Nuziveedu Guptha Nidhulu: నూజివీడులో కలకలం… గుప్తనిధుల కోసం తవ్వకాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఈజీమనీ కోసం తాపత్రయపడుతూ.. తమ కష్టాన్ని మరిచిపోతున్నారు చాలామంది ప్రబుద్ధులు. ఎవరో స్వామీజీ చెప్పారనో.. అక్కడ తవ్వితే భారీ నిధులు స్వంతం అవుతాయని నకిలీ బాబాల మాటలు నమ్మి తవ్వేస్తున్నారు. గత కొంతకాలంగా తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ చూసినా గుప్త నిధుల కోసం తవ్వకాలు సంచలనంగా మారాయి…గతంలో కృష్ణ జిల్లా కొండపల్లిలో తవ్వకాలు జరిగితే ఇప్పుడు తాజాగా ఏలూరు జిల్లా నూజివీడులో ఈ తవ్వకాలు కలకలం సృష్టిస్తున్నాయి….నూజివీడుకు చెందిన శ్రీనివాసరావు అనే వ్యక్తి గుప్త నిధుల కోసం ఏకంగా అతని ఇంట్లోనే 15 అడుగుల లోతు గొయ్యి తవ్వటం అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది.
గొల్లపల్లి గ్రామానికి చెందిన వేదాంతం శ్రీనివాసరావు భార్య పిల్లలతో ఎన్నో ఏళ్ల క్రితం వైజాగ్ లో సెటిల్ అయ్యాడు. బాగా చదువుకున్న ఇతగాడు అక్కడే ఓ ప్రైవేట్ కాలేజీ లో లెక్చరర్ గా కూడా పని చేస్తున్నాడు. ఇతనికి అతని సొంతూరైన నూజివీడు మండలం గొల్లపల్లి గ్రామంలో 100 ఏళ్ళ కాలం నాటి ఓ పురాతన ఇల్లు ఉంది…ఎంతో కాలంగా అక్కడ ఎవ్వరు వుండకపోవటంతో పూర్తిగా పాత బడిన ఆ ఇంటిని చూడటానికి అప్పుడప్పుడు శ్రీనివాసరావు వస్తుండే వాడు…. అలా అతను వచ్చిన ప్రతిసారి ఆ ఇంటి మధ్యలో గజ్జలు చప్పుడు, భూమి నుండి ఏవో విచిత్ర శబ్దాలు వస్తున్నట్లు భావించిన శ్రీను అనుమానంతో బెంగుళూరుకు చెందిన మునిసింగ్ ప్రేమ్ నాధ్ అనే స్వామిజీని పిలిపించి చూపించాడు.
Also Read
- OTR: మన్యం జిల్లా జడ్పీ చైర్మన్ పదవికి ఎస్టీ రిజర్వేషన్.. టీడీపీ నేతల్లో అసంతృప్తి
- Jana Sena Party: జనసేనలోకి పలువురు వైసీపీ నేతలు, ప్రముఖులు.. పార్టీ కండువా కప్పి ఆహ్వానించిన పవన్ కల్యాణ్..
- Sharannavaratri Special: శరన్నవరాత్రుల్లో ప్రత్యేక ఆకర్షణ.. కోటి రూపాయల కరెన్సీ నోట్లతో అమ్మవారికి విశేష అలంకరణ!
- AP Alliance Seat Sharing: సీట్ల సర్దుబాటుపై చర్చలు కొలిక్కి.. కూటమి నుంచి సింగిల్ లిస్ట్.. బొలిశెట్టి కీలక వ్యాఖ్యలు
Read Also: Marri Sasidhar Reddy: రాజకీయమా.. రిటైర్మెంటా?
శ్రీను ఇంటికి వచ్చిన ఆ బెంగుళూరు స్వామి ఇంటి మొత్తాన్ని పరిశీలించి ఇక్కడ ఏదో నిధి ఉన్నట్లు అనుమానంగా ఉందని చెప్పాడు. అంతే,…అప్పటి నుండి తన ఇంట్లో ఏదో బంగారు నిక్షేపాలు ఉన్నట్లు భావించిన శ్రీనివాసరావు తనతో తవ్వకాలకు సహకరించాలని చాలామంది స్నేహితులను కోరాడు. అలా గుప్తనిధుల కోసం గత వారం రోజులుగా ఇంట్లో తవ్వకాలు చేస్తున్నాడు….ఈ గుప్త నిధుల వేట సాగించేందుకు తనతోపాటు మరో ముగ్గురు వ్యక్తులను ఎంచుకున్నాడు.
గుప్తనిధుల విషయాలు తెలిసిన బెంగుళూరు పూజారిని , ఓ లాయర్ని ,ఇంకో వ్యక్తిని ఎంచుకున్నాడు…. గత కొద్ది రోజులుగా తన ఇంటిలో వస్తున్న శబ్దాలు వ్యవహారం వీళ్ళతో చెప్పి వాటిని బయటకు తీసేందుకు అందరూ కలిసి ముహూర్తం ఖరారు చేశారు… గత వారం రోజులుగా గొల్లపల్లి గ్రామంలో గుట్టుచప్పుడు కాకుండా పూజలు నిర్వహించి తవ్వకాలు ప్రారంభించారు..అలా ఇంటి మధ్యలో దాదాపు 15 అడుగుల పెద్ద గొయ్య తీసారు. వీరు తవ్వుతున్న సమయంలో శబ్దాలు రావటం పాడు బడ్డ ఇంటికి ఎవరెవరో కొత్త వారు వచ్చి హడావిడిగా తిరుగుతుండడంతో అనుమానం వచ్చిన చుట్టూ పక్కల గ్రామస్తులు పోలీసులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన పోలీసులు వీరిని అడ్డగించి మొత్తం నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. అంత తవ్వినా అక్కడ నిధులు దొరికింది లేదు. చివరాఖరికి వారి అత్యాశే వారిని కటకటాల పాలు చేసింది.
Read Also: BJP: బీజేపీ పార్లమెంటరీ బోర్డ్, ఎన్నికల కమిటీ ప్రకటన.. యోగి, గడ్కరీకి నోప్లేస్
తాజావార్తలు
-
Acer Sospiro A70 5G: Acer కొత్త 5G ఫోన్ లాంచ్.. డ్యుయల్ డిస్ప్లేలు, 20GB RAM, 64MP కెమెరా!
-
Story Board: ధరల మంట: రికార్డు స్థాయిలో ద్రవ్యోల్బణం.. పెరిగిన ధరలతో బతికేదెలా..?
-
Gold – Silver Prices: రూ. 8 వేలు తగ్గిన వెండి.. బంగారం ఎంత పతనం అయ్యిందంటే!
-
OTR: మన్యం జిల్లా జడ్పీ చైర్మన్ పదవికి ఎస్టీ రిజర్వేషన్.. టీడీపీ నేతల్లో అసంతృప్తి
-
ACP Vivek Bhagat: ‘‘కులం పేరుతో దూషించారు, నా పరువు తీశారు’’.. సీజేపీ నేతలపై ఏసీపీ వివేక్ భగత్ ఫిర్యాదు..
ట్రెండింగ్
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..
-
టాటా.. బైబై.. గయా.. WCL 2026 లీగ్ స్టేజీలోనే ఇండియా చాంపియన్స్ ఔట్..!
-
How To Grow Tej Patta In Pots: మార్కెట్ నుంచి తెచ్చే పని లేదు.. ఇంట్లోనే ఈజీగా బిర్యానీ ఆకు మొక్కను పెంచండి..