ప్రకాశం జిల్లా మార్కాపురం మండలం ఇడుపూరులో నిన్న అపహరణకు గురయ్యాడో విద్యార్ధి. అయితే పోలీసులు పట్టించుకోలేదు. ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న నాసర్ వలి(18) అనే విద్యార్థి అపహరణకు గురయ్యాడు. మధ్యాహ్నం 12 గంటలకు పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు రూరల్ పోలీసులు.
ఇడుపూరు గ్రామానికి చేరుకొని విచారణ చేస్తున్నారు డి.ఎస్.పి మహంతి కిషోర్ కుమార్, సీఐ ఆంజనేయ రెడ్డి. అదృశ్యమైన ప్రాంతాలను పరిశీలిస్తున్నారు పోలీసులు.కిడ్నాపైన విద్యార్థి స్నేహితులను విచారిస్తున్నారు డి.ఎస్.పి కిషోర్ కుమార్. లక్ష రూపాయలు డిమాండ్ చేస్తూ వాట్సాప్ లో స్నేహితులకు సందేశాలు పంపుతున్నారు కిడ్నాపర్లు. దీంతో విద్యార్ధి తల్లిదండ్రులు ఆందోళనకు గురవుతున్నారు.