A Man Poured Petrol On Couple In Tadipatri: అనంతపురం జిల్లాలో తాడిపత్రిలో దారుణ ఘటన చోటు చేసుకుంది. కేవలం మద్యం తాగొద్దని, పద్ధతి మార్చుకోవాలని మందలించిన పాపానికి.. దంపతులపై ఓ దుండగుడు పెట్రోల్ పోసి నిప్పంటించాడు. వీరి పక్కనే నిద్రిస్తున్న యువతికి కూడా ఆ మంటలు వ్యాపించాయి. ఈ ఘటనలో ముగ్గురూ తీవ్రంగా గాయపడ్డారు. ఆ వివరాల్లోకి వెళ్తే..
RBI : కనిపించకుండా పోయిన రూ.88,000 కోట్ల విలువైన కొత్త రూ.500 నోట్లు.. స్పందించిన ఆర్‌బీఐ
తాడిపత్రి రూరల్ పరిధిలోని చుక్కలూరు రోడ్డులో శ్రీనిధి నల్ల బండల ఫ్యాక్టరీ ఉంది. ఈ ఫ్యాక్టరీలో నల్లపురెడ్డి, సరస్వతి దంపతులు కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. శనివారం రాత్రి ఈ దంపతుల ఫ్యాక్టరీ ఆవరణలో మంచి వేసుకుని పడుకున్నారు. వీరి పక్కనే మరో మంచం వేసుకొని, అదే ఫ్యాక్టరీలో పని చేసే పూజిత అనే యువతి నిద్రిస్తోంది. రాత్రి 11:30 గంటల సమయంలో.. సరస్వతి మరిది అక్కడికి చేరుకొని.. నిద్రిస్తున్న నల్లపురెడ్డి, సరస్వతిలపై పెట్రోల్ పోశాడు. ఇంతలో సరస్వతికి మెలకువ రావడంతో.. ఏం చేస్తున్నావురా అని ప్రశ్నించింది. ఈలోపే అతడు నిప్పంటించి, అక్కడి నుంచి పారిపోయాడు. పక్కనే నిద్రిస్తున్న పూజితకు సైతం మంటలు అంటుకున్నాయి.
Railway Technology: మూడు ట్రాక్ లపై నడిచే ట్రైన్.. ఎప్పుడైనా చూశారా..!
ఈ ఘటనలో నల్లపురెడ్డి, సరస్వతిలకు తీవ్ర గాయాలు అవ్వగా.. పూజిత చేతులు కాలాయి. తాగుడకు బానిస అయిన రామేశ్వర్‌రెడ్డిని.. రెండు రోజుల క్రితం తాము పద్ధతి మార్చుకోవాలని దండించామని బాధిత దంపతులు పేర్కొన్నారు. అది మనసులో పెట్టుకొని, అతడు ఈ దారుణానికి ఒడిగట్టారని వివరించారు. ఆ దంపతుల ఫిర్యాదు మేరకు.. పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. దంపతులతో పాటు యువతిని ఆసుపత్రికి తరలించి.. చికిత్స అందిస్తున్నారు.