High School Students Protest: మా హైస్కూల్ మాకే కావాలి.. సీజేకి విద్యార్ధుల లేఖాస్త్రాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తమ పాఠశాల అంటే వారికెంతో అభిమానం..తమకు విద్యాబుద్ధులు నేర్పించే పాఠశాలను వేరేచోటికి తరలించడాన్ని వారు నిరసించారు. హైకోర్ట్ ప్రధాన న్యాయమూర్తికి మాయదార్లపల్లి విద్యార్థులు లేఖలు రాయడం చర్చనీయాంశంగా మారింది. మా పాఠశాల మాకే కావాలి.మాకు చదువును దూరం చెయ్యవద్దు అంటూ వేడుకున్నారు. గత 45 రోజులుగా పోరాటం చేస్తున్న విద్యార్థులు.. హైకోర్ట్ ప్రధాన న్యాయమూర్తికి లేఖలు రాశారు. అనంతపురం జిల్లా కుందుర్పి మండలం మాయదార్లపల్లి గ్రామం మారుమూల ప్రాంతం. ఎక్కడో విసిరి వేయబడ్డట్లు ఉన్న కర్ణాటక బార్డర్ లో చిట్ట చివరి గ్రామాలైన ఎలాంటి అభివృద్ధి పనులకు నోచుకోని కనీసం మండల కేంద్రానికి చేరుకోవాలంటే సరైన బస్సు సౌకర్యం కూడా సరిగ్గా లేని గ్రామం మాయదార్లపల్లి గ్రామం. అలాంటి గ్రామంలో గత 45 రోజులుగా ఆ విద్యార్థులను బసాపురం స్కూల్ నందు విలీనం చేయటాన్ని నిరసిస్తూ ధర్నా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. బడి బయట ఉన్నాం అయినా కూడా మమ్ములను పట్టించుకున్న నాథుడు లేడని వారు తమ గోడును వెళ్ళబోసుకున్నారు.
Read Also: God Father Teaser: కాపీ చేసి మళ్లీ దొరికిపోయిన తమన్.. ట్రోల్ చేస్తున్న నెటిజన్‌లు
Also Read
- Firecracker Shop Fire: వ్యాపార ప్రచారం కోసం రీల్.. బాణసంచా దుకాణంలో మంటలు, యజమాని మృతి
- Amaravati: రాజధానికి మాస్ ట్రాన్స్‌పోర్టేషన్ ప్రణాళిక.. సీఆర్డీఏ కీలక నిర్ణయం
- CM Chandrababu: ఇక ఇంటిపై పూర్తి హక్కు.. విశాఖలో 28,445 కుటుంబాల కల సాకారం
- Botsa Anusha: భీమిలి YSRCP నియోజకవర్గ సమన్వయకర్తగా బొత్స అనూష
చివరికి పెద్దల సలహా మేరకు ఆంధ్రప్రదేశ్ ప్రధాన న్యాయమూర్తి ,ప్రధాన న్యాయస్థానం, నేలపాడు అమరావతి- పిన్ 522 237 అను అడ్రస్ కు పోస్ట్ కార్డు ద్వారా లేఖలు రాశారు..
గౌరవనీయులు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి దివ్య సన్నిధానానికి నమస్కరించి వ్రాయునది ఏమనగా?
సార్! నేను అనంతపురం జిల్లా కుందుర్పి మండలం మాయదార్లపల్లి ప్రాథమికోన్నత పాఠశాలలో ఏడవ తరగతి చదువుతున్నాను. మా పాఠశాలలోని 6,7,8, తరగతులను బసాపురం ఉన్నత పాఠశాలలో విలీనం చేశారు. కాని మేము మా ఊరి నుండి దాదాపు నాలుగు కిలోమీటర్ల దూరంలో కుంట అను ప్రాంతంలో మా పెద్దలు అక్కడే నివసిస్తున్నారు. మేము అక్కడి నుండి పాఠశాలకు చేరుకోవడానికి నాలుగు కిలోమీటర్లు వంకలు వాగలు చెట్ల వెంబడి పుట్ల వెంబడి నడుచుకుంటూ మాయదార్లపల్లి పాఠశాలకు చేరుకుంటున్నాము. మా తరగతులను బసాపురం గ్రామంలో ఉన్న పాఠశాలకు విలీనం చేయడంతో మేము మరల మాయదార్లపల్లి గ్రామం నుండి మరో మూడు కిలోమీటర్లు నడిచి బసాపురం గ్రామంలోని పాఠశాలకు చేరుకోవాలంటే చాలా కష్టం.
అందుకనే మా ఇంట్లో ని పెద్దలు మా చదువులు మధ్యలోని ఆపు చేయించి మమ్ములను మా తోటి విద్యార్థులను బడి మానివేయించి మా పొలాల్లోని పనులకు మా పశువులను గొర్రెలను మేపడానికి మమ్ములను సిద్ధం చేస్తున్నారు. కావున దయగల మహాప్రభువులు మా పాఠశాల తరగతులను మా ఊరిలోనే నిర్వహించే విధంగా చేస్తే బాగా చదువుకుంటాం. లేదంటే మా తల్లిదండ్రులు మమ్ములను ఎటు పనికి రాకుండా పశువుల కాపర్లుగా గొర్రెల కాపర్లుగా తదితర పనులకు పెట్టబోతున్నారు. అంతేకాకుండా మా పాఠశాల నాడు నేడు పనులన్నీ పూర్తి కాబడి సుందరంగా రూపురేఖలు తిద్దుకుంది. కావున తమరు పెద్ద మనసుతో మా పాఠశాల తరగతులను బసాపురం గ్రామంలో విలీనం చేయకుండా …మా చదువులు మధ్యలో ఆగిపోకుండా మమ్మల్ని ఎలాగైనా కాపాడాలని మిమ్ములను వేడుకుంటున్నాము.
అంటూ పోస్ట్ కార్డు ద్వారా ఈరోజు ఉత్తరాలు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి గారికి రాసుకున్నారు. మరి ప్రధాన న్యాయమూర్తి ఈ చిన్నారుల విన్నపానికి ఎలా స్పందిస్తారో చూద్దాం.
తాజావార్తలు
-
Motorola Signature 27: మోటరోలా Signature 27 లాంచ్ డేట్ కన్ఫర్మ్.. 200MP కెమెరా, Dolby Vision సపోర్ట్, ప్రీమియం డిజైన్
-
PM Modi: పర్యావరణ పరిరక్షణతోనే ఆర్థిక ప్రగతి.. ప్రపంచానికి భారత్ ఆదర్శం
-
West Bengal Bypolls: మమతా బెనర్జీకి మరో షాక్.. రేజీనగర్ అభ్యర్థి కూడా బరి నుంచి ఔట్
-
Indian Cinema: పాన్ ఇండియా నుంచి పాన్ వరల్డ్ మార్కెట్ వైపు అడుగులు వేస్తున్న ఇండియన్ సినిమాలు
-
Kishan Reddy: కాంగ్రెస్, బీఆర్ఎస్కు హైకోర్టు తీర్పు చెంపపెట్టు.. కేంద్ర మంత్రి కీలక వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!