YS Jagan Guntur Visit: నేడు గుంటూరు వైఎస్ జగన్.. మాజీ మంత్రి అంబటి కుటుంబానికి పరామర్శ..
- ఇవాళ గుంటూరులో మాజీ సీఎం వైఎస్ జగన్ పర్యటన..
- అంబటి రాంబాబు కుటుంబ సభ్యులను పరామర్శించనున్న జగన్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
YS Jagan Guntur Visit: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇవాళ గుంటూరు జిల్లా పర్యటనకు వెళ్లనున్నారు. ఇటీవల జరిగిన ఘటన నేపథ్యంలో మాజీ మంత్రి అంబటి రాంబాబు కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు జగన్ గుంటూరు వెళ్లనున్నారు. ఉదయం 10 గంటలకు తాడేపల్లి లోని తన నివాసం నుంచి రోడ్డు మార్గంలో బయలుదేరనున్న వైఎస్ జగన్, ఉదయం 11 గంటలకు గుంటూరులోని అంబటి రాంబాబు నివాసానికి చేరుకుంటారు. అక్కడ అంబటి కుటుంబ సభ్యులను పరామర్శించి, వారికి ధైర్యం చెప్పనున్నారు. అదేవిధంగా అంబటి రాంబాబు నివాస సమీపంలో దాడికి గురైన వైసీపీ కార్యాలయాన్ని కూడా జగన్ పరిశీలించనున్నట్లు సమాచారం. ఈ సందర్భంగా పార్టీ నేతలతో పరిస్థితులపై చర్చించే అవకాశం ఉంది. అనంతరం మధ్యాహ్నం 12 గంటలకు గుంటూరు నుంచి తిరుగు ప్రయాణమై, మధ్యాహ్నం 1 గంటకు తాడేపల్లి లోని తన నివాసానికి వైఎస్ జగన్ చేరుకోనున్నారు. ఇటీవల గుంటూరులో చోటు చేసుకున్న రాజకీయ ఉద్రిక్తతల నేపథ్యంలో జగన్ పర్యటన ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ పర్యటనతో రాష్ట్ర రాజకీయాల్లో మరింత చర్చకు దారి తీసే అవకాశాలు కనిపిస్తున్నాయి.
Also Read
- Vinukonda: అత్యాచారం చేశాడంటూ ఫిర్యాదు.. పోలీస్ స్టేషన్ లో లొంగిపోయిన మాజీ సీఐ చినమల్లయ్య.!
- Tenali: మహిళ సెల్ఫీ సూసైడ్ కలకలం.. పోలీసుల వేధింపులే కారణమంటూ ఆవేదన.!
- Ambati Rambabu: పెట్రో ధరలపై రిక్షా తొక్కి అంబటి నిరసన.. రెడ్ బుక్ నా మీదే కాదు.. జనసేన వాళ్లపై కూడా అమలు..!
- Guntur Job Fraud: ఉద్యోగాల పేరుతో విద్యార్థులకు భారీ మోసం.. కోట్లు నొక్కేశాడు..
తాజావార్తలు
-
CM Revanth Reddy : మహిళల చేతుల్లోనే తెలంగాణ ప్రగతి
-
DK Shiva Kumar: సగం తిన్న ఆపిల్ విసరడం అహంకారమే.. డీకేపై బీజేపీ ఫైర్..
-
Protein Foods: ఏ ప్రోటీన్ పౌడర్ అవసరం లేదు.. కేవలం రూ.30లోనే ఉత్తమ పోషకాహారం పొందవచ్చు..!
-
Tragedy: హైదరాబాద్లో భారీ వర్షానికి ఇద్దరు బలి..
-
India A vs Sri Lanka A: ఇండియా ‘ఎ’ సంచలన బోణీ.. లంకపై భారత్ థ్రిల్లింగ్ విక్టరీ!
ట్రెండింగ్
-
Sleep Tips : ప్రశాంతమైన నిద్ర కోసం ఈ 7 అలవాట్లకు దూరంగా ఉండండి
-
Cumin Water Benefits : కడుపు సమస్యలకు నేచురల్ సొల్యూషన్ ఇదే.!
-
India Fertility Rate: యువ భారత్కు వృద్ధాప్య గండం.. పిల్లల్ని కనాలంటేనే ఎందుకు భయపడుతున్నారు?
-
Global Birth Rates: ఐఫోన్ ఎంట్రీతో దారుణంగా పడిపోయిన జననాల రేటు.. అసలు 2007-2024 మధ్య ఏం జరిగిందంటే..?
-
Vivo Y31s 5G లాంచ్.. IP69K+ రేటింగ్, 6500mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్ తో అదిరిపోయే ఫీచర్లు.!