AP Rains: రాబోయే 2 రోజులు ఏపీలో వానలే వానలు..!
- ఏపీలో రెండు రోజుల పాటు భారీ వర్షాలు
- ఏపీ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్ధ ఎండీ రోణంకి కూర్మనాధ్ వెల్లడి
- ఏపీలో గత ఆరు రోజులుగా ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP Rains: ఏపీలో గత ఆరు రోజులుగా ఎడతెరపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. మరో రెండు రోజుల పాటు ఇదే పరిస్ధితి ఉంటుందని ఏపీ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్ధ ఎండీ రోణంకి కూర్మనాధ్ తెలిపారు. రాష్ట్రంలో వర్షాలకు కారణం వాయుగుండమేనని అని ఆయన వెల్లడించారు. అలాగే ఎన్టీఆర్, పల్నాడు, కృష్ణా, ఏలూరు, అల్లూరి సీతారామరాజు జిల్లాలలో ఎక్కువగా భారీ నుంచీ అతిభారీ వర్షాలు కురుస్తాయని అంటున్నారు కూర్మనాధ్. ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని, ఉధృతంగా ప్రవహిస్తున్న కాలువలలో నుంచీ ఎవరూ వెళ్ళద్దని ఆయన సూచించారు.. ఇప్పటికే చంద్రబాబు వరద పరిస్ధితులపై సమీక్షించి తగు ఆదేశాలు జారీ చేశారని ఆయన తెలిపారు. మొత్తం జిల్లా యంత్రాంగాలకి సెలవులు రద్దు చేసి క్షేత్రస్ధాయిలో పని చేస్తున్నారని.. ఎనిమిది జిల్లాలకు ఇప్పటికే ప్రత్యేక సమీక్షను సీఎం చంద్రబాబు నిర్వహించారని చెప్పారు. ఏపీలో అనేక ప్రాంతాల్లో 5 సెం.మీ కంటే అధిక వర్షపాతం నమోదైందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ (ఏపీఎస్డీఎంఏ) ఎండీ రోణింకి కూర్మనాధ్ వెల్లడించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.
Read Also: Simhachalam: సింహాచలం గిరి ప్రదక్షిణను శాస్త్రోక్తంగా ప్రారంభించిన దేవస్థానం
Also Read
- AP Local Body Elections: స్థానిక ఎన్నికలకు అధికారులు రెడీ.. ఎస్ఈసీ అనిల్ చంద్ర పునేఠా కీలక ప్రకటన
- Are Shyamala: 3 నెలల్లో గంజాయి లేకుండా చేస్తామన్నారు.. ఏమైంది..? ప్రభుత్వాన్ని నిలదీసిన ఆరె శ్యామల
- Vijayasai Reddy: ఐదు కొత్త ప్రతిపాదనలు చేసిన సాయిరెడ్డి.. చంద్రబాబు, జగన్‌పై సంచలన వ్యాఖ్యలు
- Ambati Rambabu: స్థానిక ఎన్నికల వేళ సర్టిఫికెట్ల వివాదం.. అంబటి సంచలన ఆరోపణలు..
ఏపీ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్ధ ఎండీ మాట్లాడుతూ.. “గోదావరి నదికి వరద ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. కృష్ణా, గోదావరి నదులపై ఉన్న డ్యాంలను ఎప్పటికప్పుడు స్థిరీకరిస్తున్నాం.. ప్రకాశం బ్యారేజికీ ఎగువన ఎలాంటి ఇబ్బంది లేదు.. వరద ప్రభావం తక్కువే.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. చేపల వేటకు వెళ్ళే జాలర్లు వేటను విరమించుకోవాలి. తుఫాను తీరం దాటే వరకూ సముద్రం అల్లకల్లోలంగా ఉంటుంది.” అని ఆయన సూచించారు.
వాయవ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న వాయుగుండం ఒడిశాలోని చిలికా సరస్సుకు సమీపంలో కేంద్రీకృతమై ఉంది. వాయుగుండం గత మూడు గంటలుగా అదే ప్రాంతంలో స్థిరంగా కొనసాగుతోంది. ప్రస్తుతం ఈ వాయుగుండం ఒడిశాలోని పూరీ తీరానికి నైరుతి దిశగా 40 కిలోమీటర్లు, గోపాల్ పూర్‌కు ఈశాన్యంగా 70 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. ఇది క్రమేపీ వాయవ్యంగా కదులుతూ, ఒడిశా-ఛత్తీస్ గఢ్ భూభాగాలపైకి వచ్చే అవకాశం ఉందని భారత వాతావరణ సంస్థ (ఐఎండీ) వెల్లడించింది. ఇది రాగల 12 గంటల్లో బలహీనపడి తిరిగి అల్పపీడనంగా మారనుందని వాతావరణ శాఖ వెల్లడించింది.
తాజావార్తలు
-
Nobel Prize: సాహిత్యంలో నోబెల్ ఫ్రైజ్ గెలుచుకున్న కెనడా రచయిత్రి కార్సన్
-
Alias Rukmini: నితిన్‌ను ట్రాక్‌లోకి తెచ్చేందుకు నాని మాస్టర్ ప్లాన్.. రేపు ఉదయం 10:08కి బిగ్ బ్లాస్టింగ్ అప్డేట్!
-
Mahindra XUV 3XO CNG: మారుతి, టాటాలకు గట్టి పోటీ.. మహీంద్రా XUV 3XO CNGని తెస్తోందా?
-
Harish Rao : తుగ్లక్ నిర్ణయాలతో బొగ్గు ఉత్పత్తి పడిపోయింది..
-
TG SAFE : పండుగ వేళ అప్రమత్తమైన TG SAFE, ఎన్ఫోర్స్మెంట్ బృందాలు
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!