ఏపీలో ఎన్నికలు ఇంకా రాకుండానే రాజకీయాలు హాట్ హాట్ గా మారుతున్నాయి. వినుకొండ పర్యటనలో ఏపీలో పొత్తులపై సీఎం జగన్ హాట్ కామెంట్స్ చేశారు. తోడేళ్లన్నీ ఏకం అవుతున్నాయన్నారు. జగనన్న చేదోడు పథకం ద్వారా బటన్ నొక్కి లబ్ధిదారుల కు నిధులు పంపిణీ చేశారు సీఎం జగన్.. వినుకొండ కు సీఎం వరాల జల్లు కురిపించారు. వినుకొండలో 100 పడకల ఆసుపత్రి కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సీఎం జగన్.. విపక్షాలపై విరుచుకుపడ్డారు. వెన్నుపోటు దారులకు , మీ బిడ్డ జగన్ కు మధ్య యుద్దం జరుగుతుంది..మీ బిడ్డ కు పొత్తులు ఉండవు…ఒంటరిగా సింహం లా పోరాడతాడు…తోడేళ్ళు అందరు ఒక్కటైనా పేద ప్రజలు ఇచ్చిన బలంతో పోరాటం చేస్తానన్నారు సీఎం జగన్. లంచాలు లేని,వివక్ష లేని మీ బిడ్డ పరిపాలన కావాలా? గజదొంగ ల పరిపాలన కావాలా? మీరే తేల్చుకోండి.. నేను గజదొంగ లను నమ్ము కోలేదు…నేను నా యస్సీ లను నా ఎస్టీ లను నా మైనార్టీ లను నా పేద ప్రజలను నమ్ముకున్న. మీ బిడ్డ ఒక్కడే సింహంలా పోరాడతాడు. మీ కోసం పోరాడతాడు. మీ దీవెనలు నా పై ఉండాలని జగన్ కోరుకున్నారు.
Read Also:KTR: పరిశ్రమలకు భూములిచ్చిన వారిని ఆదుకోవాల్సిన బాధ్యత మనదే Fire On Birthday Party: బర్త్‌డే పార్టీలో కాల్పుల కలకలం.. 8 మంది మృతి
దేశంలోనే ఏపీ ఆదర్శంగా నిలిచింది.. రైతు భరోసా ద్వారా రైతుల ముఖంలో చిరునవ్వు కనిపిస్తోంది.. గిట్టని వాళ్లు రాష్ట్రం శ్రీలంక అయిపోతోందంటూ అబద్ధాలు చెబుతున్నారు.. గతంలో డ్రాక్రా మహిళల రుణాలు మాఫీ చేస్తామని మోసం చేశారు. గతంలో ముసలాయన్ని చూశాం. అన్నీ అబద్ధాలే. గతంలో ఇదే రాష్ట్రం, ఇదే బడ్జెట్ వుండేది. గతం కంటే అప్పుల వృద్ధి తక్కువే. గతంలో ఎందుకు బటన్ లు లేవు. ఖాతాల్లోకి డబ్బులు ఎందుకు రాలేదన్నారు సీఎం జగన్. ట్టని వాళ్లు రాష్ట్రం శ్రీలంక అయిపోతోందని దుష్ర్పచారం చేస్తున్నారు. కానీ, ఇప్పుడు ఏపీ దేశానికే దిక్సూచిగా నిలిచిందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పేర్కొన్నారు. జగనన్న చేదోడు మూడో విడత నిధుల విడుదల కార్యక్రమంలో భాగంగా వినుకొండ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం జగన్.. అక్కడి బహిరంగ సభ ద్వారా ప్రతిపక్షాలపై విమర్శలు సంధించారు.
