ఎన్టీఆర్ జిల్లాలోని కొండపల్లి మున్సిపల్ చైర్మన్ పీఠం టీడీపీ సొంతమైంది. ఒక ఓటు తేడాతో చైర్మన్ పీఠంను టీడీపీ దక్కించుకుంది. టీడీపీకి 16 ఓట్లు రాగా.. వైసీపీకి 15 ఓట్లు వచ్చాయి. కొండపల్లి మున్సిపల్ చైర్మెన్‌గా చెన్నుబోయిన చిట్టిబాబు ఎన్నికయ్యారు. వైస్ చైర్మెన్‌గా ఇండిపెండెంట్‌గా గెలిచి.. టీడీపీకి మద్దతు ఇచ్చిన శ్రీదేవి ఎన్నికయ్యారు. చైర్మన్ పీఠం దక్కడంతో టీడీపీ నేతలు, కార్యకర్తలు సంబరాలు జరుపుకున్నారు. Also Read: RK Beach: పెద్దలను ఒప్పించి.. పెళ్లి చేసుకున్న నెల…
నేడు ఎన్టీఆర్ జిల్లాలోని కొండపల్లి మున్సిపాలిటీ చైర్మన్ ఎన్నిక జరగనుంది. మున్సిపల్ కార్యాలయ ఆవరణలో హైకోర్టు తీర్పు సీల్డ్ కవర్‌ను అధికారులు తెరవనున్నారు. కవర్‌లో విజేత ఎవరనేది తేలనుందా? లేక టాస్ వేయాల్సిన అవసరం వస్తుందా? అనే సస్పెన్స్ కొనసాగుతోంది. కొండపల్లి మున్సిపాలిటీ చైర్మన్ ఎన్నిక ఫలితంపై హైకోర్టు నుంచి సీల్డ్ కవర్ వచ్చి దాదాపుగా 30 రోజులు అవుతోంది. దాంతో ఛైర్మన్ ఎన్నిక ఉత్కంఠ రేపుతోంది. గెలుపుపై ఇరు పార్టీలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. Also…
ఏటికొప్పాక, కొండపల్లి కళాకారులకు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ శుభవార్త చెప్పారు. అంకుడు, తెల్ల పొణికి చెట్లు విస్తారంగా పెంపునకు ఆయన ఆదేశాలిచ్చారు. ఉపాధి హామీ పథకంలో అంకుడు, తెల్ల పొణికి పెంపునకు ఏర్పాట్లు చేయాలని తెలిపారు. ఏటికొప్పాక, కొండపల్లి పరిసరాల్లో ఉన్న ప్రభుత్వ, అటవీ, సామాజిక స్థలాల్లో వీటి పెంపకంపై దృష్టి సారించాలని పవన్ తెలిపారు.
ఇటీవల ఎన్నికలు జరిగిన కొండపల్లి, జగ్గయ్యపేట మున్సిపాల్టీల ఫలితాలపై చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ఎన్నికల్లో పోటీ చేసినా, పని చేసిన కార్యకర్తలు, నేతలకు చంద్రబాబు అభినందనలు తెలిపారు. కొండపల్లి ఎన్నికల్లో ఎంపి కేశినేని పాత్రపై చంద్రబాబు ప్రశంసలు కురిపించారు. నేతలను, కార్యకర్తలను ఎంపి నాని బాగా కో-ఆర్డినేట్ చేశారన్న బాబు… సమర్థులైన వారికి కొన్ని చోట్ల అవకాశం ఇవ్వకపోవడం వల్ల నష్టం జరిగిందన్నారు. జగ్గయ్యపేటలో టీడీపీ సాంకేతికంగా ఓడినా.. నైతికంగా గెలిచిందన్నారు చంద్రబాబు. అయితే ఇకపై నియోజకవర్గ…
తీవ్ర ఉత్కంఠ మధ్య కృష్ణా జిల్లా కొండపల్లి మునిసిపల్ ఛైర్ పర్సన్ ఎన్నిక ప్రక్రియ ముగిసింది. చేయి ఎత్తి ఛైర్ పర్సన్ ఎన్నిక ప్రక్రియ నిర్వహించారు. టీడీపీ అభ్యర్థి చెన్నుబోయిన చిట్టిబాబుకు టీడీపీ కౌన్సిలర్లు మద్దతు ఇచ్చారు. వైసీపీ అభ్యర్థి జోగి రాముకు వైసీపీ కౌన్సిలర్ల మద్దతు లభించింది. టీడీపీ వైస్ ఛైర్ పర్సన్ అభ్యర్థులు లక్ష్మీ, శ్రీనివాస్ కు టీడీపీ కౌన్సిలర్లు మద్దతు ప్రకటించారు. ఎక్స్ అఫిషీయో సభ్యులుగా ఓటు హక్కు వినియోగించుకున్నారు టీడీపీ ఎంపీ…
