AP Assembly Session: సమావేశాలకు టీడీపీ దూరం..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 7వ తేదీన ప్రారంభంకాబోతున్నాయి.. ఈ సమావేశాల్లోనే వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుంది సర్కార్.. అయితే, అసెంబ్లీ సమావేశాలకు దూరంగా ఉండాలని టీడీపీ నిర్ణయం తీసుకుంది.. ఇవాళ సమావేశమైన టీడీపీ పొలిట్ బ్యూరో… అసెంబ్లీ సమావేశాలకు వెళ్లకూడదనే నిర్ణయానికి వచ్చింది.. అయితే, టీడీఎల్పీలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో చర్చించి తుది నిర్ణయం తీసుకోనున్నారు.. పొలిట్‌బ్యూర్ సమావేశం ముగిసిన తర్వాత మీడియాతో మాట్లాడిన పార్టీ నేత కాలువ శ్రీనివాసులు.. కౌరవ సభను తలపించేలా అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి.. అసెంబ్లీలో ప్రజా సమస్యలు చర్చించే అవకాశం లేకుండా.. మాట్లాడే అవకాశం ఇవ్వడం లేదని విమర్శించారు.. వైసీపీ ఎమ్మెల్యేలు ఉత్సవ విగ్రహాలుగా మారారని మండిపడ్డారు.
Read Also: Revanth Reddy: సీఎం కేసీఆర్‌కు బహిరంగలేఖ.. ఏంటీ పక్షపాతం..!
Also Read
- Digital Arrest Scam: డిజిటల్ అరెస్ట్ ఉచ్చులో వృద్ధ దంపతులు.. కృష్ణాజిల్లాలో రూ.1.43 కోట్ల సైబర్ మోసం
- Kodali Nani: గుడివాడలో డీఎస్సీ అక్రమాలపై వైసీపీ సమావేశం.. కొడాలి నాని తీవ్ర ఆరోపణలు
- Vallabhaneni Vamsi vs Yarlagadda Venkatrao: ఎమ్మెల్యే యార్లగడ్డకు వల్లభనేని లీగల్ నోటీసు
- MLA Yarlagadda Venkata Rao: గన్నవరం ఎమ్మెల్యే గైర్హాజరుతో మళ్లీ చర్చ.. ఏటీసీ ప్రారంభోత్సవానికి ఎందుకు డుమ్మా..?
ఇక, ఏడాది పాటు ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలు నిర్వహించాలని పొలిట్‌బ్యూరో నిర్ణయించినట్టు తెలిపారు కాలువ శ్రీనివాసులు.. 40 ఏళ్ల ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలను హైదరాబాద్‌లో.. మహానాడును విజయవాడలో జరపాలని నిర్ణయం తీసుకున్నారు. మరోవైపు, హైకోర్టు తీర్పు జగన్‌కు చెంపపెట్టు అన్నారు కాలువ.. సీఎం జగన్ ఇప్పటికైనా మూడు రాజధానులకు స్వస్తి చెప్పాలని సూచించిన ఆయన.. రాష్ట్ర ఆదాయం తగ్గిపోయింది.. సంవత్సరానికి రూ. 12 వేల కోట్ల ఆదాయం కోల్పోయాం అన్నారు.. అమరావతిలో నిర్మాణాలు పూర్తి చేయాలని సలహా ఇచ్చారు. ఇక, వైఎస్ వివేకా హత్య కేసులో కట్టు కథలు అల్లుతున్నారని ఆరోపించారు శ్రీనివాసులు.. అసలు సూత్రధారులను త్వరగా అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. 35 సంక్షేమ పథకాలను రద్దు చేసి.. పేదలకు అన్యాయం చేశారని ఆవేదన వ్యక్తం చేసిన ఆయన.. కేంద్ర పథకాలకు రాష్ట్ర ప్రభుత్వం మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వడం లేదన్నారు.. రాష్ట్రంలో రూ. 12 వేల కోట్ల పథకాలు ఆగిపోయాయని విమర్శించారు.
తాజావార్తలు
-
Hyderabad: గచ్చిబౌలి బిల్డింగ్ కూలిన ఘటన.. టౌన్ ప్లానింగ్ అధికారిపై సస్పెన్షన్ వేటు
-
IBPS Clerk Recruitment 2026: 11,403 పోస్టులకు దరఖాస్తు గడువు పొడిగింపు.. చివరి తేదీ ఎప్పుడు? అర్హత, ఫీజు వివరాలు ఇవే
-
Hero Impulse: రీ-ఎంట్రీకి సిద్ధమైన ఐకానిక్ బైక్.. ఎక్స్‌పల్స్ కంటే తక్కువ ధరలోనే కొత్త ఆఫ్-రోడర్!
-
Anbe Diana OTT Release: పెద్దలు ఒప్పుకోని ప్రేమ.. తిప్పలు పడే జంట.. ఓటీటీలోకి కడుపుబ్బ నవ్వించే రొమాంటిక్ కామెడీ
-
Suitcase Torso Case: సూట్‌కేసులో మొండెం కేసులో కొత్త ట్విస్ట్.. శరీర భాగాలతో బిర్యానీ వండి..!
ట్రెండింగ్
-
Home Safety Tips: పాములను ఇంట్లోకి రాకుండా తరిమికొట్టే చిట్కాలు ఇవే.. ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!
-
64MP కెమెరా, 5,700mAh బ్యాటరీతో వచ్చేసిన Philips S7221 5G ఫోన్.. ధర ఎంతంటే?
-
Crispy Veggie Fingers: బయట క్రిస్పీ.. లోపల సాఫ్ట్.! నోరూరించే ‘క్రిస్పీ వెజ్జీ ఫింగర్స్’ సింపుల్ అండ్ టేస్టీ స్నాక్ చేసేయండి ఇలా.!