Justice Nageswara Rao: విద్యార్థులుగా సరైన సమయంలో సరైన స్టెప్ వేస్తే రాష్ట్రానికి, దేశానికి పేరు తెచ్చినవారు అవుతారని తెలిపారు సుప్రీం కోర్టు రిటైర్డ్ జడ్జి జస్టిస్ లావు నాగేశ్వర రావు.. విజయవాడలోని సిద్దార్థ లా కాలేజీలో లావు వెంకటేశ్వర్లు స్మారకోపన్యాస కార్యక్రమం నిర్వహించారు.. ఈ కార్యక్రమానికి జస్టిస్ లావు నాగేశ్వర రావు, జస్టిస్ జి రామకృష్ణ ప్రసాద్ హాజరయ్యారు.. ఈ సందర్భంగా జస్టిస్ లావు నాగేశ్వర రావు మాట్లాడుతూ.. క్రిమినల్ కేసుల పరిష్కారంలో డీలే ఉందన్నారు.. నేను సుప్రీం కోర్టులో రోజుకు 65 వ్యాజ్యలు పరిశీలించే వాడినని గుర్తుచేసుకున్నారు.. ఇక, హైదరాబాద్‌లో నలుగుర్ని ఎన్‌కౌంటర్ చేస్తే పోలీసులకు దండలు వేశారు.. చట్టాన్ని చేతుల్లోకి తీసుకోకూడదని హితవు పలికారు.. మీ ఇళ్లల్లో ఇలా జరిగితే మీరు ఒప్పుకుంటారా..? అని ప్రశ్నించారు.. మొత్తంగా.. హైదరాబాద్ శివారులో జరిగిన దిశ ఎన్‌కౌంటర్ కేసును ప్రస్తావించారు జస్టిస్ లావు నాగేశ్వరరావు. కాగా, హైదరాబాద్ శివారులో జరిగిన దిశ కేసు.. ఆ తర్వాత జరిగిన నిందితుల ఎన్ కౌంటర్ కేసు సంచలనం సృష్టించిన విషయం విదితమే..
Read Also: Kannababu: మాకు బాలకృష్ణ తక్కువ కాదు.. చిరంజీవి ఎక్కువ కాదు..