Harirama Jogaiah: వాలంటీర్ వ్యవస్థపై పవన్ కళ్యాణ్‌కు హరిరామ జోగయ్య లేఖ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Harirama Jogaiah Wrote Letter To Pawan Kalyan On AP Volunteers Issue: తన వారాహి యాత్రలో భాగంగా ఏలూరు సభలో జనసేనాని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు చేసినప్పటి నుంచి.. ‘వాలంటీర్ వ్యవస్థ’ టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది. ఓవైపు పవన్ వ్యాఖ్యలను వాలంటీర్లు, వైసీపీ నేతలు ఖండిస్తుండగా.. మరోవైపు పవన్ వ్యాఖ్యల్ని కొందరు సమర్థిస్తున్నారు. వాలంటీర్ వ్యవస్థలోని లోపాల్ని ఎత్తిచూపుతున్నారు. ఇప్పుడు తాజాగా మాజీమంత్రి హరిరామ జోగయ్య వాలంటీర్ వ్యవస్థపై పవన్ కళ్యాణ్‌కు ఓ లేఖ రాశారు. ఈ లేఖలో ఆయన వాలంటీర్ల సమస్యల్ని ప్రవస్తావిస్తూ.. వాటిని పరిష్కరించే దిశగా చర్యలు తీసుకోవాలని కోరారు.
Pawan Kalyan: మచ్ వెయిటింగ్ అనౌన్స్మెంట్ వచ్చేసింది ‘బ్రో’…
Also Read
- SIPB: విశాఖపట్నంలో ఉపాధి అవకాశాలు.. దిగ్గజ సంస్థల ఏర్పాటుకు ఎస్ఐపీబీ గ్రీన్ సిగ్నల్..
- CM Chandrababu: పేదల సొంతింటి కల సాకారం.. 28,445 కుటుంబాలకు సీఎం గుడ్‌న్యూస్
- Vijayasai Reddy: టీడీపీ, వైసీపీకి మూడో ప్రత్యామ్నాయం మేమే.. విజయసాయి రెడ్డి కీలక వ్యాఖ్యలు
- Bhumana Karunakar Reddy: టీటీడీ ఉద్యోగుల ఇళ్ల పట్టాల వివాదం.. భూమన కౌంటర్ ఎటాక్..
వాలంటీర్ వ్యవస్థ పేరుతో.. సుమారు రెండున్నర లక్షల మంది నెలకు రూ.5 వేల చాలీచాలని జీతంతో బ్రతుకుతున్నారని హరిరామ జోగయ్య ఆ లేఖలో తన ఆవేదన వ్యక్తం చేశారు. కనీస ఉపాధి కరువైన ఈ రోజుల్లో.. ప్రభుత్వం ఎంతమందికి ఉపాధి కల్పిస్తోందని ప్రశ్నించారు. వాలంటీర్ వ్యవస్థలో అధికశాతం వైసీపీ వారే ఉన్నారన్నది వాస్తవమని ఉద్ఘాటించారు. రాష్ట్ర ఎన్నికల మెమో 818 ప్రకారం.. వాలంటీర్ వ్యవస్థలో వైసీపీ వారు ఎక్కువగా ఉండటం వల్లే, ఎన్నికల ప్రక్రియలో వాలంటీర్ వ్యవస్థని ఉపసంహరించుకోవాలని జీవో ఇవ్వడం జరిగిందని అన్నారు. వాలంటీర్లను సంక్షేమ పథకాల అమలు కంటే.. అధికార పార్టీ తన ప్రయోజనం కోసమే ఎక్కువగా ఉపయోగించుకుంటోందని ఆరోపించారు. అవసరమైతే వాలంటీర్ వ్యవస్థని రద్దు చేయాలన్న పవన్ సంకల్పం మంచిదేనని సమర్థించారు.
Jeevan Readdy: బీసీలకు ఆర్థిక సాయం చేయని ప్రభుత్వం తెలంగాణ లోనే ఉంది..
అయితే.. ఈ వాలంటీర్ వ్యవస్థని పూర్తిగా రద్దు చేయడం కన్నా, కొన్ని ప్రతిపాదనలతో పునర్నిర్మించుకుంటే మంచిదని హరిరామ జోగయ్య తన అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు. వాలంటీర్ వ్యవస్థలో ఉన్న రెండున్నర లక్షలమంది మహిళలకు వాలంటీర్ ఉద్యోగాలు కల్పించాలని ఆకాంక్షించారు. వాలంటీర్లకు కనీసం 10వ తరగతి విద్యార్హత ఉండాలని, వారికి కనీస వేతనం రూ.10 వేలు కేటాయించాలని కోరారు. జనాభా నిష్పత్తిలో కులాలకు ప్రాధాన్యత కల్పించాలన్నారు. ఈడబ్ల్యూఎస్‌లో సంవత్సరానికి 8 లక్షల ఆదాయం మించని కుటుంబాలకే ఉద్యోగం అందాలన్నారు. జిల్లా కలెక్టర్ల అధ్యక్షతన నియామక కమిటీలను ఏర్పాటు చేసి.. అర్హులైన వారికే ఉద్యోగ లబ్ధి కలిగించాలన్నారు. రాజకీయ పార్టీలకు చెందిన వారిని వాలంటీర్లుగా నియమించకూడదని డిమాండ్ చేశారు. అలాగే.. 21 నుండి 30 సంవత్సరాల లోపు వయసున్న వారే ఉద్యోగానికి అర్హులుగా నిర్ణయించాలన్నారు.
తాజావార్తలు
-
Danam Nagender : దానం నాగేందర్‌పై అనర్హత వేటు.. స్పీకర్ నిర్ణయాన్ని పక్కనపెట్టిన హైకోర్టు
-
Nani: నా సినిమాలకు ఆ ట్యాగ్ వద్దు.. కుండబద్దలు కొట్టిన న్యాచురల్ స్టార్!
-
Uttam Kumar Reddy : తెలంగాణలో నీటి కొరత.. రైతులకు ఉత్తమ్ కీలక హామీ
-
Suvendu Adhikari: మమతకు ‘‘శ్రీరాముడి శాపం’’.. బెంగాల్ సీఎం ఫైర్..
-
Tarique Rahman: నవంబర్‌లో భారత్‌కు బంగ్లాదేశ్ ప్రధాని రెహమాన్? ఢిల్లీతో చర్చలు షురూ!
ట్రెండింగ్
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!
-
Asian Games 2026: జపాన్‌పై భారత్ ఘన విజయం.. సెమీస్‌కు దూసుకెళ్లిన హర్మన్‌సేన..!
-
Zepto, Blinkitలో భారీ ఆఫర్.. iPhone 18 Pro పై రూ.7,000 డిస్కౌంట్.. 10 నిమిషాల్లోనే మీ చేతిలోకి..