ఏపీలో పలువురు ఐఏఎస్ అధికారులను ప్రభుత్వం బదిలీ చేస్తూ సోమవారం అర్ధరాత్రి ఉత్తర్వులు జారీ చేసింది. పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్గా ప్రసన్న వెంకటేష్… మైనారిటీ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శిగా కె.సునీత… సాంఘిక సంక్షేమ శాఖ ప్రత్యేక కార్యదర్శిగా గంధం చంద్రుడు… కార్మిక శాఖ ప్రత్యేక కమిషనర్గా కార్తీకేయ మిశ్రా… కాపు కార్పొరేషన్ ఎండీగా రేఖారాణి…. విజయవాడ మున్సిపల్ కమిషనర్గా రంజిత్ బాషా… MSME కార్పొరేషన్ సీఈవోగా ఎన్వీ రమణారెడ్డి… ఏపీ భవన్ స్పెషల్ ఆఫీసర్గా (అదనపు బాధ్యతలు) హిమాన్షు శుక్లా… సాంఘిక సంక్షేమ శాఖ రెసిడెన్షియల్ ఇనిస్టిట్యూషన్ సొసైటీ సెక్రటరీగా ఆర్.పవన్ మూర్తి బదిలీ అయ్యారు.
