టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు స్వంత నియోజకవర్గంలో రెండవ రోజు పర్యటన కొనసాగుతోంది. కుప్పంలో చంద్రబాబు పర్యటన ఉద్రిక్తతకు దారితీసింది. ఈ నేపథ్యంలో వైసీపీ నేతలు, కార్యకర్తలు బంద్ కు పిలుపునిచ్చారు. అన్నా క్యాంటీన్ ధ్వంసం చేశారు. పోటాపోటీగా నిరసనలకు సిద్ధం అయ్యాయి టీడీపీ, వైసీపీ వర్గాలు. కుప్పంకు చేరుకోవాలంటూ వాట్సాప్ ద్వారా సందేశాలు వచ్చాయి. చంద్రబాబు పర్యటనను వైసీపీ శ్రేణులు అడ్డుకుంటున్నాయి. కుప్పం బంద్ కు వైసీపీ పిలుపునివ్వడంతో… వ్యాపారులు వారి దుకాణాలను మూసేశారు. ప్రైవేటు పాఠశాలలు స్వచ్ఛందంగా మూతపడ్డాయి. ఆర్టీసీ బస్సులు డిపోకే పరిమితమయ్యాయి. కుప్పంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు పలు చోట్ల బ్యారికేడ్లను ఏర్పాటు చేశారు.
Read Also: Welfare Schemes : సంక్షేమ పథకాలు శృతిమించాయా..? ఉచితాలు ఏమిటనే దానిపై గందరగోళం..!
మరోవైపు బస్టాండ్ వద్ద టీడీపీ ఏర్పాటు చేసిన అన్నా క్యాంటీన్ ను వైసీపీ శ్రేణులు ధ్వంసం చేశాయి. దీంతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. టీడీపీ, వైసీపీలు పోటాపోటీగా నిరసన కార్యక్రమాలకు సిద్ధమవుతుండటంతో టెన్షన్ వాతావరణం నెలకొంది. కార్యకర్తలంతా కుప్పంకు చేరుకోవాలని రెండు పార్టీలు వాట్సాప్ ద్వారా సందేశాలను పంపుతున్నాయి. పరిస్థితిని జిల్లా ఎస్పీ స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. కుప్పంలో పెద్ద ఎత్తున పోలీసులు మోహరించారు. చంద్రబాబు పర్యటనను విజయవంతం చేయాలని టీడీపీ శ్రేణులు పిలుపునిచ్చాయి. రామకుప్పంలో నిరసన ర్యాలీకి వైసీపీ శ్రేణులు రెడీ అయ్యాయి. కొల్లుపల్లెలో రెండు పార్టీల మధ్య ఘర్షణ వాతావరణం ఏర్పడింది. ఎస్పీ రిషాంత్ రెడ్డి పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ఇదిలా వుంటే చంద్రబాబు తీవ్ర నిరసనకు దిగారు. నడిరోడ్డుపై బైఠాయించారు. కార్యకర్తలపై లాఠీ ఛార్జిని చంద్రబాబు ఖండించారు.