Ketan Agarwal Case: సియా తండ్రికి గుండెపోటు.. కూతురిని ఉరితీయాలని ప్రకటన
- సియా తండ్రికి గుండెపోటు
- ఐసీయూలో ప్రత్యేక వైద్యం
- కూతురిని ఉరితీయాలని ప్రకటన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నవమాసాలు మోసిన కన్నపేగు.. ఇంకోవైపు గుండెల మీద ఎత్తుకుని పెంచిన కన్నతండ్రి ప్రేమ. అల్లారి ముద్దుగా పెంచి పెద్ద చేసి ఓ ఇంటిరాలిని చేసి.. గొప్పగా ఉండాలని కోరుకున్నారు. కానీ ఆ కూతురే గుండెల మీద తన్నుతుందని ఏ మాత్రం ఊహించలేకపోయారు. కొద్దిరోజులుగా కన్న బిడ్డ చేసిన ఘనకార్యం గురించి మీడియా ఛానల్స్‌లో.. సోషల్ మీడియాలో వస్తున్న వార్తలను చూసి కన్నతండ్రి గుండె పగిలిపోయింది. దీంతో తీవ్రమైన గుండెపోటు రావడంతో సియా తండ్రి ఆస్పత్రి బెడ్ మీద పడ్డాడు. ఆస్పత్రిలో కోలుకుంటున్న తండ్రి.. తన కుమార్తెను.. ప్రియుడిని ఉరితీయాలని డిమాండ్ చేస్తున్నాడు.
తమ కుమార్తె దోషి అయితే.. వెంటనే ఉరిశిక్ష విధించాలని సియా తండ్రి ప్రవీణ్ గోయల్, తల్లి డిమాండ్ చేశారు. సియా తండ్రి గుండెపోటుకు గురవ్వడంతో ప్రస్తుతం పుణెలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ సందర్భంగాస్థానిక ఛానల్‌తో మాట్లాడారు.. ‘‘నిందితులైన వారికి అత్యంత కఠినమైన శిక్ష పడాలి.. ఆ శిక్ష విధించడంలో ఏమాత్రం ఆలస్యం జరగకూడదు అని నేను మనస్ఫూర్తిగా చెబుతున్నాను.’’ అని అన్నారు. సియా తల్లి పూజా గోయల్ మాట్లాడుతూ.. ‘‘నా కూతురు నేరం చేసి ఉంటే.. ఆమెకు వెంటనే ఉరిశిక్ష విధించాలి. నిందితులకు తప్పక శిక్ష పడాలి. ఇది ఒక తల్లి చెబుతున్న మాట.’’ అని పేర్కొన్నారు.
Also Read
సియా గోయల్ తండ్రి ప్రవీణ్ గోయల్ గురువారం అకస్మాత్తుగా అస్వస్థతకు గురై ఆసుపత్రిలో చేరారు. తీవ్రమైన ఛాతీ నొప్పితో బాధపడటంతో రూబీ హాల్ క్లినిక్‌కు తీసుకువెళ్లినట్లు సమాచారం. కేతన్ హత్య కేసు దర్యాప్తు వల్ల నెలకొన్న తీవ్ర ఒత్తిడి కారణంగా ఆయనకు గుండెపోటు వచ్చినట్లు తెలుస్తోంది. పరిస్థితిని పర్యవేక్షించడానికి ఐసీయూ చుట్టుపక్కల ప్రాంతాన్ని సురక్షితంగా ఉంచడానికి ఆసుపత్రి ప్రాంగణంలో కట్టుదిట్టమైన నిఘా ఏర్పాటు చేశారు. అధికారులు కుటుంబాన్ని నిశితంగా పర్యవేక్షిస్తుండగా, వైద్యులు నిందితుడి తండ్రి కోలుకోవడాన్ని.. ఆరోగ్య పారామితులను నిరంతరం పర్యవేక్షిస్తున్నారు.
పూణె యువ వ్యాపార వేత్త కేతన్ అగర్వాల్ తల్లిదండ్రులకు.. సియా తల్లిదండ్రులకు రెండు దశాబ్దాలుగా సంబంధాలు ఉన్నాయి. ఈ కారణంతోనే ఈ జంటకు వివాహం కుదుర్చారు. కానీ సియా మాత్రం ప్రియుడి మోజులో పడి.. పెళ్లి కాకముందే కాబోయే భర్తను కాటికి పంపేసింది.
తాజావార్తలు
-
Gummanur Jayaram: ‘రెబల్‌గా వేస్తే సినిమా చూపిస్తా..!’.. టీడీపీ నేతలకు ఎమ్మెల్యే గుమ్మనూరు సీరియస్ వార్నింగ్..
-
Anil Ravipudi: దీపూని పరిచయం చేసిన డైరెక్టర్ అనిల్ రావిపూడి.. ఇంతకీ ఎవరో తెలుసా?
-
Raaka : ఏకంగా గిన్నిస్ వరల్డ్ రికార్డు బద్దలుకొట్టిన అల్లు అర్జున్-అట్లీ!
-
Ameesha Patel: ఫస్ట్ డే కలెక్షన్ల కంటే హీరోయిన్ల ప్రమోషన్‌కే ఖర్చే ఎక్కువ! అసలు బండారం బయటపెట్టిన అమీషా పటేల్..
-
Irumudi : రూ.250 కోట్ల క్లబ్లో రవితేజ.. ఓటీటీని సైతం షేక్ చేస్తున్న ‘ఇరుముడి’!
ట్రెండింగ్
-
Abhishek Anand: ఉద్యోగం చేస్తూనే క్రికెట్.. జపాన్ జాతీయ జట్టుకు చేరిన భారతీయుడు.!
-
India Playing XI: ముగ్గురు స్టార్లకు విశ్రాంతి.. జపాన్‌తో తలపడే భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
-
32.85 కి.మీ మైలేజీ, ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో వచ్చేసిన Maruti Suzuki Swift CNG-AMT.. ధర కూడా తక్కువే.!
-
రూ.13.99 లక్షల ప్రారంభ ధరతో Tata Sierra Dark లాంచ్.. వేరియంట్లు, ఫీచర్లు, ధరల పూర్తి లిస్ట్ ఇదిగో..!
-
జమైకా కింగ్స్మెన్కు షాక్.. CPL 2026 ఛాంపియన్‌గా ఆంటిగ్వా అండ్ బార్బుడా ఫాల్కన్స్.!