Anbe Diana OTT Release: పెద్దలు ఒప్పుకోని ప్రేమ.. తిప్పలు పడే జంట.. ఓటీటీలోకి కడుపుబ్బ నవ్వించే రొమాంటిక్ కామెడీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Anbe Diana OTT Release: రొమాంటిక్ కామెడీ సినిమాలను ఇష్టపడే ప్రేక్షకులకు గుడ్ న్యూస్. థియేటర్లలో ప్రేక్షకులను అలరించిన తమిళ రొమాంటిక్ కామెడీ ‘అన్బే డయానా’ ఇప్పుడు ఓటీటీ రిలీజ్‌కు సిద్ధమైంది. ప్రేమ, కుటుంబ బంధాలు, భిన్నమైన సంస్కృతుల మధ్య జరిగే ఈ కథ పక్కా కామెడీ ట్రాక్ లో నడుస్తుంది. 2026 జూన్ 17న రిలీజ్ అయిన ఈ సినిమా థియేటర్లలో మంచి స్పందన అందుకుంది. ముఖ్యంగా హీరో హీరోయిన్ల మధ్య కెమిస్ట్రీ, కుటుంబ నేపథ్యంలో వచ్చే కామెడీ సీన్స్ ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించాయి. థియేటర్లలో ఈ సినిమాను మిస్ అయిన వారు ఇప్పుడు ఇంట్లోనే చూసే అవకాశం వచ్చింది.
ఆగస్టు 28 నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్
పరి ఎలావళగన్ రచన, దర్శకత్వంలో తెరకెక్కిన ‘అన్బే డయానా’ 2026 ఆగస్టు 28 నుంచి ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ SonyLIVలో స్ట్రీమింగ్ కానుంది. చిత్ర బృందమే ఈ విషయాన్ని ఆఫీషియల్ గా సోషల్ మీడియా ద్వారా ప్రకటించింది. దీంతో థియేట్రికల్ రన్ పూర్తిచేసుకున్న ఈ సినిమా ఇప్పుడు డిజిటల్ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. అన్బే డయానా’ (Anbe Diana) సినిమా మొత్తం 5 భాషల్లో ఓటీటీలో విడుదల కానుంది. ఈ మూవీ మాతృభాష అయిన తమిళంతో పాటు తెలుగు, హిందీ, కన్నడ, మరియు మలయాళం భాషల్లో ప్రేక్షకులకు అందుబాటులోకి వస్తుంది.
Also Read
- Rudravanam PS: మరో ఇంట్రెస్టింగ్ క్రైమ్ థ్రిల్లర్.. అక్టోబర్ 30 నుంచి ‘రుద్రవనం పీఎస్’ స్ట్రీమింగ్.!
- Pocket Rockets: నిహారిక కొణిదెల నిర్మాణంలో ‘పాకెట్ రాకెట్స్’.. గ్యాంబ్లింగ్ నేపథ్యంలో యూత్‌ఫుల్ డ్రామా.!
- Vishwak Sen: ‘కల్ట్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ క్యాన్సల్.. ఎందుకో చెప్పిన విశ్వక్సేన్!
- Mouli: ఐదో తరగతిలో భయపడి ఏడ్చా.. ఇప్పుడు మైత్రీ మూవీస్‌తో సినిమా
‘అన్బే డయానా’లో పరి ఎలావళగన్, రమ్య రంగనాథన్ ప్రధాన పాత్రల్లో నటించారు. సీనియర్ నటి రోజా సెల్వమణి కూడా కీలక పాత్రలో కనిపించారు. హీరో తల్లి సరళ పాత్రలో రోజా నటించడం సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. చేతన్, పరితాబంగల్ గోపి, సెల్ మురుగన్, నిఖిలా శంకర్, ఇస్మత్ బాను, సుదర్శన్ గాంధీ తదితరులు ఇతర పాత్రల్లో కనిపించారు. భరత్ శంకర్ ఈ చిత్రానికి సంగీతం అందించగా, మిలియన్ డాలర్ స్టూడియోస్, నియో క్యాజిల్ క్రియేషన్స్, ఎరా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లపై సత్య కరికాలన్, ఎరా శరవణన్, యువరాజ్ గణేసన్ ఈ చిత్రాన్ని నిర్మించారు.
అసలు కథ ఏంటి?
