నెల్లూరు కోర్టులో జరిగిన అంశంపై తీవ్రంగా స్పందించారు మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డి. నా మీద 2017లో సోమిరెడ్డి కేసు పెట్టారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో రెండు సార్లు చార్జిషీట్ చేస్తే కోర్టు ఇది సరైన కేసు కాదని చెప్పింది. వైసీపీ అధికారంలోకి వచ్చాక చార్జిషీట్ ఫైల్ అయ్యింది. దొంగతనాలు చేయాల్సిన అవసరం మాకేమన్నా ఉందా, దొంగతనం చేసి కాగితాలు బయటపడేస్తారా? ఒక పథకం ప్రకారంగా కావాలని చేసి కక్షదారులు చేసి ఉండొచ్చు అనే అనుమానం ఉందన్నారు…