Jeevan Readdy: బీసీలకు ఆర్థిక సాయం చేయని ప్రభుత్వం తెలంగాణ లోనే ఉందని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి జీవన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. మాటలు చెప్పి మభ్య పెట్టడంలో కేసీఆర్ ని మించిన వాడు లేరని కీలక వ్యాఖ్యలు చేశారు. దళితులకు భూమి ఇస్తా అని మానేశారని మండిపడ్డారు. దళిత బంధు అందరికి ఇస్తా అన్నారు.. కోత పెటారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 2023-24 లో 17700 కోట్లు దళిత బంధు కోసం బడ్జెట్ లో పెట్టారని తెలిపారు. ఇప్పటి వరకు కనీసం నిబంధనలు కూడా ఫ్రేమ్ చేయలేదని అన్నారు. రెండు ఆర్థిక సంవత్సరాలలో నిధులు కేటాయించి విడుదల వాయిదా వేసి మోసం చేస్తున్నారు కేసీఆర్ అని ఆరోపణలు గుప్పించారు. బీసీ లకు ఆర్థిక సాయం చేయని ప్రభుత్వం తెలంగాణ లోనే ఉందని అన్నారు. నిరుద్యోగ బీసీ యువత ఒక్కడికి కూడా సాయం చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీసీ బంధు ఇస్తా అన్నారు? ఇప్పుడేమో కొన్ని కులాల వారికే లక్ష సాయం చేస్త అంటున్నారని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.
Read also: Harish Rao: ఆ కుటుంబం నుండి నేను చాలా నేర్చుకున్న..!
ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి.. మాటలు చెప్పి మభ్య పెడుతున్నారు కేసీఆర్ అని ఆరోపణలు చేశారు. కొత్తగా మైనార్టీ బంధు అని… కొత్త జీవో తెచ్చారని అన్నారు. ఇది ఇంకా ఆశ్చర్యకరమైన విషయమని అన్నారు. కేటీఆర్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఆయన రాజకీయంగా ఇంకా వృద్ధిలోకి రావాలని కోరుకుంటా అన్నారు. ఇప్పటి వరకు దళిత బంధు… బీసీ బంధు.. ఎంత మందికి ఇచ్చారో శ్వేతపత్రం విడుదల చేయాలని అన్నారు. కేసీఆర్.. మోడీ హాట్ లైన్ లోనే ఉన్నారని తెలిపారు. బయటకు మాత్రం… సహకరించడం లేదంటారని అన్నారు. మోడీ..కేసీఆర్ ఇద్దరు అల్లుకుని తిరిగినప్పుడు ఎందుకు కాళేశ్వరంకి జాతీయ హోదా తేలేదు? అని ప్రశ్నించారు. సహకరించకపోతే ఎందుకు అల్లుకుని ఉన్నావు మోడీతో అంటూ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు.
Milk Gang Arrest: మేడ్చల్ అడ్డాగా కల్తీ పాల దందా.. ముఠా గుట్టు రట్టు..