ఏపీలో 5లక్షల లోపు ఆదాయం కలిగిన ఆలయాలకు దేవాదాయ శాఖ ఫీజుల నుండి మినహాయింపునిస్తూ ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై విశాఖ శ్రీ శారదా పీఠాధిపతులు స్వరూపానందేంద్ర స్వామి హర్షం వ్యక్తం చేశారు. తక్కువ ఆదాయం కలిగిన ఆలయాలకు ఫీజుల మినహాయింపు అభినందనీయం అన్నారు స్వరూపానందేంద్రస్వామి, కోర్టు సూచన మేరకు తక్షణం ఈ నిర్ణయాన్ని అమలు చేయడం సంతోషదాయకం అన్నారు. ఈ నిర్ణయంతో చిన్న ఆలయాల్లో ధూప దీప నైవేద్యాలకు ఇబ్బందులు తగ్గుతాయని అభిప్రాయం వ్యక్తం చేశారు…
కర్నూలు నగరంలో మంత్రి కొట్టు సత్యనారాయణ పర్యటించారు. కర్నూలులో దేవాదాయ శాఖ కార్యాలయాలకు భూమి పూజ చేసిన అనంతరం ఆయన, మంత్రి చంద్రబాబు నాయుడుపై తీవ్రంగా మండిపడ్డారు. పెరిగిన ధరలపై చంద్రబాబు అనసర రాజకీయాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ట్రోల్ డీజిల్ ధరలు పెరిగితే కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించాలి గానీ, రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం పై ఆరోపణలు చేయడం సరికాదన్నారు. అనసర రాజకీయం చేస్తూ ప్రజల మెప్పుకోసం ప్రజల్లోకి రావాని చూస్తున్నారని…