జిల్లాల అధ్యక్షులు, ఇంఛార్జీలు, ముఖ్య నేతలతో జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ నెల 29 నుంచి 31వ తేదీ వరకు జరిగే జనసేన - టీడీపీ సమన్వయ సమావేశాలపై చర్చించారు.. ఉమ్మడి జిల్లాల వారీగా జరిగే ఈ సమన్వయ సమావేశాలను పార్టీ శ్రేణులు సీరియస్‌గా తీసుకోవాలవి సూచించారు
CPI Narayana: రాబోయే ఎన్నికల్లో ప్రతిపక్ష పార్టీలతో కలిసి సీపీఐ ఎన్నికల బరిలో నిలవబోతుందని ప్రకటించారు సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ.. గుంటూరులో మీడియాతో మాట్లాడిన ఆయన.. రానున్న ఎన్నికల్లో టీడీపీ, జనసేన, సీపీఐ కలిసే పోటీ చేస్తాయంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.. కలవడం అంటూ జరిగితే మా ఓట్లు ఇవ్వడం మాత్రమే కాదు.. మాకు సీట్లు కూడా కావాలని స్పష్టం చేశారు.. ఇక, వీరుడు, సూరుడు అనుకున్న జగన్.. కేంద్రం దగ్గర మొకరిల్లుతున్నాడని విమర్శలు గుప్పించారు..…
కర్నూలు నగరంలో మంత్రి కొట్టు సత్యనారాయణ పర్యటించారు. కర్నూలులో దేవాదాయ శాఖ కార్యాలయాలకు భూమి పూజ చేసిన అనంతరం ఆయన, మంత్రి చంద్రబాబు నాయుడుపై తీవ్రంగా మండిపడ్డారు. పెరిగిన ధరలపై చంద్రబాబు అనసర రాజకీయాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ట్రోల్ డీజిల్ ధరలు పెరిగితే కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించాలి గానీ, రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం పై ఆరోపణలు చేయడం సరికాదన్నారు. అనసర రాజకీయం చేస్తూ ప్రజల మెప్పుకోసం ప్రజల్లోకి రావాని చూస్తున్నారని…