KK Raju: కాలుష్య నివారణ కోసం ఎలక్ట్రిక్ వాహనాల వాడకాన్ని పెంచుకోవాలి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
KK Raju Comments In Electric Vehicles Rally: కాలుష్య నివారణ కోసం ఎలక్ట్రిక్ వాహనాల వాడకాన్ని పెంచుకోవాలని నెడ్ క్యాప్ ఛైర్మన్ కేకే రాజు పేర్కొన్నారు. సాంప్రదాయేతర ఇంధన వనరులను అమల్లోకి తీసుకురావడం ఎంతైనా అవసరం ఉందని తెలిపారు. శనివారం విశాఖపట్నంలో నెడ్ క్యాప్ ఆధ్వర్యంలో బీచ్ రోడ్‌లో విద్యుత్ వాహనాల ర్యాలీ నిర్వహించారు. పర్యావరణహితమైన వాహనాలను ప్రోత్సహించే లక్ష్యంతో ఈ ర్యాలీని నిర్వహించడం జరిగింది. ‘గో గ్రీన్ గో ఎలక్ట్రిక్ బైక్’ నినాదంతో కేకే రాజు ఈ ర్యాలీని ప్రారంభించారు. ఈ నేపథ్యంలోనే ఆయన మాట్లాడుతూ.. పర్యావరణహితమైన విధానాలను అవలంభించడంలో ప్రభుత్వం ముందుందని చెప్పారు. గ్లోబల్ ఇన్వెస్‌మెంట్ సమ్మిట్‌లో సాంప్రదాయేతర ఇంధన వనరులకు పెద్ద పీట వేయడం జరిగిందని గుర్తు చేశారు.
Shocking Incident : 20ఏళ్లప్పుడు దొంగతనం చేసి.. 60ఏళ్లకు అరెస్టయ్యారు
Also Read
- AP MPTC, ZPTC Elections: ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలపై హైకోర్టులో కీలక పరిణామం.. తీర్పు రిజర్వ్
- OTR: మన్యం జిల్లా జడ్పీ చైర్మన్ పదవికి ఎస్టీ రిజర్వేషన్.. టీడీపీ నేతల్లో అసంతృప్తి
- Jana Sena Party: జనసేనలోకి పలువురు వైసీపీ నేతలు, ప్రముఖులు.. పార్టీ కండువా కప్పి ఆహ్వానించిన పవన్ కల్యాణ్..
- Sharannavaratri Special: శరన్నవరాత్రుల్లో ప్రత్యేక ఆకర్షణ.. కోటి రూపాయల కరెన్సీ నోట్లతో అమ్మవారికి విశేష అలంకరణ!
ఇదే సమయంలో నెడ్ క్యాప్ ఎండీ రమణా రెడ్డి మాట్లాడుతూ.. ఎలక్ట్రిక్ వాహనాల వాడకాన్ని పెంచాల్సిన అవసరం ఉందన్నారు. దీని ద్వారా ఖర్చును ఆదా చేయడంతో పాటు కాలుష్య నివారణకు తమ వంతు పాత్ర పోషించినట్టు అవుతుందన్నారు. ఎలక్ట్రిక్ బైకులతో పాటు ఈ-ఆటోలను కూడా ప్రోత్సహిస్తున్నామన్నారు. అనంతరం జీవీఎంసీ కమిషనర్ రాజాబాబు మాట్లాడుతూ.. ప్రజల్లో కాలుష్య నివారణ పట్ల అవగాహన పెరుగుతోందని చెప్పారు. కార్బన్ కారక కాలుష్య నివారణ లక్ష్యంగా ప్రతి ఒక్కరు అడుగులు వేయాలని పిలుపునిచ్చారు. ఇప్పటికే సోలార్ ఫ్లోటింగ్ ప్యానెల్స్ ద్వారా జీవీఎంసీ తన వంతు బాధ్యతను నెరవేరుస్తుందని తెలియజేశారు.
Illicit Affair: కౌన్సిలర్ ప్రియుడి మోజులో పసిబిడ్డల్ని దారుణంగా హతమార్చిన తల్లి..
తాజావార్తలు
-
Cibil Score: మీ సిబిల్ స్కోర్ తక్కువగా ఉందా.. 6 నెల్లలో ఇలా సింపుల్గా పెంచుకోండి..
-
INDIA Bloc: సీఈసీకి వ్యతిరేకంగా నేడు చెన్నైలో విపక్ష కూటమి నిరసన.. పాల్గొననున్న టీవీకే
-
మళ్లీ తెరపైకి Ankita Bhandari Case.. ఢిల్లీలో అంకిత తల్లిదండ్రుల నిరసన.. రాహుల్ గాంధీ మద్దతు..!
-
Thursday Horoscope: గురువారం దిన ఫలాలు.. ఈ రాశుల వారికి మిశ్రమ ఫలితాలు.. మరి ఏం చేయాలి?
-
ICC Rankings: గెలుపోటములతో సంబంధం లేదు.. టీ20 ర్యాంకింగ్లో టాప్లోకి దూసుకెళ్లిన శ్రేయస్ అయ్యర్..
ట్రెండింగ్
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్‌ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..
-
టాటా.. బైబై.. గయా.. WCL 2026 లీగ్ స్టేజీలోనే ఇండియా చాంపియన్స్ ఔట్..!
-
How To Grow Tej Patta In Pots: మార్కెట్ నుంచి తెచ్చే పని లేదు.. ఇంట్లోనే ఈజీగా బిర్యానీ ఆకు మొక్కను పెంచండి..