున్నాడని తెలిసింది. మహిళలకు ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ మభ్యపెట్టి, వారిని తన వలలో వేసుకునేందుకు ప్రయత్నిస్తున్నాడని ఆరోపణలు వినిపిస్తున్నాయి.
Also Read
- కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
- AP Cabinet Meeting: ఏపీ కేబినెట్ ప్రత్యేక భేటీ.. పవన్ కల్యాణ్ సహా జనసేన మంత్రుల డుమ్మా..
- Election Commission: సీజేపీ నిరసనల వేళ కేంద్ర ఎన్నికల సంఘం సంచలన నిర్ణయం..
- MA Ghaffoor’s Son Kiran Dies in US: అమెరికాలో తెలుగు సైంటిస్ట్ కన్నుమూత.. సీపీఎం మాజీ ఎమ్మెల్యే గఫూర్ ఇంట తీవ్ర విషాదం..
ఈ ఘటనపై జాషువా భార్య మాట్లాడుతూ.. తమ వివాహం జరిగి 25 సంవత్సరాలు అయ్యిందని, గత కొంతకాలంగా ఇతర మహిళలతో అక్రమ సంబంధాలు కొనసాగిస్తూ తనతో గొడవలకు దిగుతున్నాడని ఆరోపించారు. గతంలో కూడా పలువురు యువతులను వివాహం చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడని, రాజకీయ నాయకుల అండదండలతో రాజీలు చేసుకున్నాడని ఆమె పేర్కొన్నారు. మహిళల జీవితాలతో ఆడుకుంటున్న తన భర్తపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు. ప్రస్తుతం ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు దర్యాప్తు జరుగుతోంది.
తాజావార్తలు
-
Ranabaali Trailer: ‘రణబాలి’ ట్రైలర్‌పై మంత్రి లోకేష్ రివ్యూ!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
AP Cabinet Meeting: ఏపీ కేబినెట్ ప్రత్యేక భేటీ.. పవన్ కల్యాణ్ సహా జనసేన మంత్రుల డుమ్మా..
-
IPL 2027-CSK: సీఎస్కేలో ఏం జరుగుతోంది.. మొన్న ఇద్దరు, ఇవాళ మరొక కోచ్ అవుట్!
-
Election Commission: సీజేపీ నిరసనల వేళ కేంద్ర ఎన్నికల సంఘం సంచలన నిర్ణయం..
ట్రెండింగ్
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!
-
Crispy Snacks: నూనెను ఎక్కువగా పీల్చుకోకుండా బొంబాయి రవ్వతో ‘క్రిస్పీ బైట్స్’.. తినడం మొదలు పెడితే గిన్నె ఖాళీ కావాల్సిందే.!
-
How to Get Rid of Lizards at Home: ఇంట్లో బల్లులు ఎక్కువగా ఉన్నాయా? ఈ సింపుల్ చిట్కాలతో తరిమేయండి!
-
50MP కెమెరా, 32MP సెల్ఫీ షూటర్, 10,200mAh బ్యాటరీతో Vivo Y600s Pro లాంచ్.!