ఖమ్మం జిల్లా కొనిజర్ల మండలం తనికెళ్ళ సమీపంలో తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంతో దాదాపుగా నాలుగు గంటల నుంచి ట్రాఫిక్ జామ్ కొనసాగుతుంది. ట్రాఫిక్ ని ఎప్పటికప్పుడు క్లియర్ చేస్తున్నప్పటికీ పండగ సీజన్ కావడంతో భారీగా వస్తున్న వాహనాలని క్రమబద్ధీకరించడం పోలీసులకు భారంగా మారింది. తనికెళ్ల సమీపంలో హైదరాబాద్ నుంచి ఒడిస్సా వెళ్తున్న సాయి కృష్ణ ట్రావెల్స్ బస్సును వెనకవైపు నుంచి లారీ ఢీ కొట్టింది. ట్రావెల్ బస్సు ముందు మరో వాహనాన్ని(లారీ) ఢీకొట్టింది.…
ప్రకాశం జిల్లా దర్శి సమీపంలో గురువారం తెల్లవారుజామున ఓ ప్రైవేట్ ట్రావెల్ బస్సు అలసిపోయి నిద్రమత్తులో ఉన్న డ్రైవర్ అదుపు తప్పి బోల్తా కొట్టింది. అదృష్టవశాత్తూ ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు, అయితే వారిలో ఐదుగురికి గాయాలయ్యాయి , పోలీసులు చికిత్స కోసం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వీకావేరి ట్రావెల్స్‌కు చెందిన ఏపీ27యూబీ5465 నంబరు గల బస్సు బుధవారం రాత్రి 40 మంది ప్రయాణికులతో హైదరాబాద్ నుంచి బయలుదేరి గురువారం ఉదయం కనిగిరి చేరుకోనుంది. దర్శి మండలం…
రోడ్లపై ప్రమాదాలు సర్వసాధారణం అయిపోయాయి. డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం పొంగూరు కండ్రిక వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. జాతీయ రహదారిపై అదుపుతప్పి పిఎస్సార్ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాద సమయంలో బస్సులో 25 మంది వరకు ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. బళ్లారి నుండి నెల్లూరు కు వెళుతుండగా జరిగిన ప్రమాదం జరిగింది.…