Pawan Kalyan Tour in Kadapa: సీఎం ఇలాకాలో పర్యటనకు సిద్ధమైన పవన్ కల్యాణ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
జనసేన అధినేత పవన్‌కల్యాణ్ మరోసారి ఆంధ్రప్రదేశ్‌లో పర్యటనకు సిద్ధం అవుతున్నారు.. కౌలు రైతు భరోసా యాత్ర పేరుతో ఇప్పటికే పలు జిల్లాల్లో పర్యటించిన జనసేనాని.. బలవన్మరణాలకు పాల్పడిన కౌలు రైతుల కుటుంబాలను పరామర్శిస్తూ.. ఆర్థిక సాయం చేస్తూ వస్తున్నారు.. ఇక, ఈ సారి సీఎం వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ఇలాకాలో పర్యటించనున్నారు పవన్ కల్యాణ్.. జనసేనాని కడప జిల్లా పర్యటన ఖరారైంది. ఈనెల 20న ఉమ్మడి జిల్లాలో పర్యటించనున్నారు. ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతు కుటుంబాలకు లక్ష రూపాయల చెప్పున ఆర్థిక సాయం చేయనున్నారు పవన్. రాజంపేట నియోజకవర్గలో జరిగే రచ్చబండలో పాల్గొని రైతు కుటుంబాల ఇబ్బందులను అడిగి తెలుసుకోనున్నారు. ఇప్పటికే ఉభయ గోదావరి జిల్లాలతోపాటు ప్రకాశం జిల్లాల్లో కౌలు రైతు భరోసా యాత్ర పూర్తయింది.
Read Also: Godavari at Bhadrachalam: ఉగ్రరూపం దాల్చిన గోదావరి.. 54.3 అడుగులకు నీటి మట్టం
Also Read
- Saikrishna Lockup Death: సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో సిట్ దూకుడు.. మరో ఇద్దరు పోలీసుల కోసం గాలింపు!
- NRI: అంతిమ శ్వాస భారత్‌లోనే... అమెరికా పౌరసత్వం ఉన్న బాపట్ల వృద్ధురాలి కన్నీటి విజ్ఞప్తి!
- AP Government Schools: ప్రైవేట్ స్కూళ్లకు షాక్.. ప్రభుత్వ పాఠశాలల్లో భారీగా విద్యార్థుల చేరిక
- Deputy CM Pawan Kalyan: రాష్ట్ర సంపదను కాపాడుతాం.. స్మగ్లర్లకు పవన్ కల్యాణ్ స్ట్రాంగ్ వార్నింగ్..
రాజంపేట నియోజకవర్గం సిద్ధవటంలో జరిగే రచ్చబండ కార్యక్రమంలో పవన్ కల్యాణ్ తో పాటు జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ కూడా పాల్గొననున్నారు. ఇక, ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలకు చాలా సమయం ఉన్నా.. ముందస్తు ఎన్నికలు వస్తాయనే ప్రచారం కూడా ఉంది.. అన్ని పార్టీలు తమ కార్యాచరణపై దృష్టి పెట్టాయి.. అధికార వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు.. గడపగడపకు మన ప్రభుత్వం పేరుతో అన్ని గ్రామాలను చుట్టేసేపనిలో ఉంటే.. ప్రతిపక్షాలు కూడా అదేస్థాయిలో ప్రజల్లోకి వెళ్తున్నాయి.. బాదుడే బాదుడు పేరుతో ప్రధాన ప్రతిపక్షం టీడీపీ కార్యక్రమాలు చేస్తుంటే.. పవన్ కౌలు రైతు భరోసా యాత్ర చేపట్టారు.. బీజేపీ కూడా వరుసగా కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తున్న విషయం తెలిసిందే.
తాజావార్తలు
-
Shah Rukh Khan: ‘నా భర్త కంటే మీరే ఇష్టం’.. మహిళా అభిమాని మాటకు షారుఖ్ ఇచ్చిన సమాధానం వైరల్
-
Woman Constable: ఇదేం పద్దతి మేడం.. ఫిర్యాదు కోసం వచ్చిన వృద్ధుడి ఎదుట.. టేబుల్‌పై కాళ్లు పెట్టిన మహిళా కానిస్టేబుల్
-
Home Freshness Tips: ఇంట్లో దుర్వాసనకు చెక్.. ఎయిర్ ఫ్రెషనర్లు లేకుండానే సింపుల్ చిట్కాలతో ఇంటిని ఫ్రెష్‌గా ఉంచండి.!
-
Saikrishna Lockup Death: సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో సిట్ దూకుడు.. మరో ఇద్దరు పోలీసుల కోసం గాలింపు!
-
Ayodhya: అయోధ్య రామాలయ విరాళాల కుంభకోణంలో కీలక పరిణామం.. ట్రస్ట్ కీలక సభ్యులు రాజీనామా..
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్‌తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!
-
Viral Video: పోలీస్ స్టేషన్లో సహోద్యోగిని ముద్దుపెట్టుకున్న మహిళా కానిస్టేబుల్.. చివరకు.?
-
రూ.9,999కే Lava Smart 4 Plus లాంచ్.. 6.75 అంగుళాల డిస్‌ప్లే, 5000mAh బ్యాటరీతో అదిరిపోయే ఫీచర్లు.!
-
Pesara Garelu Recipe: బయట క్రిస్పీగా, లోపల సాఫ్ట్‌గా ఉండే రుచికరమైన స్నాక్ “పెసర గారెలు” చేసేయండి ఇలా.!
-
Baahubali 3 Announced: ఇండియన్ సినీ ప్రియులకు బిగ్ సర్ప్రైజ్.. ‘బాహుబలి 3′ వస్తోంది!