Kapu Corporation Chairman Adapa Seshu Sensational Comments On Pawan Kalyan: జనసేనాధినేత పవన్ కళ్యాణ్ చేపట్టిన వారాహి యాత్రపై ఏపీ కాపు కార్మొరేషన్ ఛైర్మన్ అడపా శేషు సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు కోసమే పవన్ ముసుగు యాత్రలు చేస్తున్నారని విమర్శించారు. శనివారం తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో అడపా శేషు మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు ముఖంలో ఆనందం చూడటం కోసమే పవన్ పోరాటమని చురకలంటించారు. ప్రజల్లో సీఎం జగన్‌కి ఉన్న ఆదరణ చూసి.. పవన్ తట్టుకోలేకపోతున్నారని అన్నారు. సీఎం జగన్ అంటే.. పవన్, చంద్రబాబు వణికిపోతున్నారని పేర్కొన్నారు. పవన్ పూటకో మాట, ప్రాంతానికో మాట మాట్లాడుతున్నారని మండిపడ్డారు.
Minister Venugopala Krishna: పవన్ పూటకో వేషం వేస్తున్నాడు.. మంత్రి వేణు ధ్వజం
పవన్ కళ్యాణ్‌కు కావాల్సింది కేవలం చంద్రబాబు మాత్రమేనని, జనసేన కార్యకర్తలు కాదని అడపా శేషు వ్యాఖ్యానించారు. అసలు పవన్ ఏం మాట్లాడుతున్నారో, ఆయనకే అర్థం కావడం లేదని ఎద్దేవా చేశారు. పేదల సంక్షేమం కోసం సీఎం జగన్ లక్షల కోట్లు ఖర్చు చేస్తున్నారని.. అది పవన్‌కి కనిపించడం లేదా? అని ప్రశ్నించారు. చంద్రబాబు చేసిన మోసాలు పవన్‌కు కనిపించలేదా? అని నిలదీశారు. జనసేన పార్టీకి ఓ సిద్ధాంతం, విధానమంటూ ఏమీ లేవని కౌంటర్ వేశారు. ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిపోయిన చంద్రబాబు హైదరాబాద్ నుంచి విజయవాడకు పారిపోయి వచ్చారని.. ఆయనలో పాలనలో జరిగిన అవినీతి గురించి పవన్ ఏనాడైనా ప్రశ్నించారా? అని మండిపడ్డారు. మంత్రి పెద్దిరెడ్డి ఇసుక దోచుకుంటున్నారంటూ పవన్ ఆరోపణలు చేయడం సిగ్గుచేటని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Robber Bride: పెళ్లై 5 రోజులు కాలేదు.. అత్తగారింటికి కన్నం వేసిన కొత్త పెళ్లికూతుర్లు..
అంతకుముందు కూడా.. కాపులను మోసం చేయడానికే పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర ప్రారంభించాడని అడపా శేషు ఘాటు వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు ఇచ్చిన రూట్లోనే పవన్ యాత్ర సాగుతుందని ఆరోపించారు. చంద్రబాబు హయాంలో కాపు ఉద్యమంపై కేసులు పెడితే.. పవన్ ఎందుకు మాట్లాడలేదో చెప్పాలని డిమాండ్ చేశారు. కాపు ఓట్లను చంద్రబాబు దరిచేర్చడానికే పవన్ పనిచేస్తున్నాడని, కాపులంతా ఇప్పటికైనా కళ్లు తెరవాలని సూచించారు. 2014లో పవన్‌ని చూసి టీడీపీకి ఓట్లేస్తే.. ప్రజలకు మీరేం చేశారని ప్రశ్నించారు. సీఎం జగన్‌ని ఎదుర్కేలేకే.. ప్రాంతాలు, కులాల మధ్య చిచ్చు పెడుతున్నారని ఆరోపణలు చేశారు. అసలు పవన్ ఆలోచన ఏమిటో? కాపులకు ఆయన ఏం చేస్తారో చెప్పాలని కోరారు.