ప్రభుత్వ ఉత్తర్వులను ప్రజలకు అందుబాటులో ఉంచాలని ఏపీ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. జీవో విడుదల చేసిన 24 గంటల్లో వెబ్ సైట్ లో అప్ లోడ్ చేయాలని ప్రభుత్వానికి తెలిపింది. వాసాలమర్రిలో దళిత బంధు అమలుపై హైకోర్టులో విచారణ జరుగుతుంది. వాచ్ వాయిస్ ఆఫ్ పీపుల్ సంస్థ పిల్ పై సీజే హిమాకోహ్లీ, జస్టిస్ విజయ సేన్ రెడ్డి ధర్మాసనం విచారణ జరిపారు. నిబంధనలు ఖరారు చేయకుండానే దళిత బంధుకు నిధులు విడుదల చేశారన్నారు పిటిషనర్. దళిత కుటుంబాలన్నింటికీ దళిత బంధు వర్తిస్తుందన్న ఏజీ ప్రసాద్… నిబంధనలు ఖరారు చేసినట్లు వివరించారు. నిబంధనలకు సంబంధించిన జీవో వెబ్ సైట్ లో లేదన్నారు న్యాయవాది శశికిరణ్. జీవోలు ప్రజలకు అందుబాటులో ఉంచడానికి ఇబ్బందేమిటన్న హైకోర్టు… ఏజీ వివరణ నమోదు చేసి వాసాలమర్రిలో దళిత బంధుపై విచారణ ముగించింది.