దర్శిలో టీడీపీ విజయ కేతనం..

ఏపీలో నెల్లూరు కార్పోరేషన్‌తో పాటు పెండింగ్‌లో మరో 12 మున్సిపాలిటీలు, నగరపంచాయతీలకు పోలింగ్‌ జరిగిన విషయం తెలసిందే. అయితే ఈ నేపథ్యంలో ఈ రోజు ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమైంది. అయితే తాజాగా ప్రకాశం జిల్లా దర్శి నగర పంచాయతీ ని టీడీపీ కైవసం చేసుకుంది. వైసీపీ-టీడీపీ మధ్య హోరాహోరీగా ఎన్నికల పోరు సాగింది. మొత్తం 20 వార్డులకు గాను టీడీపీ 13 వార్డులు గెలుచుకొని దర్శి నగర పంచాయతీ చైర్మన్ పీఠాన్ని దక్కించుకుంది.

టీడీపీ శ్రేణులు కౌంటింగ్ కేంద్రం బయట సంబరాల్లో చేసుకున్నారు. దర్శి నగర పంచాయతీ టీడీపీ చైర్మన్ అభ్యర్థిగా టీడీపీ దివంగత నేత నారపు శెట్టి శ్రీరాములు కుమారుడు నారపుశెట్టి పిచ్చయ్యను ప్రకటించింది. వైసీపీ అభ్యర్థులు 7 వార్డుల్లో విజయం సాధించారు. వైసీపీ అభ్యర్థులు 1,2,5,6,7,8,9 వార్డుల్లో విజయం సాధించగా.. టీడీపీ అభ్యర్థులు 3,4,10,11,12,13,14,15,16,17,18,19,20 వార్డుల్లో టీడీపీ జెండాను ఎగరవేశారు. ఇంకా పలు చోట్ల ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది.

Related Articles

Latest Articles