JC Prabhakar Reddy: నీ విగ్రహాల ఏర్పాటుకు నిరాకరించే వారికి నిద్ర లేకుండా చేయిస్వామి..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వినాయక చవితి వచ్చేసింది.. ఇప్పటికే గల్లీలు, విధులు, ఊరు, వాడ అనే తేడా లేకుండా గణేష్ మండపాలు వెలుస్తున్నాయి.. మరికొన్ని చోట్ల.. మండపాల ఏర్పాటుకు, విగ్రహాలు పెట్టేందుకు అధికారులు, పోలీస్ స్టేషన్ల చుట్టూ అనుమతుల కోసం తిరాగాల్సిన పరిస్థితి ఉంది.. ఈ పరిణామాలపై తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి కాస్త సీరియస్‌గా స్పందించారు.. నీ విగ్రహాల ఏర్పాటుకు నిరాకరించే వారికి నిద్ర లేకుండా చేయిస్వామి అంటూ ఆ గణపతిని వేడుకున్నాడు.. ఏ విషయంపైనానా ముక్కుసూటిగా, కుండ బద్దలు కొట్టినట్టుగా మాట్లాడే జేసీ ప్రభాకర్‌రెడ్డి.. తాడిపత్రి ప్రజలు సంతోషంగా ఉండడం ఇష్టం లేదా? అంటూ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు దయ దక్షిణాలతో హిందూవుల పండుగలు నిర్వహించుకోవాలా..? అని ప్రశ్నించారు.
Read Also: Dokka Manikya Vara Prasad: తాడికొండ వివాదం.. ఎమ్మెల్సీ మాణిక్యవరప్రసాద్ ఆసక్తికర వ్యాఖ్యలు..
Also Read
- Varupula Subbarao Resigns from YSRCP: వైసీపీకి బిగ్ షాక్.. పార్టీకి వరుపుల సుబ్బారావు గుడ్‌బై.. పవన్ సమక్షంలో జనసేనలో చేరిక..
- Sajjala Ramakrishna Reddy: డీఎస్సీ వివాదంపై సజ్జల సంచలన ఆరోపణలు..
- AP Heavy Rain Alert: భారీ నుంచి అతిభారీ వర్షాలు.. అధికారులకు హోంమంత్రి అనిత కీలక ఆదేశాలు
- AP Government: జూనియర్ డాక్టర్లకు ప్రభుత్వం శుభవార్త.. ఉత్తర్వులు జారీ
గణేష్ విగ్రహాల ఏర్పాటు అనుమతుల కోసం గంటల తరబడి నిరీక్షణ ఎందుకు? అని ప్రశ్నించారు జేసీ ప్రభాకర్ రెడ్డి.. విగ్రహాల అనుమతి నిరాకరణతో వారి పతనం మొదలైందని శాపనార్థాలు పెట్టిన ఆయన… శాంతి భద్రతల పేరుతో విగ్రహాల ఏర్పాటు అనుమతి నిరాకరణ సరికాదని హితవు పలికారు.. మున్సిపల్ చైర్మన్ అయిన నాకే అనుమతి కోసం అధికారులు చుట్టూ తిరిగే పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు.. ఇక, విగ్రహాల ఏర్పాటు నిరాకరించే వారికి నిద్ర లేకుండా చేయాలి స్వామి అంటూ ఆ వినాయకుడిని వేడుకున్నారు తెలుగుదేశం పార్టీ నేత, తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్‌రెడ్డి. కాగా, కొన్ని ప్రాంతాల్లో మండపాల ఏర్పాటుకు అధికారులు అనుమతులు ఇవ్వడంలేదని.. భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. శాంతిభద్రతల సమస్యను సాకుగా చూపుతూ.. విగ్రహాలు ఏర్పాటు చేయకుండా అడ్డుకుంటున్నారని మండిపడుతున్నారు.
తాజావార్తలు
-
Varupula Subbarao Resigns from YSRCP: వైసీపీకి బిగ్ షాక్.. పార్టీకి వరుపుల సుబ్బారావు గుడ్‌బై.. పవన్ సమక్షంలో జనసేనలో చేరిక..
-
Monkey Massage: “మంకేశ్ భాయ్‌ని డిస్టర్బ్ చేయకండి”.. బార్బర్ షాపులో కోతి మసాజ్ రచ్చ! వీడియో వైరల్..
-
Qatar: ‘అందరినీ వేడుకుంటున్నా’.. 2027లోనైనా ప్రపంచాన్ని శాంతిగా ఉండనివ్వండి.. ఖతార్ ప్రధాని విజ్ఞప్తి
-
Sajjala Ramakrishna Reddy: డీఎస్సీ వివాదంపై సజ్జల సంచలన ఆరోపణలు..
-
Radha: 46 కోట్లు కొట్టేశారు.. సొంత అక్కపై పోలీస్ స్టేషన్ మెట్లెక్కిన హీరోయిన్ రాధ!
ట్రెండింగ్
-
Abhishek Anand: ఉద్యోగం చేస్తూనే క్రికెట్.. జపాన్ జాతీయ జట్టుకు చేరిన భారతీయుడు.!
-
India Playing XI: ముగ్గురు స్టార్లకు విశ్రాంతి.. జపాన్‌తో తలపడే భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
-
32.85 కి.మీ మైలేజీ, ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో వచ్చేసిన Maruti Suzuki Swift CNG-AMT.. ధర కూడా తక్కువే.!
-
రూ.13.99 లక్షల ప్రారంభ ధరతో Tata Sierra Dark లాంచ్.. వేరియంట్లు, ఫీచర్లు, ధరల పూర్తి లిస్ట్ ఇదిగో..!
-
జమైకా కింగ్స్మెన్కు షాక్.. CPL 2026 ఛాంపియన్‌గా ఆంటిగ్వా అండ్ బార్బుడా ఫాల్కన్స్.!