SVSN Varma: నేను పిఠాపురంలోనే పుట్టా.. పిఠాపురంలోనే పెరిగా.. ఎవడైనా సొంత ఊరు వదిలి వెళ్లిపోతారా..? వర్మ హాట్ కామెంట్స్..
- నియోజకవర్గ మార్పుపై స్పందించిన పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ..
- నేను పిఠాపురంలోనే పుట్టాను.. పిఠాపురంలోనే పెరిగాను..
- ఎవడైనా సొంత ఊరు వదిలి వెళ్లిపోతారా..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
SVSN Varma: గత సార్వత్రిక ఎన్నికల ముందు నుంచి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే, తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత ఎస్.వి.ఎస్.ఎన్. వర్మ (శ్రీవత్సవాయి సత్యనారాయణ వర్మ) వార్తల్లో నిలిచారు.. మొదట సీటు కోసం పట్టుబట్టిన ఆయన.. ఆ తర్వాత టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సర్దిచెప్పడంతో.. జనసేన అధినేత పవన్ కల్యాణ్ కోసం తన సీటు త్యాగం చేశారు.. ఇక, పవన్ గెలుపు కోసం తన వంతు కృషి చేశారు.. అయితే, ఎన్నికల్లో కూటమి అభ్యర్థులు ఘన విజయం సాధించడం.. టీడీపీ – జనసేన – బీజేపీ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత.. ఆయన పలు సందర్భాల్లో చేసిన వ్యాఖ్యలు మాత్రం సంచలనంగా మారాయి.. ఇప్పుడు మరోసారి హాట్ కామెంట్స్ చేశారు శర్మ.. నియోజకవర్గ మార్పుపై జరుగుతున్న ప్రచారంపై పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ ఘాటుగా స్పందించారు. తాను పిఠాపురాన్ని విడిచి వెళ్లే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.
Read Also: Toxic Movie Teaser: ‘టాక్సిక్’ టీజర్‌కు సర్టిఫికేట్ అవసరం లేదన్న సెన్సార్ బోర్డు!
Also Read
- Pawan Kalyan: స్థానిక సంస్థల ఎన్నికలు.. జనసేన నేతలకు పవన్ పిలుపు..
- Varupula Subbarao Resigns from YSRCP: వైసీపీకి బిగ్ షాక్.. పార్టీకి వరుపుల సుబ్బారావు గుడ్‌బై.. పవన్ సమక్షంలో జనసేనలో చేరిక..
- Deputy CM Pawan Kalyan: కాకినాడలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు.. అభివృద్ధి, స్వేచ్ఛపై పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు
- Minister Narayana: అన్ని మున్సిపాలిటీలకు ఒకేసారి ఎన్నికలు.. మంత్రి నారాయణ కీలక ప్రకటన
పిఠాపురం మాజీ ఎమ్మెల్యే, తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత వర్మ మాట్లాడుతూ.. “నేను పిఠాపురంలోనే పుట్టాను.. పిఠాపురంలోనే పెరిగాను. సొంత ఊరు వదిలి ఎవడైనా వెళ్లిపోతారా?” అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పిఠాపురం తనకు కేవలం రాజకీయ నియోజకవర్గం మాత్రమే కాదని, తన జీవితం, తన ఊరని పేర్కొన్నారు.. అయితే, పార్టీ అవసరాల మేరకు వేరే బాధ్యతలు అప్పగిస్తే అక్కడికి వెళ్లి పని పూర్తి చేసి తిరిగి తన సొంత ఊరైన పిఠాపురానికి వస్తానని స్పష్టం చేశారు. పార్టీ చెప్పిన బాధ్యతలను నిర్వర్తించడం తన కర్తవ్యమని స్పష్టం చేసిన ఆయన.. కానీ, పిఠాపురాన్ని మాత్రం ఎప్పటికీ వదలబోనని తెగేసి చెప్పారు.. అయితే, వర్మ చేసిన ఈ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారాయి.
ఇక, వైఎస్ జగన్ రెడ్డి అమరావతిపై చేస్తున్న వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చిన వర్మ.. ఇద్దరు ఉండే జగన్ కుటుంబానికి వేల ఎకరాలు..? ఐదు కోట్ల ప్రజలకు రాజధాని వద్దా ? అని నిలదీశారు.. జగన్ రెడ్డి ఆయన సతీమణి ఇద్దరు ఉండడానికి హైదరాబాద్ లోటస్ పాండ్ లో లక్ష చదరపు అడుగులు, బెంగళూరులో ప్యాలస్ 30 ఎకరాలు, తాడేపల్లి ప్యాలస్ 87,120 చదరపు అడుగులు, కడపలో రాజ్ భవన్ 10 ఎకరాలు, ఇడుపుల పాయలో 350 ఎకరాలు, చెన్నైలో ప్యాలస్ 8 ఎకరాలు, ముంబాయి ఢిల్లీలో భవనాలు 7 ఎకరాలు, ఇద్దరు సభ్యులు ఉండే జగన్మోహన్ రెడ్డికి ఐదు వందల ఎకరాల పైగా విలాసవంతమైన భవనాలు ప్యాలస్ లు ఉండాలి.. కానీ, కోట్లాది మంది ప్రజలకు అవసరమయ్యే రాజధాని మాత్రం విశాలంగా ఉండకూడదా జగన్ ? అంటూ నిలదీశారు వర్మ..
తాజావార్తలు
-
Makkah Defence Pact: భారత్‌తో యుద్ధంలో తండ్రి మృతి.. ఇప్పుడు ‘మక్కా కూటమి’కి సారథిగా కుమారుడు
-
OTR: రిజర్వేషన్స్ మారిపోయినా పట్టు తగ్గకుండా సీనియర్స్ జాగ్రత్తలు..
-
Piyush Goyal: భారత్-అమెరికా ఒప్పందంపై పీయూష్ గోయల్ కీలక ప్రకటన
-
Traffic: ట్రాఫిక్ కష్టాలకు శాశ్వత పరిష్కారం.. తెలంగాణలో కొత్త విధివిధానాలు అమల్లోకి..
-
బాక్సాఫీస్ వద్ద నాని ఊచకోత.. ‘The Paradise’ ప్రీమియర్స్‌తో సరికొత్త హిస్టరీ! కలెక్షన్స్ ఎంతంటే?
ట్రెండింగ్
-
LIC Smart Pension Plan: రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక భద్రత ఇచ్చే బెస్ట్ స్కీమ్.. జీవితాంతం నెలకు రూ. 25,000 పెన్షన్..!
-
Wall Weeds: గోడలు మొలిచే పిచ్చి మొక్కలతో భవనాలకే ముప్పు.. సింపుల్ చిట్కాలు ఇవే..!
-
Asian Games 2026లో భారత్ షెడ్యూల్ ఇదే.. పాకిస్థాన్‌తో మ్యాచ్ ఎప్పుడంటే?
-
144Hz డిస్‌ప్లే, 11,000mAh బ్యాటరీతో కొత్త ట్యాబ్లెట్లు Xiaomi Pad 9, Pad 9 Pro లాంచ్..!
-
Mushroom Pulao: నాన్‌వెజ్‌ను తలపించే రుచితో హెల్తీ & టేస్టీ రెస్టారెంట్ స్టైల్ ‘మష్రూమ్ పులావ్’.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా.!