జయమంగళ వెంకటరమణ చేరికతో కైకలూరులో వైసీపీ మరింత పటిష్టం అవుతుందన్నారు ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు. వైసీపీలో చేరిన టీడీపీ మాజీ ఎమ్మెల్యే జయమంగళ వెంకట రమణకు పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు సీఎం జగన్. ఈసందర్భంగా జమమంగళ వెంకటరమణ మాట్లాడుతూ… 1999లో వ్యాపారాలు వదులుకుని రాజకీయాల్లోకి వచ్చాను.టీడీపీ జెడ్పీటీసీగా అవకాశమిచ్చారు.అప్పటి సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డితో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి.2009లో టీడీపీ ఎమ్మెల్యే టిక్కెట్ ఇచ్చింది.
ఓ జింకను రెండు పులుల మధ్య నిలబెట్టినట్టు నాకు ఓ ఇద్దరు బడా నేతల ముందు నిలబెట్టి టిక్కెట్టిచ్చారు.2009లో కష్టపడి గెలిచాను.2014లో నేను గెలుస్తానని అంతా భావించారు.40 వేల మెజార్టీ వస్తుందని భావించారు.2014 ఎన్నికల్లో నన్ను నామినేషన్ వేయమన్న చంద్రబాబు.. బీజేపీతో పొత్తు కుదిరిందని తప్పుకోమన్నారు.వెంకయ్య నాయుడు, చంద్రబాబుతో ఒప్పించి నామినేషన్ ఉప సంహరించుకునేలా చేశారు.టీడీపీ గెలిచాక ఎమ్మెల్సీ టిక్కెట్ ఇస్తామన్నారు.కానీ ఐదేళ్లు కళ్లు కాయలు కాచేలా చూసిన ఎమ్మెల్సీ పదవి ఇవ్వలేదు.1983 నుంచి 2009 వరకు కైకలూరు నుంచి గెలిచిన తొలి బీసీ అభ్యర్థిని నేనే.
కైకలూరు ఇన్ఛార్జీగా ఉన్నా.. నన్ను చెప్పు కింద తేలులా తొక్కి ఉంచారు.మంత్రి పదవి అనుభవించిన కామినేని 2019 ఎన్నికల్లో పోటీ చేయకుండా.. తప్పుకున్నారు.పోలేరమ్మకు గొర్రెను బలి ఇచ్చినట్టుగా 2019 ఎన్నికల్లో నాకు సీటు ఇస్తారు.మళ్లీ 2024 ఎన్నికల్లో టీడీపీ గెలుస్తుందనే పుకార్లు పుట్టించిన తర్వాత రకరకాల మంది వస్తారని మళ్లీ ప్రచారం పెట్టారు.పిన్నమనేని, కామినేని, కొనకళ్ల ఇలా చాలా మంది వస్తారని ప్రచారం పెట్టారు.బడుగులకు జగన్ దగ్గరే న్యాయం జరుగుతుంది.వడ్డీ కార్పోరేషన్ పెట్టారు.జగన్ దగ్గరకు వస్తే పేదలకు మేలు చేయగలననే ఉద్దేశ్యంతో పార్టీలో చేరాను.ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చారు.జగనుకు రుణపడి ఉంటాను.వైఎస్ తరహాలోనే జగన్ కూడా పేదలకు మేలు చేస్తున్నారు.ఎమ్మెల్యే దూలంతో నాకు మంచి సంబంధాలే ఉన్నాయి.
Read Also: Instagram: యూజర్స్‌కు బ్యాడ్‌న్యూస్.. ఆ ఫీచర్‌కు ఇన్స్టాగ్రామ్ గుడ్‌బై!
ఎమ్మెల్యేతో కలిసి పని చేస్తాను.కైకలూరులో వైసీపీని గెలిపిస్తాను.పదవి నాకు వెంట్రుక ముక్కతో సమానం.పదవులు శాశ్వతం కాదు.. ఆత్మాభిమానం కావాలి. పాదయాత్రతో గెలుస్తామని భావించి లోకేష్ పాదయాత్ర చేసినట్టున్నారు. వైసీపీ ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు మాట్లాడుతూ.. పార్టీని మరింత పటిష్ట పరిచే విధంగా జయమంగళ చేరిక ఉపకరిస్తుంది.కైకలూరులో వైసీపీ ఇప్పటికే పూర్తిగా బలపడింది.జయ మంగళ చేరిక పార్టీకి మరింత మంచిది.కొల్లేరు నాలుగు నియోజకవర్గాల పరిధిలో ఉంటుంది.. ఆ నియోజకవర్గాల్లో పార్టీ బలోపేతానికి జయ మంగళ కృషి చేస్తారు.జయ మంగళను ఓ తమ్ముడిగా భావిస్తున్నాను.జయమంగళ వెంకట రమణ మాట్లాడుతూ.. నాకు అన్యాయం జరిగిందని వడ్డీ సామాజిక వర్గానికి కోపం ఉంది. నాకు ఎమ్మెల్సీ పదవి ఇవ్వలేదని మా సామాజిక వర్గానికి గుర్రుగా ఉంది. మా సామాజిక వర్గానికి టీడీపీ మీద ప్రేమ ఉన్నా.. నా ఎమ్మెల్సీ పదవి ఇవ్వలేదు కాబట్టి.. వైసీపీకి ఓటేస్తారని భావిస్తున్నా అన్నారు జయమంగళ వెంకటరమణ.