Ratha Saptami 2026: రేపే రథ సప్తమి- ఈ విధంగా స్నానం చేస్తే ఏడు జన్మల పాపాలు తొలగిపోతాయి పక్కా!
- మాఘ మాసం శుక్ల పక్షంలో వచ్చే సప్తమి తిథిని రథ సప్తమి అంటారు..
- ఈ విధంగా స్నానం చేస్తే ఏడు జన్మల పాపాలు తొలగిపోతాయి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ratha Saptami 2026: ప్రతి ఏడాది మాఘ మాసం శుక్ల పక్షంలో వచ్చే సప్తమి తిథిని రథ సప్తమిగా పిలుస్తారు. ముఖ్యంగా ఈ పర్వదినాన సూర్యుడు ఏడు గుర్రాలపై దక్షిణాయనం నుంచి ఉత్తరాయనం వైపునకు ప్రయాణం కొనసాగిస్తాడు. అందుకే మాఘ సప్తమి మొదలు వచ్చే ఆరు మాసాలూ ఉత్తరాయణ పుణ్యకాలమని పండితులు చెప్తుంటారు. ఈ నేపథ్యంలో ఈ ఏడాది రథసప్తమి రోజున ఎలా స్నానం చేస్తే విశేషమైన ఫలితాలు ఉంటాయి? సూర్యభగవానుడిని ఎలా పూజించాలి? లాంటి పూర్తి వివరాలు తెలుసుకుందాం పదండి..
Read Also: UP: ప్రియుడ్ని పెట్టెలో దాచిన కోడలు.. అత్త ఏం చేసిందంటే..!
Also Read
- Thursday Horoscope: గురువారం దిన ఫలాలు.. ఆ రాశుల వారికి అన్ని శుభవార్తలే, ఊహించని డబ్బు!
- Chanakya Neeti: జీవితాన్ని గెలవాలంటే ఇది తెలుసుకోండి! చాణక్యుడి సీక్రెట్ రూల్..
- Sunday Horoscope: ఆదివారం దిన ఫలాలు.. ఆ రాశుల వారు అప్రమత్తంగా ఉండాల్సిందే!
- Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
అయితే, హిందూ పురాణాల ప్రకారం, కశ్యప మహర్షి, అదితి దేవి దంపతులకు సూర్య భగవానుడు పుట్టాడు. ఆయన పుట్టినరోజునే రథ సప్తమిగా జరుపుతారు. దీన్నే సూర్య జయంతి, అచల సప్తమి, విధాన సప్తమి అనే పేర్లతో కూడా పిలుస్తుంటారు. ఇక, హిందూ క్యాలెండర్ ప్రకారం ఈ సంవత్సరం(2026) జనవరి 25వ తేదీన(ఆదివారం) రథ సప్తమి వచ్చింది. ముఖ్యంగా ఈ రోజు చేసే స్నానానికి చాలా ప్రత్యేకత ఉందంటున్నారు ప్రముఖ జ్యోతిష్య నిపుణులు.
Read Also: Thar Roxx Star Edn: స్కైరూఫ్, 360° కెమెరాతో.. థార్ రాక్స్ స్టార్ ఎడిషన్‌ను విడుదల చేసిన మహీంద్రా
రథ సప్తమి రోజు తలస్నానం చేసే విధానం..?
ఎంతో పవిత్రమైన రోజుగా భావించే రథ సప్తమి నాడు చేసే ప్రత్యేకమైన స్నానం ఏడు జన్మల పాపాలు, దోషాలు, దరిద్రాలను తొలగింపజేస్తుందని పండితులు అంటున్నారు. మరి, ఈ పవిత్రమైన స్నానం కోసం ఏడు జిల్లేడు ఆకులు, 7 రేగి పళ్లు తీసుకుని.. ఆపై స్నానం చేసే ముందు వాటిని శిరస్సుపై ఉంచి తలస్నానం చేయాలని పేర్కొంటున్నారు. ఎందుకంటే ఇవి సూర్యభగవానుడికి ఎంతో ఇష్టం. కాబట్టి, రథ సప్తమి రోజు చేసే ఈ ప్రత్యేక స్నానం ఏడు రకాలైన పాపాలను తొలగిపోతాయి.
* తెల్లవారుజామునే నిద్రలేచి ఇంటిని శుభ్రం చేసుకుని పైన చెప్పిన విధంగా తలస్నానం చేయాలి..