Read Also: Dasara: నాని సినిమాకి ఈ రేంజ్ ఈవెంట్స్ ఎప్పుడూ చూడలేదు…
గతంలో గజదొంగల ముఠా ఏపీని దోచేశారు. సీఎంగా ఓ ముసలాయాన(చంద్రబాబును ఉద్దేశించి) ఉండేవాడు. ఓ గజ దొంగల ముఠా ఉండేది. ఈనాడు, టీవీ5, ఆంధ్రజ్యోతి, చంద్రబాబు, దత్తపుత్రుడు వీళ్లంతా గతదొంగల ముఠా. మరి వీళ్లు డీబీటీ ద్వారా సంక్షేమ పథకాలు ఎందుకు ఇవ్వలేదు?. ఎందుకంటే వాళ్ల విధానం డీపీటీ కాబట్టి. డీపీటీ అంటే దోచుకో, పంచుకో, తినుకో అని సీఎం జగన్ ప్రతిపక్షంపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ప్రశ్నిస్తానన్న దత్తపుత్రుడు ఏం చేశాడో చూశారు కదా. తోడేళ్లన్నీ ఒక్కటవుతున్నాయి.. సింహంలా మీ బిడ్డ ఒక్కడే నడుస్తున్నాడు అని సీఎం జగన్ పేర్కొన్నారు. మీ బిడ్డకు ఎలాంటి పొత్తుల్లేవు, మీ బిడ్డ వాళ్ల మీద, వీళ్ల మీద నిలబడడు. మీ బిడ్డ ఒక్కడే.. సింహాంలా ఒక్కడే నడుస్తాడు. తోడేళ్లు ఒక్కటవుతున్నా మీ బిడ్డకు భయం లేదు. ఎందుకంటే మీ బిడ్డ ప్రజలను, దేవుడిని నమ్ముకున్నాడు.
ఇది పేదవాడికి, పెత్తందారుకి మధ్య నడుస్తున్న యుద్ధం. మాట ఇస్తే నిలబడే వ్యక్తి ఒక వైపు ఉంటే, వెన్నుపోట్లు, మోసాలు చేసే తోడేళ్లు మరో వైపు ఉన్నారు. గజ దొంగల పాలన కావాలా? లంచాలు, అవినీతికి చోటు లేని పాలన కావాలా?. మీ అందరి చల్లటి దీవెనలతో నడుస్తున్నా. మీ బిడ్డకు ఉన్న నమ్మకం ఒక్కటే మీ అందరి ఆశీస్సులు, దేవుడి చల్లటి దీవెనలు ఉన్నాయి అని సీఎం జగన్ పేర్కొన్నారు. జగనన్న చేదోడు పథకం కింద.. దర్జీలు, రజకులు, నాయీబ్రహ్మణులకు రూ.10 వేల సాయం అందుతోంది.
రాష్ట్రవ్యాప్తంగా 3,30,145 మందికి రూ.330. 15 కోట్ల రూపాయలతో లబ్ధి చేకూరనుంది. ఇదిలా ఉంటే.. ఈ మూడేళ్లలో జగనన్న చేదోడు పథకం కింద రూ.927.51 కోట్లు సాయం అందజేసింది జగన్ ప్రభుత్వం.జై జగన్ నినాదాలతో మారుమోగిన సభా ప్రాంగణం. జగనన్న చేదోడు సాయం.. లబ్ధిదారుల పరిస్థితి ఆర్థికంగా మెరుగుపడడంపై మంత్రి వేణుగోపాల్ ప్రసంగించారు. జగనన్న చేదోడు పథకం దర్జీలు, రజకులు, నాయీ బ్రాహ్మణులకు ఓ వరం. వాళ్లకు సీఎం జగన్ ఇచ్చిన భరోసా. ప్రతీ పేదవాడికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందుతున్నాయని మంత్రి వేణుగోపాల్ తెలియజేశారు. కార్యక్రమం అనంతరం వినుకొండ నుంచి తాడేపల్లికి బయలుదేరారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి.
Read Also: Fire On Birthday Party: బర్త్‌డే పార్టీలో కాల్పుల కలకలం.. 8 మంది మృతి