Pawan Kalyan: మచ్ వెయిటింగ్ అనౌన్స్మెంట్ వచ్చేసింది ‘బ్రో’…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రస్తుతం పవర్ స్టార్ పొలిటికల్ పనులతో బిజీగా ఉన్నారు. అందుకే బ్రో మూవీ ప్రమోషన్స్ భారమంతా మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ మోస్తున్నాడు. హీరోయిన్లతో కలిసి సినిమాను ప్రమోట్ చేస్తున్నాడు. పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ ఫస్ట్ టైం కలిసి నటించింన ఈ మెగా మల్టీస్టారర్ మూవీ జూలై 28న రిలీజ్‌కు రెడీ అవుతోంది. సముద్రఖని డైరెక్ట్ చేసిన ఈ మూవీని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వారు నిర్మించారు. కేతికా శర్మ, ప్రియా ప్రకాశ్ వారియర్లు హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇప్పటికే ఓవర్సీస్ లో ‘బ్రో’ అడ్వాన్స్ బుకింగ్స్ స్టార్ట్ అయ్యాయి. త్వరలోనే తెలుగు రాష్ట్రాల్లో బుకింగ్ ఓపెనింగ్స్ కానున్నాయి.
బ్రో ట్రైలర్ కూడా రిలీజ్ అయ్యి యుట్యూబ్ రికార్డ్స్ క్రియేట్ చేస్తోంది. ట్రైలర్ రిలీజ్ తర్వాత బ్రో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. ఆ ఎక్స్పెక్టేషన్స్ ని మరింత పెంచడానికి గ్రాండ్ ప్రీరిలీజ్ ఈవెంట్ కి రంగం సిద్ధం అయ్యింది. 25న గ్రాండ్‌గా ప్రీ రిలీజ్ ఈవెంట్ చేయనున్నట్లు మేకర్స్ అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇచ్చారు. హైదరాబాద్ శిల్పకళా వేదికలో ప్రీరిలీజ్ ఈవెంట్ జులై 25న సాయంత్రం 6 నుంచి నిర్వహిస్తున్నట్టుగా క్లారిటీ ఇచ్చారు మేకర్స్. గతంలో పవర్ స్టార్ రీ ఎంట్రీ ఇచ్చిన ‘వకీల్ సాబ్’ మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్ కూడా ఇక్కడే జరిగింది. ఈ ఈవెంట్‌కు పవర్ స్టార్ పవన్ కళ్యాణే స్పెషల్ గెస్ట్ అని చెప్పొచ్చు. బ్రో ఈవెంట్‌కు పవన్ వచ్చే ఛాన్సెస్ తక్కువని ఆ మధ్య ప్రచారం జరిగింది కానీ ఇప్పుడు పవన్ ఈ ఈవెంట్‌కు రావడం పక్కా అంటున్నారు. ఈ మధ్య పొలిటికల్ మీటింగ్స్ తప్పితే.. సినిమా ఈవెంట్లలో ఎక్కువగా కనిపించలేదు పవన్. అందుకే బ్రో సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం వెయిట్ చేస్తున్నారు పవర్ స్టార్ ఫ్యాన్స్.
Also Read
- Om: ధనుష్ - సాయిపల్లవి ‘ఓం’ కొత్త రిలీజ్ డేట్ ఇదే!
- Kalyani Priyadarshan: ఆ స్టార్ హీరోయిన్ ఇక తెలుగు సినిమాలు చేయదా? ముంబైకి మకాం మార్చడం వెనుక అసలు నిజం ఏంటి!
- Box Office Battle: దసరా బాక్సాఫీస్ విన్నింగ్ రేసులో ముందున్నదెవరు?
- Irumudi Record: బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ‘బాహుబలి 2’ను దాటేసిన ‘ఇరుముడి’.. సరికొత్త రికార్డు!
The much awaited Celebration is here! 😎
Get ready to witness The Synergy of @PawanKalyan & @IamSaiDharamTej
at the Grand Pre-release Event of #BroTheAvatar 💥📍 July 25th at Shilpakala Vedika, Hyderabad from 6 PM onwards! 🥳#BroTrailer ▶️ https://t.co/sd50DeV6kc… pic.twitter.com/orSFiEuir2
— People Media Factory (@peoplemediafcy) July 24, 2023
తాజావార్తలు
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Story Board: Fly Dubai విమానంలో అసలేం జరిగింది..?
-
Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
-
Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
-
OTR: తాడేపల్లిలో జగన్ మార్క్ క్లాస్! స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి తీరాల్సిందేనా?
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..