అసభ్య ప్రవర్తన కలిగిన హోంగార్డును కృష్ణా జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు విధుల నుంచి తప్పించారు. హోంగార్డు 304 బీ.అజయ్ కుమార్ అసభ్య నృత్యాలు చేస్తూ అనుచిత ప్రవర్తన కలిగి పోలీస్ శాఖ ప్రతిష్టను దెబ్బతీసేలా వ్యవహరించడంతో.. సదరు హోంగార్డుపై క్రమశిక్షణ చర్యలకు జిల్లా ఎస్పీ ఉపక్రమించారు. ప్రజారక్షణ, శాంతిభద్రతల పరిరక్షణ విధుల్లో పాల్గొనవలసిన హోంగార్డ్ అసభ్య నృత్యాలు చేస్తూ ఆ వీడియోలు సామాజిక మాధ్యమాల వేదికగా విస్తృతంగా వ్యాపించడంతో విషయం ఉన్నతాధికారుల దృష్టికి వచ్చింది. వాటిపై…