* స్నానమాచరించాక సూర్యుడిని ఆరాధించాలి.. ఇందుకోసం మీ ఇంటి ఆవరణలో సూర్య కిరణాలు ఎక్కడ స్పష్టంగా పడతాయో అక్కడ ముగ్గులు వేయాలి..
* ఆ తర్వాత మీకు వీలైతే చిక్కుడు ఆకులు, చిక్కుడు పూలు, చిక్కుడు కాయలు వీటిని కలిపి ఒక మండపం లాగా పెట్టాలి.. అక్కడ సూర్య దేవుని ఫొటో లేదా విగ్రహాన్ని ఉంచాలి..
* ఆపై ఆ చిత్రపటాన్ని గంధం, కుంకుమ పెట్టి, ఎర్రని రంగు పువ్వులతో అలంకరించాలి..
* ఇవన్నీ కుదరకపోతే మీ పూజ మందిరంలో ఒక తమలపాకు తీసుకుని దానిపై తడి గంధంతో గుండ్రంగా ఒక రూపు గీసి.. దానిని సూర్యభగవానుడిగా భావించాలి.. ఒకవేళ మీ దగ్గర సూర్య దేవుని ఫొటో ఉంటే అది పెట్టాలి.
* అనంతరం గోధుమలతో తయారు చేసిన పదార్థం నైవేద్యంగా పెట్టి సూర్య భగవానుడిని పూజించాలి..
* మీకు వీలైతే ఆవు పాలతో పాయసం చేసి సమర్పిస్తే ఇంకా మంచిది..
* కొబ్బరి పుల్లల సహాయంతో చిన్న రథాన్ని తయారు చేసి, ఆ రథానికి పూజ చేసి, ఆవు నెయ్యితో చేసిన దీపం వెలిగించాలి..
* పూజ కార్యక్రమాలు ముగిసిన తర్వాత కుటుంబ సభ్యులు ఆ ప్రసాదాన్ని స్వీకరించాలి.
దానం చేయాల్సినవి!
* సూర్యుడికి ఇష్టమైన రథ సప్తమి రోజున ఎవరికైనా ఒకరికి గొడుగు, చెప్పులు దానం ఇవ్వడం వల్ల జీవితంలో కష్టాలన్నీ తొలగిపోతాయి..
* రథ సప్తమి రోజు ఇలా సూర్యభగవానుని ప్రత్యేకమైన విధివిధానాలతో ఆరాధించడం మంచిది, దాన ధర్మాలు చేయడంతో సూర్యదేవుడు భక్తులకు మంచి ఆరోగ్యం, దీర్ఘాయువును ప్రసాదిస్తాడని, ఆదాయ పరంగా మంచి ప్రయోజనాలు చేకూరతాయి
* అలాగే, సూర్యుడి సంపూర్ణ అనుగ్రహం లభించి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని పండితులు అంటున్నారు..
తాజావార్తలు
-
Sugar Sale Quota October 2026: దసరాకు ముందు చక్కెర కోటా విడుదల.. ఈ 3 రాష్ట్రాలకే భారీ కేటాయింపులు
-
Abhishek Sharma Bowling: ఏషియన్ గేమ్స్‌లో అభిషేక్ శర్మ సంచలనం.. వరుసగా మూడు వికెట్స్!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
BC Reservations: బీసీ రిజర్వేషన్ల జీవోలు కొట్టివేత.. హైకోర్టు తీర్పుపై ఏపీ సర్కార్ కీలక నిర్ణయం..
-
Tulsi Plant: ఇంట్లో తులసి మొక్క ఉందా? పాజిటివ్ ఎనర్జీ, సిరిసంపదలు రావాలంటే ఈ టిప్స్ పాటించండి
ట్రెండింగ్
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?
-
Instant Dosa Recipes: పులియబెట్టే పని లేకుండా.. అప్పటికప్పుడు నోరూరించే వివిధ రకాల దోశలు ఇలా సింపుల్‌గా చేయండి ఇలా..!
-
Rohit Sharma Celebration: అది నా కోసం మాత్రమే, నేను చెప్పను.. జాగింగ్ సెలబ్రేషన్స్‌పై రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
8,000mAh బ్యాటరీ, Full HD+ AMOLED డిస్ప్లేతో Oppo K15s, K15x లాంచ్.. ధర ఎంతంటే.?
-
భారీ బ్యాటరీ, ఇమర్సివ్ డిస్ప్లేతో అక్టోబర్ 6న Vivo S2 FE లాంచ్‌కు రెడీ..!