Karumuri Nageswara Rao: చంద్రబాబు కుట్రలను తిప్పికొట్టాలి.. జగన్‌ను మళ్లీ సీఎం చేయాలి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Karumuri Nageswara Rao Fires On Chandrababu Naidu: గుంటూరు మిర్చి యార్డులో నూతన పాలక వర్గం ప్రమాణ స్వీకారం చేసింది. ఈ కార్యక్రమానికి మంత్రులు కారుమూరి నాగేశ్వరరావు, అంబటి రాంబాబు, ఎంపీ శ్రీకృష్ణ దేవరాయులతో పాటు పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి కారుమూరి నాగేశ్వరరావు మాట్లాడుతూ.. ఆసియాలో అతి పెద్దదైన మిర్చి యార్డు చైర్మన్ పదవి మంత్రి పదవి కంటే పెద్దదని పేర్కొన్నారు. అలాంటి పదవిని సీఎం జగన్ బీసీలకు కేటాయించారన్నారు. గతంలో చంద్రబాబు కలెక్టర్ల మీటింగ్‌లో మా కులం వాళ్ళకు పని చేయమని ఆదేశాలు ఇచ్చేవాడని.. కానీ జగన్ మాత్రం ఎస్సీ, బీజీలతో పాటు ఆర్థికంగా వెనుకబడిన వారికి మేలు చేయాలని ప్రయత్నిస్తున్నారని పేర్కొన్నారు.
Also Read
- Local Body Elections: ‘జయహో బీసీ’ నినాదంతో స్థానిక సమరానికి టీడీపీ.. సీఎం కీలక ప్రకటన..
- Pawan Kalyan: అడవి తల్లి బాట 2.0 కార్యక్రమం ప్రారంభం.. స్థానిక ఎన్నికల్లో కూటమి సత్తా చాటాలి.!
- Chiranjeevi: వయసు ఒక నంబర్ మాత్రమే..! ప్రేమ, అభిమానమే నాకు ఎనర్జీ..
- BC Reservations: సర్కార్ కీలక ఉత్తర్వులు.. పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లకు గ్రీన్ సిగ్నల్..!
పవన్ కళ్యాణ్, చంద్రబాబు కలిసి వాలంటీర్లపై వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారని మంత్రి కారుమూరి మండిపడ్డారు. పథకాల కోసం మన ఇంటి మహిళలు ఆఫీసుల చుట్టూ తిరగాలా? అని ప్రశ్నించాలి. రాష్ట్రంలో చంద్రబాబు చేస్తున్న కుట్రల్ని తిప్పికొట్టాలన్నారు. చంద్రబాబు హయాంలో పేదవారు ఇంజనీరింగ్ కాలేజీలో చదివారా? అని నిలదీశారు. అప్పట్లో వైయస్ రాజశేఖరరెడ్డి హయాంలో, ఇప్పుడు వైఎస్ జగన్ హయాంలో పేదవారు ఇంజనీర్లు అవుతున్నారని పేర్కొన్నారు. దాచుకో, దోచుకో, పంచుకో పరిస్థితి నుండి.. వాలంటీర్ వ్యవస్థ ద్వారా సీఎం జగన్ ప్రతి కుటుంబానికి చేరువయ్యాడన్నారు. సీఎం జగన్ విద్యావ్యవస్థలో మార్పులు తెచ్చారన్నారు. దేశంలో విద్యావ్యవస్థలో మన రాష్ట్రం మూడో స్థానంలో ఉందని.. అలాంటి జగన్‌ను మళ్లీ సీఎం చేయాలని పిలుపునిచ్చారు.
Undavalli Arun Kumar: పోలవరం ప్రాజెక్టు పూర్తి కాలేదు.. ఇంకా పునాదుల్లోనే ఉంది
తాజావార్తలు
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Ganesh Acharya Biopic: తెరపైకి స్టార్ కొరియోగ్రాఫర్ లైఫ్ స్టోరీ.. ‘గణేశ్’ ట్రైలర్ చూశారా!
-
Smriti Mandhana: బాలల హక్కుల కోసం స్మృతి మంధాన ముందడుగు.. ఆహ్వానించిన సచిన్ టెండూల్కర్..
-
Pakistan: పాకిస్తాన్లో అరాచక పాలన.. ఖైబర్ ఫఖ్తుంఖ్వాలో ఎమర్జెన్సీ.!
-
Rajinikanth: బాషా 2.. పేట 2 వద్దని.. జైలర్ 2కి తలైవా ఎందుకు ఒప్పుకున్నారు?
ట్రెండింగ్
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్స్టీన్ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..