Deputy CM Pawan Kalyan: పిఠాపురంలో సమస్యల పరిష్కారంపై పవన్ స్పెషల్ ఫోకస్.. ప్రత్యేక బృందాలు ఏర్పాటు
- పిఠాపురంపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రత్యేక దృష్టి..
- సమస్యల పరిష్కారం కోసం ప్రత్యేక బృందాలు..
- 21 మంది జిల్లా స్థాయి అధికారుల ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలు..
- క్షేత్రస్థాయిలో పర్యటించి సమస్యలపై నివేదిక ఇవ్వాలని ఆదేశాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Deputy CM Pawan Kalyan: జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్.. తాను ప్రతినిథ్యం వహిస్తోన్న పిఠాపురం నియోజకవర్గంపై ప్రత్యేకంగా దృష్టి సారించారు.. నియోజకవర్గంలోని సమస్యల పరిష్కారం కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు.. పిఠాపురంలో సమస్యల పరిష్కారం పై దృష్టి పెట్టిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. 21 మంది జిల్లా స్థాయి అధికారుల ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశారు.. ఇక, నియోజకవర్గంలో 52 గ్రామాలు, రెండు మున్సిపాలిటీలలో క్షేత్రస్థాయిలో పర్యటించి సమస్యలపై నివేదిక ఇవ్వాలని ఆ ప్రత్యేక బృందాలకు ఆదేశాలు జారీ చేశారు.. సమస్యల పరిష్కారానికి అభివృద్ధి కార్యక్రమాలకి సంబంధించి సమగ్రంగా అధ్యయనం చేయాలని సూచించారు..
Read Also: AP Government: శుభవార్త చెప్పిన ఏపీ సర్కార్.. తక్కువ ధరకే వంట నూనె..
Also Read
- CM Chandrababu: వైసీపీకి సీఎం చంద్రబాబు సీరియస్ వార్నింగ్.. ఎవరూ ఆపలేరు..!
- Explainer: పిడుగులు చంపుతున్నాయ్.. తెలుగు రాష్ట్రాలకు డేంజర్ అలెర్ట్!
- Kakinada Accident: ఉపాధి కూలీలపైకి దూసుకెళ్లిన టిప్పర్.. అక్కడికక్కడే నలుగురు మహిళల మృతి
- Instagram Reel Leads to Poisoning: ప్రాణం మీదకు తెచ్చిన ఇన్‌స్టా రీల్ వంటకం.. నలుగురి పరిస్థితి విషమం..
కాగా, పిఠాపురం నియోజకవర్గం నుంచి కూటమి అభ్యర్థిగా బరిలోకి దిగిన పవన్ కల్యాణ్.. భారీ మెజార్టీతో తన ప్రత్యర్థి అయిన వైసీపీ అభ్యర్థి వంగా గీతపై విజయం సాధించారు.. ఇక, డిప్యూటీ సీఎం పోస్టుతో పాటు కీలక శాఖలు దక్కించుకున్న ఆయన.. ఓవైపు తన శాఖలపై రివ్యూలు నిర్వహిస్తూనే.. మరోవైపు క్షేత్రస్థాయిలోనూ పర్యటించారు.. తాను ప్రతినిథ్యం వహిస్తోన్న పిఠాపురంలో ఆయన క్షేత్రస్థాయిలో పర్యటించి.. కొన్ని దీర్ఘకాలిక సమస్యల పరిష్కారంపై దృష్టిసారించిన విషయం విదితమే.
తాజావార్తలు
-
Carrot Oil : ముఖం గ్లో అవ్వాలా.? క్యారెట్ నూనెతో మెరిసే చర్మం..
-
INDIA alliance: రేపే ఇండియా కూటమి సమావేశం.. 23 పార్టీలు హాజరయ్యే ఛాన్స్..
-
CM Revanth Reddy : సైబరాబాద్‌కు రూ.1,858 కోట్ల బూస్ట్.. రేపు సీఎం భారీ శంకుస్థాపనలు
-
CM Chandrababu: స్థానిక ఎన్నికలపై సీఎం చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు..
-
Kitchen Hacks: ఇలా చేస్తే మీ వంటింట్లోకి చీమలు చచ్చినారావు.. కేవలం 2 నిమిషాల్లో ఇంట్లోనే ఈ నాచురల్ స్ప్రే చేసుకోండిలా!
ట్రెండింగ్
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్‌కు చెక్ పెట్టండి.!
-
Monsoon Tips: వర్షాకాలంలో ప్రయాణమా..? ఈ చిన్న జాగ్రత్తలు ప్రాణాలను కాపాడతాయి.!
-
Vaibhav Sooryavanshi-BCCI: బుడ్డోడు భలే లక్కీ.. రోహిత్, కోహ్లీకి లేని ప్రత్యేక సౌకర్యం!
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!