సీమ బిడ్డలు అంతా ఏకతాటిపైకి వచ్చి జలాల కోసం పోరాడాల్సిన అవసరం ఉందన్నారు టీడీపీ సీనియర్ నేత జేసీ ప్రభాకర్‌రెడ్డి.. ఈరోజు ఉదయం ఆంధ్రప్రదేశ్ మాజీ పీసీసీ చీఫ్ రఘువీరారెడ్డిని కలిసిన ఆయన.. భవిష్యత్ తరాల కోసం అంతా కలిసి పోరాడాలని ఆయనను కోరారు.. ఇప్పటికే పలువురు అధికారులతో పాటు సీనియర్ నేతలను కూడా కలిసినట్టు చెప్పారు. రాజకీయాల్లో శత్రువులు, మిత్రులు ఉంటారు.. కానీ, పోరాటాలకు కాదన్నారు జేసీ ప్రభాకర్‌రెడ్డి.. ఇక, తమ కలయికకు రాజకీయ ప్రాధాన్యం లేదన్న జేసీ.. రాయలసీమ నీటి కోసమే తాను రఘువీరా రెడ్డిని కలిశాను.. ఇప్పటికే మైసూరారెడ్డితోపాటు రాయలసీమలో చాలా మంది సీనియర్ నాయకులను, రిటైర్డ్ అధికారులను కలిశాను అని తెలిపారు.