నేడు కొండపల్లి మున్సిపల్ చైర్మన్ ఎన్నిక జరగనుంది. హైకోర్టు ఆదేశాలతో మూడోసారి.. ఈరోజు ఉదయం 10:30కు కౌన్సిల్ సమావేశం ప్రారంభం కానుంది. మొదటిగా సభ్యుల ప్రమాణ స్వీకారం అనంతరం చైర్మన్ ఎన్నిక జరుగుగుతుంది. ఎక్స్ అఫీషియో సభ్యుడిగా సమావేశానికి హాజరు కావాలంటూ ఎన్నికల అధికారి నుంచి కేశినేని నానికి సమాచారం అదింది. మున్సిపల్ చైర్మన్ ఎన్నిక సందర్భంగా గొల్లపూడి, ఇబ్రహీంపట్నం, కొండపల్లి ప్రాంతాల్లో ఉద్రిక్తత పరిస్థితులు వచ్చాయి. గత రెండు రోజుల నుంచి జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో…
కొండపల్లి ఛైర్ పర్సన్ ఎన్నిక ప్రక్రియను జరిపి తీరాల్సిందేనని పట్టుపడుతోంది టీడీపీ. ఏదో విధంగా ప్రక్రియను ఆపేందుకు వైసీపీ తనవంతు ప్రయత్నాలు చేస్తోంది. దీంతో కొండపల్లి పంచాయతీ రసకందాయంగా మారింది. కొండపల్లి మునిసిపల్ ఎన్నికల ఛైర్ పర్సన్ ఎన్నిక ప్రక్రియ సందర్భంగా జరిగిన పరిణామాలపై లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది టీడీపీ. గొడవ సృష్టిస్తోన్న వైసీపీపై చర్యలు తీసుకుని, సజావుగా మునిసిపల్ ఎన్నికలు జరిపించాలని కోరుతూ లంచ్ మోషన్ పిటిషన్ వేసింది. హైకోర్టులో ఈ పిటిషన్…
ఏపీలో స్థానిక ఎన్నికల సందడి ముగిసింది. ఇక మునిసిపల్ ఛైర్ పర్సన్ల ఎన్నిక ఉత్కంఠ రేపుతోంది. కొండపల్లి ఛైర్ పర్సన్ ఎన్నిక రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. 29 స్థానాలకు గానూ ఎన్నికలు జరిగాయి. చెరో 14 స్థానాలు దక్కించుకున్నాయి వైసీపీ, టీడీపీ. రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ హవా నడిచినా టీడీపీ తన సత్తా చాటుకుంది. టీడీపీకి మద్దతిస్తూ పార్టీలో చేరారు ఇండిపెండెంటుగా గెలిచిన లక్ష్మీ. దీంతో ఎన్నిక ఉత్కంఠ రేపుతోంది. ఎక్స్ అఫీషియో ఓటు కీలకంగా మారింది. ఎక్స్…
కృష్ణా జిల్లాలో కొండపల్లి మున్సిపాలిటీలో ఎన్నికల కౌంటింగ్ ముగిసింది. మొత్తం 29 వార్డులకు 14 వార్డుల్లో వైసీపీ అభ్యర్థులు, 14 వార్డుల్లో టీడీపీ అభ్యర్థులు విజయం సాధించారు. ఒకస్థానంలో ఇండిపెండెంట్ అభ్యర్థి గెలుపు సొంతం చేసుకున్నాడు. దీంతో మున్సిపల్ ఛైర్మన్ ఎన్నికపై ఉత్కంఠ కొనసాగుతోంది. ఇండిపెండెంట్ అభ్యర్థి మద్దతు కోసం అటు వైసీపీ, ఇటు టీడీపీ నేతలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎక్స్ అఫీషియో ఓట్లు కీలకం కానున్నాయి. Read Also: దర్శిలో టీడీపీ విజయ…
కొండపల్లి కొండను తవ్వింది ఎవరు? తవ్వుకుని లాభపడింది ఎవరు? కొండ కరుగుతున్న సమయంలో రాజకీయ సెగ ఎందుకు రాజుకుంది? పైచెయ్యి సాధించాలనే ఎత్తులు అనూహ్య మలుపులు తిరుగుతున్నాయా? మాటలతో ఒకరు.. సాంకేతిక అంశాలతో ఇంకొకరు.. ఒకరినొకరు ఇరుకున పెట్టుకునే వ్యూహాలు ఉత్కంఠ రేకెత్తిస్తున్నాయి. కొండపల్లి కొండ మైనింగ్‌పై రగడ! కృష్ణాజిల్లా మైలవరం నియోజకవర్గంలో రాజకీయాలు సీజన్‌తో సంబంధం లేకుండా ఎప్పుడూ రగులుతూనే ఉంటాయి. ఎన్నికలకు ముందు, ఎన్నికల సమయంలో, ఎన్నికల తర్వాత ఇలా పరిస్థితులు ఎలా ఉన్నా…