చెన్నైలోని పెరంబూరు ప్రాంతంలో నివసించే ఒక హిందూ సంప్రదాయ కుటుంబానికి చెందిన అథ్లెటిక్స్ కోచ్ చిరుమామిళ్ల సీతాకృష్ణ (CSK), అదే ఊరిలో ఉండే మోడర్న్ క్రిస్టియన్ ఐటీ ప్రొఫెషనల్ మ్యాజిక్ డయానా డిసౌజాతో ప్రేమలో పడతాడు. మొదట్లో డయానా అతడిని నిరాకరించినప్పటికీ, ఒక ఊహించని సంఘటన వల్ల వారిద్దరూ దగ్గరవుతారు.
కృష్ణకు డయానాపై ప్రేమ ఉన్నప్పటికీ, అతని కుటుంబ పరిస్థితులు ఆ ప్రేమకు అడ్డంకిగా మారతాయి. ముఖ్యంగా కృష్ణ తల్లి సరళ తన కొడుకు తమ సంప్రదాయాలకు అనుగుణంగానే పెళ్లి చేసుకోవాలని కోరుకుంటుంది. దీంతో తల్లిని ఎదిరించలేని కృష్ణ కుటుంబం చూసిన అమ్మాయితో నిశ్చితార్థానికి అంగీకరిస్తాడు. అయితే ఆ తర్వాత తన నిర్ణయం తప్పని తెలుసుకుంటాడు.
డయానాతోనే జీవితాన్ని కొనసాగించాలని నిర్ణయించుకున్న కృష్ణ, తన స్నేహితుడి సహాయంతో నిశ్చితార్థాన్ని రద్దు చేసుకునేందుకు ప్రయత్నిస్తాడు. అక్కడి నుంచి కుటుంబ గొడవలు, అపార్థాలు, ప్రేమను నిలబెట్టుకోవడానికి చేసే ప్రయత్నాలు కథలో వినోదాన్ని పంచుతాయి. చివరికి ఈ ప్రేమకథ ఎలాంటి మలుపు తీసుకుంది అనేదే సినిమాలో ఆసక్తికరమైన అంశం.
ప్రేమకథకు కుటుంబ భావోద్వేగాలు, కామెడీని జోడించిన ‘అన్బే డయానా’ థియేటర్లలో చూడలేకపోయిన ప్రేక్షకులకు ఇప్పుడు ఓటీటీలో అందుబాటులోకి రానుంది. ఆగస్టు 28 నుంచి ఈ రొమాంటిక్ కామెడీని SonyLIVలో చూసి ఎంచక్కా నవ్వుకోవచ్చు.
- Tags
- Anbe Diana
- cinema
తాజావార్తలు
-
Supreme Court: మహిళల హక్కుల కోసం ట్రాన్స్విమెన్ల అస్తిత్వాన్ని విస్మరించాలా? సుప్రీంకోర్టులో కొత్త వివాదం
-
Cyclone Arnab: కోస్తాంధ్రను కుదిపేసిన అర్నబ్ తుఫాన్.. ఆరుగురు మృతి, ఒకరు గల్లంతు.. అంధకారంలో పలు జిల్లాలు!
-
క్రెటా ప్రియులకు గుడ్ న్యూస్.. త్వరలోనే మార్కె్ట్లోకి Hyundai Creta 7-Seater.. ఫుల్ డీటెయిల్స్ మీకోసం..
-
WPL 2027 మినీ వేలం పూర్తి.. 25 మంది ఆటగాళ్ల కొనుగోలు.. 5 జట్ల పూర్తి స్క్వాడ్ వివరాలు ఇవే..!
-
ICC Rankings: జడేజా 1,683 రోజుల ఆధిపత్యానికి తెర.. నంబర్-1 ఆల్‌రౌండర్ స్థానాన్ని కోల్పోయిన జడ్డూ..
ట్రెండింగ్
-
బైక్ లవర్స్‌కు గుడ్ న్యూస్.. సరికొత్త ఫీచర్లతో KTM 200 Duke లాంచ్..!
-
WPL Auction 2027: వైభవ్ సూర్యవంశీ మాదిరే.. డబ్ల్యూపీఎల్‌లో అత్యంత పిన్న వయస్కురాలు.. ఎవరీ ఉమా కాశ్వి!
-
RCB Full Squad: నలుగురు కొత్త ప్లేయర్లు, స్టార్ ఆల్‌రౌండర్లు.. ఆర్సీబీ ఫుల్ స్క్వాడ్ ఇదే!
-
WPL Auction 2027: చాలా తక్కువ ధరకే స్టార్ ప్లేయర్లు.. ముంబై ఇండియన్స్ భలే లక్కీ.. ఫుల్ స్క్వాడ్ ఇదే!
-
6,100mAh బ్యాటరీ, కిరిన్ 8000S చిప్సెట్, AI సెక్యూరిటీ ఫీచర్లతో Huawei Enjoy 100 స్మార్ట్‌ఫోన్ లాంచ్..!