అక్కడ పాగా వేయడానికి రెండేళ్లుగా ఎదురు చూస్తోంది అధికారపార్టీ. ఇప్పుడా ముహూర్తం దగ్గర పడిందా? మేయర్ పీఠాన్ని కైవశం చేసుకుంటుందా? జరుగుతున్న పరిణామాలు.. వస్తున్న సంకేతాలు.. పొలిటికల్ ఎత్తుగడలను బలపరుస్తున్నాయా? ఇంతకీ ఏంటా కార్పొరేషన్.. ఏమా కథ? 15తో నాలుగేళ్లు పూర్తికానున్న పావని మేయర్ పదవీకాలం తూర్పుగోదావరి జిల్లా కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. ప్రస్తుతం అక్కడ ఎన్నికలు లేకపోయినా.. మేయర్ పీఠంపై అధికారపార్టీ వైసీపీ గురిపెట్టడమే ఆ వేడి సెగలకు కారణం. ఈ…